చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్‌ను పవర్ హౌస్ అని అంటారు. దీనిని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు, బరువు పెరుగుతారు. అలర్జీ, ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T164359.535.wav?_=1

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐడీఎస్ఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి. కుమార్ మాట్లాడుతూ-కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా.

స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం.

దాతల కొరికపై
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదాలకంటే-అన్నదానం గొప్పది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం శనివారం రోజున కాంట చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ నగర్ కు చెందిన కీర్తిశేషులు చిట్యాల శ్రీనివాస్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో…ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 339వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు స్వర్గీయ చిట్టాల శ్రీనివాస్ గారి 8వ వర్థంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 339వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమం లో దాతల కుటుంబ సభ్యులు బందు మిత్రులు చిట్యాల సాయి కృష్ణ, కోట శ్రీనివాస్ , మోహన్, బాబు, సాయి, అశ్విన్
అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ,గన్నెవరం తిరుమల చారి,MD యుసుఫ్,MD ముస్తాఫా,అబ్దుల్ రహీమ్
పాల్గొన్నారు.

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు..!

 

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించండి..!

 

వర్షాకాలంలో ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అయితే, వర్షాకాలంలో ఈ కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌

వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు, ఎందుకంటే తేమ కారణంగా బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన, అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కడుపు ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.

వంకాయ

వంకాయలలో కూడా టేప్‌వార్మ్ కనిపించే అవకాశం ఉంది. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే, మొత్తం వంకాయను పారవేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పురుగులు వంట తర్వాత కూడా జీవించగలవు, వీటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని లార్వా మెదడులోకి ప్రవేశిస్తే, అది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది.

బీరకాయ

బీరకాయ వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫైబర్ పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో ఇది కీటకాలతో ఉంటుంది. దానిలో ఉండే పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ పురుగులను తింటే, అవి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

క్యాబేజీ

క్యాబేజీ పొరల మధ్య టేప్‌వార్మ్‌లు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. వాటిని శుభ్రం చేసి సరిగ్గా ఉడికించకపోతే, వాటి గుడ్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి శరీరం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. మీరు తినాలని అనుకుంటే క్యాబేజీని ఉపయోగించే ముందు నీటిలో మరిగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

క్యాప్సికమ్

క్యాప్సికమ్ లోపలి భాగంలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. సరిగ్గా కడగకపోతే, టేప్‌వార్మ్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.

సన్న బియ్యమైతే మాకేంటి..

సన్న బియ్యమైతే మాకేంటి..?

◆:-గ్రామాల్లో జోరుగా అక్రమ దందా

◆:-ద్విచక్ర వాహనాలపై తరలింపు

◆:-మరమరాల పేరిట కొనుగోళ్లు

◆:-కోళ్లపారాల దాణాగా సరఫరా

◆:-రాష్ట్రాలు దాటుతున్న పేదల రైస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర
రేఖకు దిగువ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభు త్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. రేషన్ షాపు నుంచి ప్రజల వద్దకు వెళ్లిన బియ్యం కాస్త అక్రమార్కుల ఒడిలోకి వెళ్లి కాసుల కురిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వెళితే సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన నారాయణఖేడ్, కంగ్జి, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్ మండలాలకు చెందిన కొందరు అక్రమార్కులు మోటార్ వాహనా లు, టీవీఎస్, మోటార్ సైకిల్, హీరో హోండా వాహనాలపై ఉదయం 6గంటలకే న్యాల్ కాల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మండలాల్లోని వివిధ గ్రామాలకు తరలివచ్చి ప్రజల వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు లేదా తెల్ల మురమురాలు తయారు పేరిట దొడ్డు బియ్యం కొనుగోలు చేసిన మాదిరిగానే సన్నబియ్యాని సైతం సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం కోసం రూ.23, రాష్ట్రం ఒక కిలో సబ్సిడీ సన్న బియ్యం పంపిణీ కోసం సుమారుగా రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి.

Free Ration Rice.

రాష్ట్రం దాటిస్తున్న అక్రమార్కులు..

బియ్యాన్ని కోళ్ల ఫారాలకు, రాత్రివేళ కర్ణాటక, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల క్వింటాల బియ్యం తరలిపోతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు విమర్శ లు ఉన్నాయి. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ తరలిం పు వ్యవహారం చూసీచూడ నట్లు వదిలేస్తున్నారు. వీరి దందా ఉదయం 6గంట లకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకూ కొనసాగుతోంది. అయితే ఇవి కోళ్లపారాలకు కూడా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమా ర్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఈ వంటకాలు యమాటేస్ట్ గురూ..

ఈ వంటకాలు యమాటేస్ట్ గురూ..

1904లో హిందూ సుందరి పత్రికా సంపాదకులు సత్తిరాజు సీతారామయ్య గారు వంటలక్క అనే పుస్తకంలో ‘సుర్మాలాడూ’ అనే వంటకాన్ని వివరించారు. ఇది చూర్మాలడ్డూ అనే గుజరాతీ వంటకానికి తెలుగు రూపం కావచ్చు. చూర్మా అనేది చూర్ణాన్ని బట్టి వచ్చిన పేరు! రోటీల్ని మెత్తగా చూర్ణం చేసి పాలకోవా, బెల్లం, ఏలకులపొడి వగైరా కలిపి నేతితో లడ్డూ కడితే అదే చూర్మాలడ్డూ!

తెలుగు సుర్మాలడ్డూలకూ దీనికీ కొంత తేడా ఉంది: మన ఆహారంలో రోటీలకు ప్రాధాన్యత తక్కువ కాబట్టి రోటీలను విరిచి దంచే

ప్రక్రియకు బదులుగా కొత్త ప్రక్రియలో సుర్మాలడ్డూ తయారు చేశారు. తెలుగు వారి స్వంత లడ్డూ ప్రక్రియ ఇది. వంటలక్క పుస్తకంలో ఈ ‘సుర్మాలాడూ’ తయారీ గురించి వివరంగా ఉంది:

మొదట పంచదార/బెల్లం పాకం పట్టుకోవాలి! కాగిన పాలను ఈ పాకంలో పోసి అవి చిక్కబడి, తడంతా ఇగిరి పోయేంత దాకామరిగిస్తే, పాత్రలో తియ్యని పాలకోవా మిగులుతుంది. ఇంకో భాండీలో శనగపిండి తీసుకుని కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ ఎర్రపడేలా వేగించి, ఇందులో ఈ పాలకోవాని కలిపి నేతితో లడ్డూలు కట్టుకోవాలి. రుచి, పరిమళాల కోసం ఏలకుల పొడి, పచ్చకర్పూరం, పటిక బెల్లం, జీడిపప్పు వగైరా కలుపుకోవచ్చు. నువ్వులు లేదా గసగసాలు అద్దుకోవచ్చు! పాలకోవాని పిండినీ కలిపి తయారు చేసిన లడ్డూ ఇది!

 

లడ్డూలకు తొలి రూపం ‘చూర్మాలడ్డు’యే కావచ్చు. భారతీయ తీపి సంప్రదాయానికి మధుర మణి లాంటిది చుర్మాలడ్డూ! గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, సుగంధ ద్రవ్యాలు కలిసిన లడ్డూ ఇది! తెలుగువారు అదనంగా పాలకోవాని చేర్చటం గమనార్హం!

మహారాష్ట్రులు చపాతీలడ్డూ లేదా రోటీ లాడూ అంటారు వీటిని. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో వీటిని ‘చూరి’ అని పిలుస్తారు! రొట్టెని చిన్న ముక్కలుగా విరిచి, నేతిలో వేగించి, బెల్లంతో కలిపి దంచి లడ్డూలు కడతారు.

రాజస్థాన్‌లో ‘బాటీలు’ అనే నిప్పులమీద కాల్చిన గోధుమ పిండి బంతుల్ని, దాల్‌ అనే పప్పుకూరనీ, చూర్మా లడ్డూనీ కలిపి ఒక ప్లేటులోవడ్డిస్తారు. ‘దాల్‌ బాటీ చుర్మా’ అనేది త్రిమూర్తుల్లా రాజస్థాన్‌లో వాడుక పదం! గుప్తుల కాలంలో కూడా ఇవి ప్రసిద్థి చెందిన కాంబినేషన్‌! మేవార్‌ రాజ వంశీకులు ‘దాల్‌ బాటీ చుర్మా’ని వాడకంలోకి తెచ్చారని చరిత్ర. ఈ ఆహారత్రయంవండటం తేలిక. యుద్ధకాలంలో ఒక చోటునుండి ఇంకో చోటుకు తరలించటానికి అనువుగా ఉంటాయి.

వీటిలో దాల్‌ తయారు చేయటానికి కంది పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మసూరు(ఎర్ర)పప్పు లను విడివిడిగా దోరగా వేయించి అన్నీ కలిపితే దాన్ని రాజస్థానీయులు ‘పంచమేల్‌ దాల్‌’ అంటారు. దాంతో పప్పుకూర వండుతారు. నలుడు పాకదర్పణంలో పంచ రత్నాల పప్పు అన్నాడు దీన్ని. భీముడు ఈ ఐదు రకాల పప్పుల్నీ కలిపి నెయ్యి వేసి వండాడని ప్రతీతి! రోజువారీగా మన ఇళ్లలో కూడా కేవలం కందిపప్పుతోనో పెసరపప్పుతోనో కాకుండా పంచరత్నాలతో పప్పు వండుకోవటం ఆరోగ్యదాయకం!

 

కొబ్బరి లౌజు లడ్డూలు, మినపసున్ని ఉండలు, మరమరాల ఉండలు, వేరుశనగ పప్పు ఉండలు, బూందీ లడ్డూ, తొక్కుడు లడ్డూ, పూస మిఠాయి లడ్డూ, నువ్వుండలు, ఓట్సు లడ్డూలు ఇలా ఎన్నో లడ్డూలు ఇప్పుడొచ్చాయి. చుర్మాలడ్డూ వాటన్నింటి కన్నా ప్రాచీనం! రాజస్థానీయులు ఇప్పుడు పూరీ వత్తి, చాకుతో డైమండ్‌ ఆకారంలో కోసి నూనెలో వేగించి దంచి చూర్మాలు చేస్తున్నారు.

పిండిని గుండ్రంగా బంతిలా చేసి నిప్పుల మీద పొర్లించి, పైబెరడు వలిచేస్తే అదే బాటీ.

ఉడికిన పంచమేల్‌ పప్పులో కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు, వగైరా కలిపి కొంతసేపు ఉడకనిచ్చి తాలింపుపెట్టిన దాల్‌తో ఈ బాటీల్ని నంజుకుంటూ మధ్యమధ్య చుర్మాలడ్డూ తియ్యగా కొరుక్కొంటూ… ఆహారాన్ని ఇలా కూడా ఆస్వాదిద్దాం!

బ్రెడ్‌ ఉప్మా కావలసిన పదార్థాలు: బ్రెడ్‌-మూడు ముక్కలు, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, ఆవాలు-అర స్పూను, మినప్పప్పు-అర స్పూను, కరివేపాకు రెబ్బలు-రెండు, కొత్తిమీర తరుగు-రెండు స్పూన్లు, అల్లం పేస్టు-ముప్పావు స్పూను, పచ్చి మిర్చి ముక్కలు-అర స్పూను, ఉల్లి ముక్కలు-పావు కప్పు, టమాటా ముక్కలు-అర కప్పు, పసుపు-కాస్త, కారం-అర స్పూను, చక్కెర – అర స్పూను, నిమ్మరసం-అర స్పూను.

తయారుచేసే విధానం: బ్రెడ్డును చిన్న ముక్కలుగా కట్‌ చేసి, ఓ ప్యాన్‌లో రెండు వైపులా కరకరలాడేలా వేయించాలి. అదే ప్యాన్‌లో కాస్త నూనె వేసి జీడిపప్పును దోరగా వేయించి, పక్కన పెట్టాలి. ఆ నూనెలోనే ఆవాలు, మినప్పప్పు వేయించాలి. కాస్త రంగు మారాక కరివేపాకు, ఇంగువ, అల్లం పేస్టు జతచేయాలి. ఆ తరవాత టమాటాలు, పసుపు, ఉప్పు, చక్కెర చేర్చి కలపాలి. టమాటాలు కాస్త మెత్తబడ్డాక రెండు స్పూన్ల నీళ్లని కలిపి అంతా దగ్గరయ్యాక బ్రెడ్డు ముక్కలు, జీడిపప్పు కూడా చేర్చి, బాగా కలపి స్టవ్‌ కట్టేయాలి. కొత్తిమీర తరుగు పైన చల్లితే సరి.

కావలసిన పదార్థాలు: ముర్మురాలు-రెండు కప్పులు, ధనియాల పొడి- స్పూను, మిరియాల పొడి- స్పూను, కారం-స్పూను, గరం మసాలా – పావు స్పూను, ఆమ్‌చూర్‌-స్పూను, ఉప్పు-స్పూను, వేయించిన పల్లీలు – పావు స్పూను, ఉల్లి, టమాటా, కీరా, పచ్చి మిర్చి, ఉడికించిన ఆలు ముక్కలు-ముప్పావు కప్పు, అల్లం ముక్కలు-స్పూను, నూనె-స్పూను, నిమ్మరసం – స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం: ఓ పాన్‌లోని ముర్మురాలు వేయించి స్టవ్‌ ఆపేయాలి. ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, గరం మసాలా, ఆమ్‌చూర్‌, ఉప్పు, వేయించిన పల్లీలు, కూరగాయల ముక్కలు వేసి స్పూను నూనెని జతచేసి అంతా కలిసేలా చూడాలి. అల్లం ముక్కలూ వేయాలి. నిమ్మరసాన్ని పిండి అంతా బాగా కలిపి కొత్తిమీరను చల్లితే బెంగాలీ ఝాల్‌మురి తయారు. మన భేల్‌పురి కంటే ఇది కాస్త కారం ఎక్కువగా ఉంటుంది.

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ..

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ.. ఎలా తయారుచేసుకోవాలి అంటే?

భారతదేశంలో చాలామంది ఇష్టపడే వాటిలో బిర్యానీ ఒకటి.  బిర్యానీలో చాల రకాలు ఉన్నాయి. వాటిలో గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి.  గోంగూరతో పచ్చడి, కూరలు మాత్రమే కాదు. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేయవచ్చు. పుల్ల పుల్లగా నోరూరించే టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీలలో ఒకటి. ఈ రోజు ఆంధ్రాస్టైల్ లో నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ కేజీ, ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి, అల్లం వెల్లుల్లిపేస్ట్,టొమాటో – ప్యూరీ, గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు), కారం – 2 టీస్పూన్,పసుపుచిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – తయారీకి సరిపడా, నీరు – ఒక కప్పు, మసాలా పొడి

ఈ బిర్యానీ కోసం ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ గా చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీయించి టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంటలో వేయించాలి.
బోన్ లెస్ చికెన్ పీసెస్ వేసి తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత కొంచెం కారం, పసుపు వేయండి. తర్వాత కాస్త  నీరు ఆడ్ చేసి పాన్ మీద మూత పెట్టండి. సుమారు 10-15 నిమిషాలు ఉడికించి మూత తెరిచి మసాలా పొడి వేసి బాగా కలపండి. ఉప్పు వేసి గోంగూర చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు: బాస్మతి రైస్ – 750 గ్రాములు, వేయించిన నిలువగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు, జీడిపప్పు, కుంకుమపువ్వు – కొంచెం ,రోజ్ వాటర్ ,పచ్చిమిర్చి – 8 నుంచి 10, పుదీనా ఆకులు – 1 టీస్పూన్, కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా.ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమన్నీ అందులో వేసుకోవాలి. తర్వాత నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మూత పెట్టండి. చివరిగా తక్కువ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధం.

హరిత భోజన సౌందర్యం.

హరిత భోజన సౌందర్యం…

‘సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్‌’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు.

సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్‌’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు. భారతీయమైన సలాడ్లు అనేకం ఉన్నాయి. ‘భోజన కుతూహ లం’ పాకశాస్త్ర గ్రంథంలో సలాదుల అధ్యా యమే ఉంది! కొన్ని సలాదుల్ని పరిశీలిద్దాం.

ఆమ్ర హరితం (మామిడిపండు సలాడ్‌): రుచికరం. వాతాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని, వేడినీ పెంచుతుంది. జీర్ణశక్తిని తగ్గిస్తుంది.

బింబీ హరితం (దొండపండు సలాడ్‌): శరీరం బరువుని పెంచుతుంది. కాంతినిస్తుంది. వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది.

మూలక హరితం (ముల్లంగి సలాడ్‌): తేలికగా అరుగుతుంది. జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది. త్రిదోషాల్ని సమంగా ఉంచుతుంది కారవేల్లక హరితం (కాకరకాయ సలాడ్‌): జాఠరాగ్ని పెరుగుతుంది. షుగరు వ్యాధిలో తినదగింది. నులిపురుగులు పోతాయి.

రంభాకాండ హరితం: (అరటిదూట – కాం డం, ఊచ): శరీరంలో వేడి, మంటలు, రక్త స్రావం తగ్గుతాయి. ఆలస్యంగా అరుగుతుంది.

కైదర్య హరితం (కరివేపాకు సలాడ్‌): రుచి, సుగంధ భరితం, త్రిదోషాల్ని హరిస్తుంది. క్షయ కుష్టు, జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది.

శృంగవేర హరితం (అల్లం సలాడ్‌): ఉప్పుతో నూరిన అల్లంముద్దని మొదటిముద్దగా తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. నాలుకపైన జిగురు పోతుంది. త్రిదోషనివారకం, వాపు, ఉబ్బరం, క్షయ, నిమ్ము తగ్గుతాయి. బలకరం. శుక్ర వర్ధకం. నిమ్మరసంలో ఊరబెట్టిన అల్లంసలాడ్‌ కఫాన్ని వేడినీ తగ్గిస్తుంది కంఠరోగాలు పోతాయి. లివర్‌, స్లీ ్పన్‌ వ్యాధుల్లో మంచిది. అల్లం+బెల్లం సలాడ్‌ బలకరం. వాతం కఫం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. చింతపండు రసంతో అల్లం సలాడ్‌ కఫాన్ని పెంచుతుంది.

గజకర్ణీకందమూల సలాడ్‌ (సారచేమదుంప సలాడ్‌): ఏనుగు చెవి లాగా పెద్దపెద్ద ఆకులుండే మొక్క దుంప వేడి చేస్తుంది. కఫాన్ని వాతాల్ని, పాము విషాన్ని హరిస్తుంది. కుష్ఠు, రక్త హీనతల్ని తగ్గిస్తుంది.

కూష్మాండ హరితం (బూడిద గుమ్మడి సలాడ్‌): జలుబు, పడిశభారం, వేడి వీటిని తగ్గిస్తుంది. బలకరం. లైంగిక శక్తిపెరుగుతుంది.

అసిశింబి హరితం (చెమ్మకాయ – స్వోర్డ్‌ బీన్‌) సలాడ్‌: ఆలస్యంగా అరుగుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది

వృంతాక హరితం (వంకాయ సలాడ్‌): వంకాయ ముక్కలు అల్లం, నిమ్మరసం,ఇంగువ, మిరియాలు కలిపిన సలాద్‌ కఫహరం.

మాకందికా హరితం (నల్ల ఆవాల మొక్క ఆకులతో సలాడ్‌): కఫవ్యాధుల్ని, అజీర్ణ వ్యాధుల్ని వాత వ్యాధుల్ని తగ్గిస్తుంది.బలకరం.

పారేవత హరితం (జామపండు సలాడ్‌): జామపండు ముక్కల్ని మసాలాలతో చేసిన సలాడ్‌ బలకరం, జీర్ణశక్తిని పెంచుతుంది.

తోయమాగధిక హరితం (జలపిప్పలి – బొక్కెన సలాడ్‌):దీని ఆకులు, ఫలాలు, ఫూలుసలాడ్‌కు అనుకూలంగా ఉంటాయి. కారంగా ఉంటుంది. దప్పికని కలిగిస్తుంది. జఠరాగ్నిని ఉత్తేజితం చేస్తుంది. విరేచనాల వ్యాధిని తగ్గిస్తుంది.

కదళీఫ లహరితం (అరటిపండు సలాడ్‌): తగిన మసాలాలతో అరటిపండు ముక్కల సలాడ్‌ వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది. బలకరం.

శారిబ హరితం (సుగంధిపాల వేళ్ళ సలాడ్‌): కఫ వ్యాఽధులు, వేడివలన కలిగే వ్యాధులు, అజీర్తివ్యాధులు చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది.

త్రపుస హరితకం (కీరదోస సలాడ్‌): తగిన మసాలాలతో తీసుకుంటే మూత్ర వ్యాధుల్ని నివారిస్తుంది. వేడిని తగ్గిస్తుంది.

మహాబదర హరితకం (యాపిల్‌ సలాడ్‌): రుచికరం, బలకరం, శిరో రోగాలను తగ్గిస్తుంది.

కోశాతకీ హరితకం (బీరకాయ సలాడ్‌): హృదయానికి మంచిది. అన్ని వ్యాధుల్లో హితకరం.

పటోలా హరితకం (తియ్యపొట్ల సలాడ్‌): తగిన సంబారాలతో పొట్లముక్కల సలాడ్‌ వాత కఫ దోషాల్ని హరించి చలవనిస్తుంది.

సలాడ్‌ కోసం బ్రొకోలీ లాంటి ఖరీదైనవే కావాలని లేదు. వండనవసరం లేకుండా, కొన్ని నేరుగా, కొన్ని అన్నంలో ఆధరవుగా, కొన్ని పచ్చళ్లుగా, కొన్ని మసాలాలతో, కొన్ని పెరుగుతో తినదగినవి మన కూరగాయల్లో ఉన్నాయి. తాలింపు అదనపు రుచినిస్తుంది!

– డా. జి వి పూర్ణచందు, 94401 72642

మసాలా పనియారం

కావలసిన పదార్థాలు: రవ్వ – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శనగలు- అర స్పూను, మినప్పప్పు-అర స్పూను, ఆవాలు – స్పూను, జీలకర్ర – అర స్పూను, కరివేపాకు రెబ్బలు-రెండు, స్వీట్‌ కార్న్‌ – రెండు స్పూన్లు, క్యాప్సికమ్‌, క్యారెట్‌, ఉల్లి ముక్కలు- ముప్పావు కప్పు, కొత్తిమీర – రెండు స్పూన్లు, అల్లం – ముక్క, పచ్చి కొబ్బరి తురుము – రెండు స్పూన్లు, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ – అర స్పూను, నీళ్లు, నూనె – తగినంత.

 

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో రవ్వ, పెరుగు, కాస్త నీళ్లు కలిపి పావుగంట పాటు నానబెట్టాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, శనగలు, మినప్పప్పు వేసి చిటపటలాడించాలి. కరివేపాకునూ చేర్చాలి. ఇంకా ఉల్లి, మిగతా కూరగాయల ముక్కలు, కొత్తిమీర, అల్లం, కొబ్బరి తురుము చేర్చాలి. ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌, తగినంత నీళ్లని కలిపి కాస్త జారు పిండిలా చేసుకోవాలి. గుంత పెనంలో నూనె వేసి రవ్వ పిండిని వేసి అటూ ఇటూ దోరగా ఉడికిస్తే మసాలా పనియారం తయారు.

అలసందల వడ

కావలసిన పదార్థాలు: అలసందలు – కప్పు, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి-మూడు, జీలకర్ర – స్పూను, ఉల్లి -అర కప్పు, ఉల్లి కాడలు – రెండు స్పూన్లు, కరివేపాకు రెబ్బలు- కొన్ని, ఇంగువ-కాస్త, కారం-పావు స్పూను, ఉప్పు, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: అయిదు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన అలసందలను మిక్సీలోకి తీసుకోవాలి. పచ్చి మిర్చి. అల్లం, జీలకర్రను కూడా చేర్చి రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరకుగా రుబ్బు ఉండేలా చూసుకోవాలి. ఈ రుబ్బును ఓ గిన్నెలోకి తీసుకుని ఉల్లి, కరివేపాకు, ఉల్లి కాడలు, ఉప్పు, ఇంగువ, కారం వేసి బాగా కలపాలి. చేతికి నూనె పూసుకుని ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసి నూనెలో వేయిస్తే అలసందల వడలు సిద్ధం. అయితే తక్కువ మంటమీదే కాల్చడం ఉత్తమం.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. 

విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి.

— నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలను విక్రయించిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలనీ, స్టాక్ బోర్డులను షాపులలో ప్రదర్శించాలని సూచించడం జరిగిందన్నారు. రోజువారి క్రయ, విక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
30 క్వింటల్ల వరి విత్తనలు స్వాధీనం
మండలంలోని కల్వకుంట గ్రామంలో ఆదివారం గుర్తింపు లేని ప్రదేశంలో ఉంచిన 30 క్వింటల్ల వరి విత్తనాలను స్వాధీన పరుచుకుని నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైన్బో అగ్రిటెడ్ సీడ్స్ కు సంబంధించిన మోహన్ అనే డీలర్ పై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడం జరిగిందన్నారు.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతులకు అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేతలు డా. దిలీప్ కుమార్, డా.విశ్వా తేజ్, మండల వ్యవసాయ అధికారి గంగ జమున వారి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” రైతుల అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

Farmer Awareness Program.

 

రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చుల ను తగ్గించుట, అవసరం మేరకు రసాయనా లు వినియోగం, రైతు సోదరు లు కొనుగోలు చేసిన విత్తనాల మరియు పురుగుల మందుల రసీదులను భద్రపరచు కోవ డం, పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయో జనాలు రైతులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, గ్రామపంచా యతీ కార్యదర్శి నాగశ్రీ, వ్యవ సాయ కళాశాల వరంగల్ విద్యార్థులు,కొత్తగట్టుసింగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన. !

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి”.

పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి” – ఎన్ని రోజులైనా ముక్క ఫ్రెష్, బూజు పట్టదు! –

◆ కొత్తవాళ్లైనా సరే! మామిడికాయ పచ్చడి ఇలా పెట్టండి – సంవత్సరం నిల్వ ఉంటుంది.

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో మామిడి కాయ (ఆవ కాయ) పచ్చడి పెడుతుంటారు. అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఒక్కసారి పెడితే సంవత్సరమంతా నిల్వ ఉండడమే గాకుండా చక్కని రుచి ఉండేది. కానీ, కొంత మంది సరైన కొలతలు, నిల్వ చేయడంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో ముక్క మెత్తబడడమే గాకుండా పచ్చడి బూజు పట్టేది. అందుకే ఇవాళ మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సరిగ్గా ఇవే టిప్స్ పాటించడం వల్ల ముక్క తాజాగా ఉండడంతో పాటు సంవత్సరమైనా సరే బూజు పట్టకుండా ఫ్రెష్​గా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు :

మామిడికాయ ముక్కలు – 1 కిలో

కల్లుప్పు – 200 గ్రాములు

ఆవాలు – 100 గ్రాములు

పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 80 గ్రాములు

మెంతులు – 1 టేబుల్​ స్పూన్లు

పచ్చడి కారం – 125 గ్రాములు

నువ్వుల నూనె లేదా పల్లీ నూనె – అర లీటర్​

పసుపు – అర టేబుల్ స్పూన్

 

ముక్క మెత్తబడకుండా, పచ్చడి బూజు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

Mango Pickle.

 

 

 

మామిడి కాయ పచ్చడిలో కారం దినుసులు కలపడం కంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం శుభ్రత. పదార్థాలైనా, వాటిని ఉపయోగించే గిన్నెలైనా సరే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి.ముక్కలకు ముందుగా నూనె పట్టించడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మెత్తబడకుండా కట్టిగా కరకరలాడుతుంటాయి.మామిడి కాయ నిల్వ పచ్చడి కోసం పెద్దవి కాకుండా మధ్యస్థంగా ఉన్న పుల్లని కాయలు ఎంచుకోవాలి.ముదురు రంగులో ఉన్న కాయలు రుచి బాగుంటాయి.పచ్చడిలో వేసే దినుసులు మొదలుకుని, వాడే పాత్రలు, జాడీల విషయంలో జాగ్రత్త వహించాలి.ఏ మాత్రం తేడా రాకుండా ఒక రోజు ముందుగానే ఎండలో ఆరబెట్టుకుని పచ్చడి కలపడానికి ముందు మిక్సీ పట్టుకోవాలి.పచ్చడి పింగాణీ జాడీలో నిల్వ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రల్లో నిల్వ చేయడం సరికాదు.

తయారీ విధానం :

మామిడి కాయలు ముక్కలు కొట్టించడానికి ముందుగానే వాటిని నీళ్లతో శుభ్రం చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని క్లాత్​తో తుడిచి పెట్టుకోవాలి.అన్నింటినీ ఒకేసైజులో ముక్కలు కొట్టించి జీడితో పాటు టెంక లోపలి వైపు ఉన్న తెల్లని పీచు (పొర) లేకుండా తొలగించుకుని పక్కన పెట్టుకోవాలి.తేమ ఆరిపోయేలా ముక్కలన్నింటినీ శుభ్రం చేసుకుని ఫ్యాన్ కింద ఓ క్లాత్ పరిచి ఫ్యాన్​ గాలి కింద ఆరబెట్టుకోవాలి.ఇపుడు పచ్చడిలో కావాల్సిన ఉప్పు, కారం, ఆవాలు, మెంతులను రెడీ చేసుకోవాలి. వీటిని కూడా ముందు రోజే ఎండలో ఆరబెట్టుకుని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి.తీసుకున్న వెల్లుల్లిలో కొన్నింటిని కచ్చాపచ్చాగా రుబ్బుకొని మిగిలిన సగం పచ్చడిలో కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి

పచ్చడి కలుపుకొనే విధానం..

 

Mango Pickle.

పచ్చడి ముక్కలు కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆరబెట్టుకున్న మామిడి కాయ ముక్కలు వేసుకుని ముందుగా పావు లీటర్ నూనె పోసుకుని బాగా పట్టించాలి.ఇవి పక్కనపెట్టి మరో గిన్నెలో కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు లేదా మెంతి పిండి, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుబ్బుకున్న వెల్లుల్లితో పాటు పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు కూడావేసుకుని కలపాలి.ఇపుడు దినుసులన్నీ కలిపిన కారం, మామిడికాయ ముక్కలకు బాగా పట్టించాలి.ఈ సమయంలో మిగిలిన నూనె కూడా పోసుకుని మరో సారి కలుపుకోవాలి.

నిల్వ చేసే విధానం..

కలుపుకున్న పచ్చడిని ఓ జాడీలో పెట్టుకుని వస్త్రాన్ని చుట్టి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి.
ఈ లోగా నూనె, కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది.మూడు రోజుల తర్వాత ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని మరోసారి చక్కగా కలుపుకోవాలి.
ఫైనల్ గా ఈ సమయంలో ఉప్పు, కారం రుచి చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది.
తినడానికి సరిపోయే పచ్చడిని పక్కనపెట్టుకుని మిగిలినది జాడీలో నిల్వ చేసుకోవాలి.

వరి పంటను పరిశీలించిన అధికారులు.

వరి పంటను పరిశీలించిన అధికారులు

బాలానగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా.!

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యక్రమాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,సిరిసిల్ల ఇన్చార్జ్ ఆర్డి.ఓ రాదాబాయి తో కలిసి ఇల్లంతకుంట తహసిల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగి లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పండిందని అన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లకు, అదనపు కలెక్టర్ లు, పౌర సరఫరాల అధికారులకు, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. వాన కాలం కంటే అదనంగా యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాళ్ళు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యత అందించాలని , దీనికి అనుగుణంగా జిల్లాలలో ఐకెపి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వస్తువుల కొరత ఉంటే కలెక్టర్లు వాటిని కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.
భారత ఆహార సంస్థ మార్గదర్శకాలు ప్రకారం నూకల శాతం 25 దాటకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా అందిస్తే మాత్రమే రైతులు ప్రైవేట్ గా బియ్యం అమ్ముకోవాలని, తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదని అన్నారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు.
13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సన్న బియ్యం నాణ్యత పై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు, కొరత ఎక్కడైనా ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని తెలిపారు. జిల్లాల 36 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైస్ మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల ధాన్యం నిలువ చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్,జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, అధికారులు కిషోర్, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డిఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన.!

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన.!

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలో నిన్న అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యాన్ని పరిశీలించి మీరు అధైర్యపడకూడదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రైతులకు దైర్యం చెప్పి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వంచే కొనుగోలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ సహాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version