డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు.

డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీత నగర్ సిరిసిల్ల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుండి దాదాపు లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ లో 25 బాలబాలికలు మరియు దాదాపు 25 మంది డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ లో బాలబాలికలు ఉత్తీర్ణు లైన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందజేసినటువంటి మెమోలు ఈరోజు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యల్.శారద అందజేసినారు ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు రాయడానికి అర్హత కేవలం ఎనిమిదవ తరగతి చదివే పిల్లలనుండి డిగ్రీ పీజీ వరకు చదివే పిల్లలు వరకు అర్హులు భవిష్యత్తులో ఇట్టి పరీక్షలలో పాసైన వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగము హైదరాబాదు వారు నిర్వహించే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ చేయడానికి అర్హులు అవుతారని ప్రధానోపాధ్యాయురాలు గారు చెప్పారు ఇట్టి టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ప్రభుత్వ డ్రాయింగ్ మాస్టర్స్ గా ఉద్యోగం పొందడానికి అర్హులవుతారు మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ పరీక్షలు కూడా ఇట్టి నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు వారు కూడా క్రాఫ్ట్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులవుతారని చెప్పారు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి పరీక్షలకు అందరూ ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి చేశారు. ఈ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తో పాటు డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అర్హులవుతారని చెప్పారు.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.!

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా ఉందని తెలుసుకున్నారు ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. అలాగే. తంగళ్ళపల్లి జెడ్పిహెచ్ఎస్. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా పంచాయతీ . సెక్రెటరీ కి. ప్రతిపాదనలు
అందజేయాలని ప్రిన్సిపల్ కి సూచించారు. ఇట్టి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట. ప్రిన్సిపల్ . సూపర్డెంట్. శంకర్ నారాయణ శారద ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సమీక్ష.

టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సమీక్ష

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

జిల్లాలో మే 13న సజావుగా టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులలో ప్రవేశాల నిమిత్తం మే 13న ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు జరిగే టీజీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2136 మంది విద్యార్థులు టిజి పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 7 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రశ్నా పత్రాల తరలింపు అవసరమైన బందోబస్తు కల్పించాలని అన్నారు.పరీక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద కరెంట్ కోతలు ఉండవద్దని అన్నారు. విద్యార్థులకు అవసరమైన రూట్ లలో బస్సులు నడిచేలా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకేట్లతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ చంద్రయ్య,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి డా.రజిత, సెస్, ఆర్.టి.సి, విద్యా, మున్సిపల్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి…

తంగళ్ళపల్లి నేటి దాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలంలో బస్సాపూర్ గ్రామంలో సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ . తంగళ్ళపల్లి మండల లో బస్వాపూర్ అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కేంద్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా బ్లడ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అంధత్వం నివారణ వారత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ లో సోమవారం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానలువైద్యం అందించాలని తెలిపారు బస్వాపూర్ లోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు హాజరు శాతం పాఠశాలలో బోధిస్తున్న తీరు విద్యార్థుల ఉపాధ్యాయులు హాజరులను పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం జిల్లా వైద్య అధికారి రజిత వైద్యులు నయు మా జహా సంపత్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..

పరీక్ష కేంద్రల వద్ద పటిష్ట బందోబస్తు..

 

రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి (మెదక్)

 

పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద రామాయంపేట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కాకుండా ఎవరు వచ్చిన లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్కాపింగు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల మాస్ కా పింకు అవకాశం ఉండదని మంచి లక్ష్యంతో చదువుకొని ఉత్సాహంగా పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .

అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version