ఎర్ర మందారాలు మూవీ షూటింగ్ ప్రారంభంలో.

ఎర్ర మందారాలు మూవీ షూటింగ్ ప్రారంభంలో గొలనకొండ వేణు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జనగాం జిల్లా పెంబర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఛండికా సోమేశ్వర స్వామి దేవస్థానములో జరిగిన “ఎర్ర మందారాలు” తెలుగు సినిమా ప్రారంభోత్సవంలో నిర్మాత వై. జగన్ ఆహ్వానం మేరకు ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొలనకొండ వేణు పాల్గొన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.తొలి ప్రయత్నంలో వేణు స్నేహితుడు “ఎర్ర మందారాలు” తెలుగు సినిమా నిర్మాత యెలికట్టె జగన్నాథం గౌడ్ మణికంఠ ఫిలిమ్స్ పై నిర్మిస్తూ రాజ్ కుమార్ కథానాయకుడిగా యుగేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తెలుగు సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని, ఆహ్లాదపరుస్తుందని, మనసుకు హత్తుకుంటుందని వేణు అన్నారు. బలమైన కథతో త్వరలో మీ ముందుకు రాబోతున్న ఎర్ర మందారాలు సినిమా సంచనాలతో రికార్డ్ సృష్టిస్తుందని ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులతో పాటు తెలంగాణ, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఆదరించి విజయవంతమైన సినిమాగా నిలిపి ఓరుగల్లు కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రారంభోత్సవంలో ఆర్టీసీ బీసీ సంఘం నర్సంపేట డిపో అధ్యక్షుడు కందికొండ మోహన్ పాల్గొన్నారు.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారని కొత్త ఆశయాలతో,కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారు చేసి జీవితం లోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలని ఈ పండుగ సందర్బంగా నూతన ఉత్సాహాన్ని,శుభ ఫలితాలను అందిస్తుందన్నారు.ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ఆనవాయితీ. శుభ కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమమైన సమయమని ఉగాది సందేశం. కొత్త ఆరంభాలకు,పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు సంతృప్తిని అందిస్తుందని ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందం,ఆరోగ్యం,శాంతితో నింపాలి కొత్త సంవత్సరం మీకు విజయాలు,సంతోషాన్ని తీసుకురావాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version