మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమం లో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్లమలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సిసి కుమారస్వామి,మహిళా సంఘం సభ్యులు కావ్య, లక్ష్మి,రాధ,ప్రియాంక,రాణి, సుగుణ,చందన,ఎరుకల భారతి,పొన్నాల సునీత,యారా రజిత,పెళ్లి పద్మ, ఎరుకల సుకపాల,సిసి రాజు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లో ఈ నెల 19 న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహకులు తెలిపారు. ఉదయం 6:30 నిముషాలకు స్థానిక ఎం ఆర్ ఎచ్ ఎస్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉంటుంది అని తెలిపారు. నియోజకవర్గం కు చెందిన క్రిస్టియన్ యూత్ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో గురువారము సాయంత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని ఝరాసంగం, కుప్ప నగర్ సిద్ధాపూర్ బొప్పనపల్లి, తదితర గ్రామాలలో మోస్తారు. వర్షం కురిసింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు విజయవంతం చేయండి

గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్రమహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25 ,26, 27 ,తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంనర అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు రాష్ట్రానికి ఇప్పుటీ వరకు విద్యశాఖ మంత్రి లేరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు .

ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.ఈమహాసభలకు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారీ శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన.!

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోషణ పక్షం..ఆరోగ్య లక్ష్యం.

పోషణ పక్షం..ఆరోగ్య లక్ష్యం

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్.కవిత మాట్లాడుతూ ఒక శిశువు యొక్క జీవితంలో మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అలాగే గర్భిణీ,బాలింతలు తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి,తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువు వయసుకు తగిన బరువు ఉండేలా మంచి పౌష్టికాహారం పెట్టాలని తాజా పండ్లు, కూరగాయలు,పాలు ఆకుకూరలు,చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు పెట్టాలని బయట జంక్ ఫుడ్ పెట్టకూడదని చెప్పారు.లోప పోషణ గల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రజిత, అంగన్వాడీ టీచర్లు విజయ,అంజమ్మ జ్యోతి,సరిత,ఆయాలు మహిళా సంఘాల సిఏ లు, వివో లు,పిల్లల తల్లిదండ్రులు ఇతరులు పాల్గొనడం జరిగింది.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం

ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి

అంతర్గాం గీతా కార్మికులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో నేటి ధాత్రి కెమెరాకి కనిపించారు.ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు వేసవిలో లభిస్తాయన్నారు.తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు,పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నారు.గీతా కార్మికులైన వారు ఇరువురు పల్లెటూరు నుండి పట్టణ ప్రజల అందుబాటులోకి ముంజలను తీసుకువచ్చి అమ్ముతూ
ఉపాధి పొందుతున్నామన్నారు.తాటి ముంజల యొక్క ప్రయోజనాలను వారి మాటల్లో వివరించారు.తాటి ముంజలలో వేసవి వేడిలో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు, ఐరన్,జింక్,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారని చెప్పారు.తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని,కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని, అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయని వైద్యులు చెబుతుంటే విన్నామని తెలిపారు.

కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు

జైపూర్,నేటి ధాత్రి:

 

కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి వడ్ల సెంటర్లను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తెలుసుకొని సన్న రకం వడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందని కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరూ దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల సత్యనారాయణ రెడ్డి,మంతెన లక్ష్మణ్,చల్ల విశ్వంభర్ రెడ్డి,పండుగ రాజన్న,శీలం వెంకటేష్,లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు.!

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు

ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన
కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,  పాల్గొన్నారు

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా.

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా

కాలనీలలో అగ్నిప్రమాదాల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది

పరకాల నేటిధాత్రి.

 

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 17 ఏప్రిల్ రోజున పరకాల అగ్ని మాపక కేంద్ర అధికారి వక్కల భద్రయ్య ఎస్ఎఫ్ఓ మరియు సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణ కుమార్,ఎఫ్ఎం సత్యం,దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ సత్తయ్య లు సౌందరయ్య హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ ఫైర్ అయిన సందర్భంలో పేసెంట్ ప్రాణాలు కాపాడే పద్ధతులు,వృద్ధులు, చిన్న పిల్లలను ముందుగా ఏవిధంగా కాపాడి రక్షించాలి అనే మెలుకువల గురించి తెలియజేశారు.గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు, నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,ఈత కు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని వాటి నివారణ చర్యల గురించి,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

Fire Accident.

మాధారం కాలనిలో కాలానివాసులకు వివరించిన ఫైర్ సిబ్బంది

అగ్ని మాపక కేంద్ర అధికారి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మాదారం ఏరియాలోని ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు,నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,చెరువులు, బావులలో ఈత సరదాకు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు.!

కోటగుళ్లలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ.!

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ స్త్రీలు మరియు గృహనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూసమతుల్య ఆహారం పిల్లలకు మరియు స్త్రీలకు చాలా అవసరమని పాలు మరియు గ్రుడ్డు సముతుల్య ఆహారంలో భాగమని వివరిస్తూ మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు కళాశాల ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు సహాయ ఆచార్యులు డాక్టర్ మాధవి మాట్లాడుతూ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలు మొదటి 1000 రోజులు అనగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు నిండే వరకు పోషకాహాలతో నిండిన ఆహారం ముఖ్యమని వివరించారు డాక్టర్ సంపత్ కుమార్ సహాయ ఆచార్యులు మరియు కళాశాల దత్త గ్రామం నిర్వాహకులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమని కరోనా తర్వాత మన ఆహారం అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు నేటి పిల్లల రేపటి దేశ పౌరులని వివరిస్తూ వారు ఆరోగ్యం దేశ భవిష్యత్తు నిర్వహిస్తుందని అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అంగన్వాడి అధికారులు పాఠశాల విద్యార్థులు గృహనులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు.

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు వెంటనే ఎత్తివేయాలని నిరసన

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో నంబర్ వన్ గా సోనియాగాంధీ,నెంబర్ టు గా రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించింది మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయా త్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి.రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.

 

Congress

సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిన హెరాల్డ్ కేసులను వెంటనే ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్ మార్కండేయ, చిందం రవి, మారేపల్లి రవీందర్, కట్టయ్య, రాజేందర్ మోత్కూరు భాస్కర్, చింతల రవిపాల్, పోలపెల్లి శ్రీనివాసరెడ్డి, ఎండి రఫీ, బాసని శాంత- రవి, అన్ని గ్రామాల కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతుకు పరిహారం ఇవ్వాలి.

పంట నష్టపోయిన రైతుకు పరిహారం ఇవ్వాలి

తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలు, గాలివానల కారణం గా పంట నష్టం జరగడంతో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో అకాల గాలి వర్షానికి నష్టం జరిగిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. మాట్లాడుతూ రైతులు తీవ్ర నష్టానికి గురైన పంటలు వరి, మొక్క జొన్న, అరటి వంటివి నేలకూలి, నాశనమయ్యాయి. ఈ కారణంగా గ్రామాల్లో రైతులు అప్పుల బారిన పడే ప్రమా దంలో ఉన్నదని రైతుల పరిస్థితి నిజంగా హృదయాన్ని కలచివేస్తోంది. కొన్ని కుటుం బాల్లో పంటపై పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి పొందే అవకా శం లేకుండా పోయింది. చాలా మంది రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు కోత కోయక ముందే నాశనం కావడంతో కన్నీటి పర్యంతరం అయ్యారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి

 

Farmer

మాట్లాడుతూ గాలివాన బీభత్సంతో నోటికాడికి అందిన అన్నం మెతుకులు నేలరాలిన విధంగా పంట నాశనం అయ్యిందని పెట్టుబడి సాగుకు వడ్డీకి అప్పులు చేసి పంటను ఆరుగాలంకస్టించి చేతికందే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యము వలన పంట మొత్తం నేలమట్టం కావడం చాలా దురదృష్టకరమని దీనిపై వెంటనే స్పందించి అధికారులు ప్రభుత్వం రైతులకు తగు న్యాయం చేయాలని
ఈ దారుణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు చేశారు.వెంటనే నష్టం అంచనా వేయడానికి అధికారులను పంపించాలి, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలి.నష్టపరిహారం మంజూరులో పారదర్శకత ఉండాలి,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను ఈ ఆసంగి పంటకాలానికి కూడా అమలు చెయ్యాలి రైతులసమస్యలను పట్టించుకోకపోతే, బీజేపీ రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, బిజెపినాయకులు, మేకల సుమన్ కోమటి రాజశేఖర్, రైతులు, కోలా మల్లయ్య, కోలా కిషన్, అనుమాండ్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.పంట నష్టానికి గల కారణాలను రైతుల అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి,పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని,నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులు ప్రజాప్రతినిధులు,రైతులు ఉన్నారు.

ప్రజా నాయకుడు ఉజ్వలుడు….!

ప్రజా నాయకుడు ఉజ్వలుడు….!

◆ : వృత్తి రీత్యా వైద్యుడైన పేదల పెన్నిధి

◆ : ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ చిరాగ్ పల్లిలో పాఠశాల నిర్మాణం

◆ : ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు

” ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 


ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు భరోసా కలిపించే వాడే నాయకుడు, తండ్రి బాటలో నడుస్తూ వృత్తి రీత్యా వైద్యుడు ఆయన వైద్యునిగా కొనసాగుతూనే జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు నేనున్నాని భరోసా కలిపిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటు పేద ప్రజల సమస్య తీరుస్తున్న నాయకుడు ఆయన, అతని ఎవరో కాదు చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ మండలం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరాగ్ పల్లి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్, ఉజ్వల్ రెడ్డి గత కొంతకాలం నుండి అమెరికాలో వైద్య సేవలు చేస్తూ తాను జన్మించిన గడ్డపైన పేదలకు ఎదో మంచి చేయాలనుకుని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించారు కాని ఎంపీగా టికెట్ రాకపోయిన కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి క్రమశిక్షణ కలిగి, నేటి జహీరాబాద్ ఎంపీ సురేష్ కెట్కర్ కు మద్దతుగా ఆయన విజయానికి కృషి చేశారు. కాని ఎంపీ టికెట్ రాలేదని ఎక్కడ నిరాశచందకుండా పేద ప్రజలకు అండదండగ ఉంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, పేద ప్రజల సమస్యలను ఓపిగగా వింటు తన సొంత సమస్యగా పరిగనించి పరిష్కరిస్తున్న నాయకుడు. ఇటీవలే జహీరాబాద్ మండలం తన స్వగ్రామం అయిన చిరాగ్ పల్లిలో పేద విద్యార్థుల గురించి సొంత నిధులు ఖర్చు చేసి దాదాపు 6కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని సంకల్పించి సేవ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడు ఉజ్వల్ రెడ్డి, ఎటువంటి వారు సహాయం కోరిన చిరునవ్వుతో వారిని పలకరించి సమస్య తీరుస్తున్న నాయకుడు సౌమ్యుడు ప్రజల మేలు కోరే నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజకీయాలు వేరు ప్రజా సమస్యలు వేరుగా చూసి రాజకీయాలకు అతీతంగా సేవచేస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. ప్రజా సేవకుడు ప్రజలను సేవలందిస్తున్న మహా నాయకుడు ప్రజల ఆపదనులను ఆదుకుంటున్న ప్రజా నాయకులు ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు
డాక్టర్ ఉజ్వల రెడ్డి.

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన.!

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఇండియన్ నేషనల్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి అధ్యక్షతన అభినందించి బహుమతిని(ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి దుంపేటి లాస్య నీ
శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య, ఎ.జి.యం అన్నపూర్ణ అకాడమిక్ కోఆర్డినేటర్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్ కుమార్,రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

రయ్…. రయ్ మంటూ కుర్రకారు జోష్ డ్రైవింగ్..

రయ్…. రయ్ మంటూ కుర్రకారు జోష్ డ్రైవింగ్..

వేసవి సెలవుల్లో కుర్రకారుపై పోలీసులు నిఘా పెట్టాలి…

యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం కోల్పోతున్నారు…..

రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెంచాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

వేసవి సెలవులు రాగానే పిల్లల్లో ఎక్కడా లేని సంతోషం కనిపిస్తుంది. రయ్ … రయ్ మంటూ కుర్రకారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతుంటారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం చేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి అవి కన్నవారికి కడుపుకోత మిగులుస్తాయి. బడిలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు.

 

Driving

చదువుకోవలసి ఉండడంతో విరామం దొరకదు. వేసవి సెలవుల్లో అధిక సమయం ఖాళీగా ఉండే నేపథ్యంలో రాత్రి,పగలు రోడ్లపైకి వెళ్లి బైక్ లపై ముగ్గురేసి పిల్లలు, యువకులు ఎక్కి హై స్పీడ్ లో వెళ్తూ, సడన్ గా బ్రేకులు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ సిబ్బందితో నిఘా పెట్టాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

 

Driving

ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ర్యాష్ డ్రైవింగ్,ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాల పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం, రైల్వే స్టేషన్, కాకతీయ కాలనీ, ఆర్కే ఫోర్ గడ్డ, ఆదివారం సంత సమీపంలోని సింగరేణి క్వార్టర్స్, నాగార్జున కాలనీ, సింగరేణి సిహెచ్పి, ఏ జోన్ ఏరియాలలో యువకులు సిగరెట్లు సేవిస్తూ, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు సైతం ప్రజల నుండి వినిపిస్తున్నాయి. సింగరేణి ప్రాంతం కావడంతో పిల్లల తండ్రులు సింగరేణి ఉద్యోగానికి వెళ్తుంటారు.

 

Driving

ఈ సందర్భంలో వేసవి సెలవులు కావడంతో కుర్రకారు స్నేహితులు తో కలిసి కాలక్షేపానికి అలవాటుపడి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, పోలీసులు నిఘా పెంచి యువకులను క్రమశిక్షణలో పెట్టేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పిల్లలు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం..

ఆర్కెపి ఎస్సై జి రాజశేఖర్

వేసవి సెలవులు ఉన్నాయని తల్లిదండ్రులు మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే చర్యలు తీసుకుంటాం.పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. హెల్మెట్, లైసెన్స్ లేకుంటే కేసులు నమోదు చేస్తాం.ర్యాష్ డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బందితో నిఘా పెంచుతాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version