సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా..

సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా

స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’

కొన్నిసార్లు బాక్సాఫీస్‌ మేజిక్‌ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’ (Saiyaara). కుర్ర హీరోయిన్‌ అనీత్‌ పడ్డా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్‌’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్‌ బ్యూటీ విశేషాలివి.

 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో… ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 22 ఏళ్ల అనీత్‌ పడ్డా (Aneet Padda)కు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. స్కూలింగ్‌ పూర్తయ్యాక ఢిల్లీకి వెళ్లిన అనీత్‌.. అక్కడి జీసస్‌ మేరీ కాలేజీలో డిగ్రీ (సోషియాలజీలో) పూర్తిచేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. ‘సైయారా’ సినిమా చిత్రీకరణ సమయంలోనూ షూటింగ్‌కి హాజరవుతూనే, డిగ్రీ పరీక్షలు రాసింది. ‘ఆమె కమిట్‌మెంట్‌, అంకితభావం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు డైరెక్టర్‌ మోహిత్‌ సూరి (Mohit Suri). అనీత్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేయడానికి డైరెక్టర్‌ మోహిత్‌ సూరికి సుమారు 5 నెలలు సమయం పట్టిందట. ముఖం, శరీరానికి ఎలాంటి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకోని 20-22 ఏళ్ల యువతి ఆ పాత్రకు కావాలని మోహిత్‌ పట్టుబట్టారట.

 

ఈ క్రమంలో వందలాది మందిని ఆడిషన్‌ చేశారు. అనీత్‌ తన ఆడిషన్‌ వీడియోని మొదట మొబైల్‌లో పంపిందట. అది నచ్చడంతో నేరుగా వచ్చి ఆడిషన్‌ ఇవ్వమన్నారట. తీరా ఆడిషన్‌ ఇచ్చాక, ఆమె నటన బాగాలేదని డైరెక్టర్‌ దాదాపుగా రిజెక్ట్‌ చేయాలనుకున్నాడు. కానీ అహాన్‌ పాండే (Ahaan Panday) (‘సైయారా’ హీరో) డైరెక్టర్‌ని ఒప్పించి, ఆమెకు మరో అవకాశం ఇవ్వమని కోరాడట. కట్‌చేస్తే.. డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యింది. అనీత్‌ ఆడిషన్‌కు వేసుకెళ్లిన డ్రెస్‌ లుక్‌నే సినిమాలో పెట్టారు.సినిమాల్లోకి రావాలని చిన్నతనం నుంచే కలలు కనేదట. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకుంది. మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి నెస్‌ కెఫే, క్యాడ్‌బరీ, మ్యాగీ, పేటిఎం, అమెజాన్‌ లాంటి వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది.

 

మూడేళ్ల క్రితం రూపొందిన ‘క్యాడ్‌బరీ’ యాడ్‌తో బాగా పాపులరైంది. 2022లో కాజోల్‌ ప్రధానపాత్రగా వచ్చిన ‘సలామ్‌ వెంకీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. బోర్డింగ్‌ స్కూల్‌ డ్రామాగా సాగే ఈ సిరీస్‌లో ‘రూహీ’ అనే పాత్రలో రెబల్‌ గాళ్‌గా కనిపించి, అందరినీ ఆకట్టుకుంది అనీత్‌. తాజాగా ‘సైయారా’ సక్సెస్‌ కావడంతో ఆ యాడ్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనీత్‌కు ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆ సమయంలో గిటారు వాయిస్తూ, తనలోని గాయనిని బయటకు తెస్తుంది. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ను తెగ ఇష్టపడుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ అనీత్‌ దిట్టే. మంచి సింగర్‌ కూడా. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ కోసం ‘మాసూమ్‌’ పాటను తనే రాసి, తనే కంపోజ్‌ చేసి పాడింది.

 

ఎప్పటికీ మర్చిపోలేని తన చిన్ననాటి జ్ఞాపకం గురించి ప్రస్తావిస్తూ… స్కూల్‌లో జరిగిన ఒక నాటకం కోసం తన కనుబొమలను, కనురెప్పలను కత్తిరించుకున్నట్లు తెలిపింది. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ సాహసంగానే అనిపిస్తుందట. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ సుందరి తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ పంచుకుంటుంది. ‘సైయారా’ సినిమాకు ముందు ఈ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేల మంది ఫాలో అయితే.. సినిమా విడుదలైన తర్వాత ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. వారిలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం.

సినిమా హిట్

 

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు..

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు

పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

లోతట్టు ప్రాంతాలను, డంపింగ్ యార్డ్ పరిశీలించిన కమిషనర్

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కే.సుష్మ పారిశుధ్య పనుల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం కార్మికుల హాజరు పుస్తకాన్ని పరిశీలించి అలసత్వంతో విధులకు హాజరువ్వని వారికి గైర్యాజరు వేశారు.వర్షాకాలాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పారిశుధ్యం పైన మరియు లోతట్టు ప్రాంతాలలో నిలిచిఉన్న నీటిని ఎప్పటికప్పుడు మల్లించాలని జవాన్ లకు సూచించారు.అనంతరం డంపూయార్డ్ ను పరిశీలించి చెత్తను సేకరించే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని,పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిస్క్యు టీంను ఏర్పాటు చేశామన్నారు.ఏదైనా సమస్యలు తలెట్టితే స్థానిక జవాన్ లు మహేష్(9550629997),సతీష్(7386881788),రాజు(9177557767)గల నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

 

 

 

 

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

 

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali).

దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

అది తెరపై కనిపించింది.

ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది.

బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే.

అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది.

ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది.

ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి.

అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.

ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట.

నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  

పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు.

దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది.

వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది.

అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి.

దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.

  పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయిక.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం.

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపిటిసి రాము మాట్లాడుతూ. నేను పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు .నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి చర్చకు సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందo పొందాలని కుట్రలు మానుకోవాలని నిజా నిజాలు తెలుసుకొని రుజువు చేయాలని ఆధారాలు ఉంటే చర్చకు రావాలని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదిక గా పోస్టులు పెట్టడం నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని నా గురించి నా గ్రామ ప్రజలకు నా గురించి తెలుసు తెలుసు అని. మీ ప్రభుత్వ హాయంలో పేదలు ప్రజల భూములను అన్యాయం గుంజుకొని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా. మరోసారి నాపై అసత్య ఆరోపణ చేస్తే సహించేది లేదు ఇకనైనా నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి ఎక్కడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తమపై ఆరోపణలు చేసిన వారికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ గౌడ్ జలంధర్ రెడ్డి చరణ్ యాదవ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version