గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుకాణాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ముందుగా వారు స్టాక్ బోర్డును పరిశీలించి 616 యూరియా బ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడద్దని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది వారితో పాటు డి ఏ ఓ బాబురావు ఎం ఏ ఓ ఐలయ్య ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో భాస్కర్ గణపురం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి పాల్గొనడం జరిగింది

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం..

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం

* పట్టపగలే గోదాముల ముందు అమ్మకాల దందా
* పట్టించుకుని సంబంధిత ఉన్నతాధికారు

మహాదేవపూర్ జూలై 28 (నేటి ధాత్రి)
గిరిజనులను ప్రైవేటు వ్యాపారుల దోపిడి నుండి రక్షించాలని, గిరిజనులతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు వస్తుసేవలను అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఏర్పడిన గిరిజన సహకార సంస్థ అవినీతికి అక్రమాలకు నిలయంగా మారింది. సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సప్లై చేస్తామని జిసిసి చెప్పడంతోటే ప్రైవేటు టెండర్లు రద్దుచేసి జిసిసికి కాంట్రాక్టును కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జిసీసీ నుండి వచ్చిన సరుకులను మహాదేవపూర్ లో జిసిసి గోదాం అధికారులు పట్ట పగలే గోదాముల ముందు సరుకులను ఏదేచ్చగా అమ్ముతూ మరి కొంత సరుకులను హోల్ సేల్ దుకాణా దారులకు ఇష్టం వచ్చినట్లు కమిషన్ రూపం లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఇదేం పనులు చేస్తున్నారు అని కొందరు వ్యక్తులు అడుగగా ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని, ఎవ్వరికి చెప్తావో చెప్పుకో అని నేనొక్కడినే ఈ సొమ్ము తింటలేనని అందరి అధికారులకు ముట్టచెప్పుడే అని మాట్లాడటం విశేషం. గోదాముల దగ్గరనే సరుకులు మాయం కావడంతో హచ్చర్య పోతున్న మండల ప్రజలు హాస్టళ్లకు చేరక విద్యార్థులు ఏం తింటున్నారో ఏమి పెడుతున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైన ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ, సామాన్య ప్రజల సొమ్మును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి

అఖిల భారత పద్మశాలి యువజన సంఘ మండల అధ్యక్షులు బాసాని సాయితేజ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం స్థానిక ఎన్నికల్లో పాటు చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి. అఖిలభారత పద్మశాలి యువజన సంఘం మండల అధ్యక్షుడు బాసని సాయితేజ మాట్లాడుతూ గత 7 సంవత్స రాల నుండి చేనేత సంఘము ఎన్నికలు జరుగకా ఇంచార్జి లతో సంఘము నడుస్తుంది. సంఘలో సరైన ఉపాధి లేక చేనేత వస్త్ర పరిశ్రమ మరు గున పడుతుందని నాడు వస్త్ర పరిశ్రమల్లో అగ్రగామిగా ఉన్న శాయంపేట వస్త్ర పరిశ్రమనేడు మరుగున పడటం బాధాకరo ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి పద్మశాలి కార్మికు లకు అండగా ఉండాలి. ఇప్ప టికైనా వెంటనే ఎన్నిక జరిగితే శాయంపేటను రాష్టంలో అగ్ర గామి వస్త్ర పరిశ్రమగ తీర్చిది ద్దచ్చు .త్వరగా ఎన్నికలు నిర్వ హించి పద్మశాలి కార్మికులను ఉపాధి కలిపించాలి అలాగే సంఘలో నూతన సభ్యతలు ఇవాలి మరియు పద్మశాలి యువతకి ఉపాధి కల్పిం చాలని కోరడమైనది.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం.నేటిధాత్రి

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార
ఎరువుల సరఫరా పై పరిశీలించిన కలెక్టర్ పాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసినారు తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంట కు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవలెనని అధికారులకు ఆదేశించిన
ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించాడు మరియు కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ.

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం తంగళ్ళపల్లి మండలరైతులకు అన్ని రకాలుగా వ్యవసాయ రుణాలు కానీ సంబంధిత పంటల అవసరాలకు రైతులకు సహకార సంఘం ఎంతో ఉపయోగపడుతుందని. మండలంలో ఉన్న రైతులందరూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇప్పటిదాకా జరిగిన వాటిని రైతులకు ప్రజలకు వాటి గురించి వివరంగా వివరించారు సహకార సంఘానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చయితున్నాయి తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడిపించడం జరుగుతుందని. దీనిలో వచ్చే ఆదాయం ఎంత దాని గురించి కూడా సంఘం అభివృద్ధిలో కలుపుతున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధిపై మండల రైతులు మీరు కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణ రెడ్డి డైరెక్టర్లు బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు రైతులు సహకార సంఘం సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version