తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవం
మాల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 29:
మాల్కాజిగిరి నియోజికవర్గం, మౌలాలీ డివిజన్‌లో బత్తిని నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పాత సఫిల్‌గూడ దర్గా మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు రామ్ మోహన్పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని నరసింహ గౌడ్, చింతల నరేష్ ముదిరాజ్, ప్రణయ్ చంద్ర, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డా. కృష్ణ, జీలా రాములు, రమణయ్య, పరమేశ్, మౌలాలీ, అన్వేష్, అవినాష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.