తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం.

తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం

 

మాల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 29:

 

మాల్కాజిగిరి నియోజికవర్గం, మౌలాలీ డివిజన్‌లో బత్తిని నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పాత సఫిల్‌గూడ దర్గా మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు రామ్ మోహన్పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని నరసింహ గౌడ్, చింతల నరేష్ ముదిరాజ్, ప్రణయ్ చంద్ర, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డా. కృష్ణ, జీలా రాములు, రమణయ్య, పరమేశ్, మౌలాలీ, అన్వేష్, అవినాష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చట్కూరి నారగౌడ్ ఆధ్వర్యంలో 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరిపారు. తదనంతరం నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాల చేసి తెదేపా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సూర్య నాయక్ హాజరై రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి నూతన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. స్థానిక సంస్థల్లో తెదేపా పార్టీ నుండి ఫోటిలో ఉండబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రహ్లాద, బందారపు మల్లారెడ్డి, లింగాల దాసు, కట్టెల బాలయ్య, లచ్చ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version