ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ
ఉద్యమకారులు అందరూ తరలిరావాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి యు ఎఫ్) మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్యమ కారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్క రించడం జరిగింది.ప్లీనరి సమా వేశానికి పాల్గొనడం కోసం చర్చించడం జరిగింది. ఉద్యమకారులు ప్లీనరీ సమావే శానికి తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడిశెట్టి గణేష్ మండల అధ్యక్షులు పోలపెల్లి శ్రీనివాస రెడ్డి బలిజేనరసింహారాములు, గంట శ్యాంసుందర్ రెడ్డి , ఉద్య మకారులఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చీమ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురే ష్, మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస రెడ్డి,ఉపాధ్య క్షులు వనం దేవరాజ్ ,మండల నాయకులు ఎండి రఫీ ,అడుప ప్రభాకర్, సముద్రాల లింగ మూర్తి, కానుగుల నాగరా జ్ ,తుమ్మ ప్రభాకర్, దూదిపాల జోగిరెడ్డి ,అరకిల వీరయ్య, కోలఆనందం, బాసని సాంబమూర్తి ,బత్తుల రాజేష్, కొడపాక సంజీవరావు శంకర్ రెడ్డి బొంతల నాగరాజు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్, దామర కొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కర్టసి డే సందర్బంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ బస్టాండులోని ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా గులాబీ పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.బస్సులో రెగ్యులర్ ప్రయాణం చేస్తన్న నర్సంపేటకు చెందిన మెండు సారంగం,నారక్కపేట గ్రామానికి చెందిన లెంకల ప్రనీతలను శాలువాలతో సన్మానం చేసి గులాబీ పుష్పాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ,ఏడిసి మల్లికార్జున్, రవీందర్,రాంబాబు,తేజశ్వినితో పాటు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెక్కొండ మండలంలోని గొట్ల కొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచనలు క్రమం తప్పకుండా పాటించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యాసంగి పంటలో వరి సాగు పెరిగిందని వరి ధాన్యం కొనుగోలలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Farmers
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డి సి ఎస్ ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డి ఎం సంధ్యారాణి, డి పిఎం భవాని, తాసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్, నెక్కొండ వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, లతోపాటు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పార్వతమ్మ, పెండ్యాల హరిప్రసాద్, చల్ల శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, తిరుమల్ చౌహాన్, చల్ల పాపిరెడ్డి, సాయి కృష్ణ, భాను ప్రసాద్, సింగం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దూదిమెట్ల కొమురయ్య, నైజాం, గొట్లకొండ వివో అధ్యక్షులు సునీత, సరోజ, పార్వతి, జ్యోతి, నీలమ్మ, వి ఓ ఏలు సూర్య, ఏకాంబరం, గొట్లకొండ గ్రామ రైతులు, మహిళా సంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పని
పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
*రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320,కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17 శాతం మాయుచర్ ఉండాలని అన్నారు. నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలనీ సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బొనస్ లభిస్తుందన్నారు.
government.
రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,డిసిఓ నీరజ,సివిల్ సప్లైస్ జిల్లా అధికారి డి.కిష్టయ్య,సివిల్ సప్లైస్ డిఎం సంధ్యారాణి,ఏడీఏ దామోదర్ రెడ్డి ,తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, అగ్రికల్చర్ మండల ఆఫీసర్ మాధవి,కొనుగోలు కేంద్రాల మండల నోడల్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సొసైటి ఇంచార్జీ సిఈఓ భిక్షపతి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెల బాబు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ వైస్ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, పలువురు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మొత్తం 1023 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని అన్నారు. జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లలో 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వం నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుందని, హౌసింగ్ శాఖ అధికారులు నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేగంగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి అప్పజెప్పిన సిఐ మల్లేష్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ చిట్యాల పోలీస్ స్టేషన్లో చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ గారితో కలిసి చిట్యాల సిఐ మల్లేష్ 2 మొబైల్స్ లని తిరిగి బాధితులకు అందించారు, జూకల్ గ్రామానికి చెందిన సిరిగిరి రవీందర్ తను 2 నెలల క్రితం తన ఒప్పో ని పోగొట్టుకొని, మరియు చిట్యాల మండలం వెంక్కట్ రావుపల్లి చెందిన ఉప్పుల రవీందర్ నెల క్రితం తన రెడ్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ సీఈ ఐ అర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శిరిగిరి రవీందర్ కి మరియు ఉప్పల రాజేందర్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన సీఈ ఐ ఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ అభినందించారు అలాగే గత కొన్ని రోజులుగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అని తెలిపి, సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందు చైల్డ్ మోడ్ ఆన్ చేసి ఇవ్వాలని, కొందరు అదునాథ టెక్నాలజీ ఏ ఐ నీ వాడి ఫోటోలని మార్ఫింగ్ చేస్తున్నారు కావున పర్సనల్ ఫొటోస్ నీ సోషల్ మీడియా లో పెట్టొద్దు అని తెలిపారు, ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురి ఐతే వెంటనే 1930 కి కాల్ చేయాలని తెలిపారు.
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపే;
నర్సంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత అక్రమ అంబర్,గుట్కా, తంబాకు నిలువలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు కిరాణం దుకాణాలు, పాన్ షాపులు, వివిధ హోల్ సేల్ దుకాణాలలో అక్రమ అంబర్,గుట్కాలు నిల్వలను టాక్స్ ఫోర్స్ అధికారులు, పోలీసుల దాడుల్లో లభ్యం అవ్వడం కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మకాలు మరింత పెరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. నర్సంపేట పట్టణంలో ఒక కిరాణంలో దాడులు నిర్వహించి సుమారు 1,59 వేల రూపాయల విలువగల అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు.
నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీపి మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు. ఇలాంటి అక్రమ నిషేధిత అంబర్, గుట్కాలను నిలువచేసిన,అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై ఎక్సైజ్ అధికారులు నిరంతర దాడుల్లో బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నియంత్రణకై దాడులు నిర్వహిస్తున్న క్రమంలో మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన జరుపుల రమ గతంలో నాటుసారా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడగా నర్సంపేట తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆమె బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటు సారాను విక్రయిస్తూ పట్టుబడగా ఆమెను అరెస్టు చేసి నర్సంపేట తహసిల్దార్ రాజేష్ ఎదుట హాజరుపరచగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జరుపుల రమకు రూ. 50 వేల జరిమానా విధించగా ఆమె చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. బైండోవర్ ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే ఆరు నెలలు వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.
డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నియమ నిబంధనలు పాటించని శ్రీ లక్ష్మీగణపతి స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎల్హెచ్ పిఎస్, డిబిడిఎస్ ప్రజాసంఘాలు,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిబిడిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ,ఎల్హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్,ఎమ్మార్పీఎస్(టీ.ఎస్) జిల్లా అధ్యక్షులు మైసి శోభన్ మాదిగ ,ధరణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈదునూరి రమేష్ మాట్లాడుతూ నర్సంపేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ కాంట్రాక్టు నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా వారి యొక్క స్టాండ్ నడుపుచున్నారన్నారు సదర్ స్కూటర్ స్టాండ్ కు పొందిన అనుమతిలో ఒకవైపు మాత్రమే దారి కలదు కానీ ఆయా నిర్వహకులు పొందిన ఒకవైపు దారి కాకుండా మరో మూడు దారులను ఏర్పరచుకొని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ విధంగా అనుమతులను భేఖాతరు చేయడం వలన ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యానికి గురికావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా బస్సులు బయటకు వెళ్లే దారిని నిబంధనలకు విరుద్ధంగా స్కూటర్ స్టాండ్ కు వెళ్లే దారిగా ప్రధానంగా నిర్వాహకుడు ఉపయోగించడం వలన పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో ఆ కాంట్రాక్టు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున తక్షణమే విరుద్ధంగా ఉన్న దారులను మూసివేసి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రతపై పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లేని యెడల ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తడుగుల విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి రాష్ట్ర నేత, ఆరేపల్లి బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోట డేవిడ్ మార్గ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్,నేలమారి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.
పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..
హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.
ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.
నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.
ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.
Police
నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది.
పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.
ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.
వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్,డబ్ల్యూఏ ఎస్.ఐ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ,కానిస్టేబుల్ బి.రాజు,బి. నరేష్, ఎం.గణేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.
ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
వరంగల్ నేటిధాత్రి
వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.
College
తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.
Graduation Day
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపేట:
నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు. మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు
దేశంలోని పౌరులందరికి మతంతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌరచట్టం తీసుకు రావాలన్న ప్రస్తుత ఎన్.డి.ఎ. ప్రభుత్వ యత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. ఇందుకు విభిన్న కారణాలున్నాయి. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతాపార్టీ 1998 మరియు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. 2019లో నవంబర్‌లో నారాయణ్ లాల్ పంచారియా అనే సభ్యుడు ప్రైవేటు బిల్లుకింద దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష సభ్యులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఇందులో కొన్ని సవరణలకోసం బిల్లును ఉపసం హరించక తప్పలేదు. 2020 మార్చిలో కిరోడి లాల్ మీనా రెండోసారి ఈ బిల్లును తీసుకు వచ్చినా, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు. ఇదేసమయంలో ఉమ్మడి పౌర చట్టం (యూసీసీ)కి ఒక ఉన్నతస్థాయి కమిటీని లేదా జ్యుడిషియల్ కమిషన్‌ను నియమించి, మూడు నెలల్లోగా ముసాయిదారూపొందించేలా, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఢల్లీి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2021ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీచేయాలన్న అభ్యర్థన మళ్లీ ఇదే కోర్టులో దాఖ లైంది. అయితే అటువంటి కమిటీ రూపొందించిన ముసాయిదాను వెబ్‌సైట్‌లో వుంచి దీనిపై విస్తృత చర్చ జరిగేందుకు వీలుగా 60రోజుల సమయం ఇచ్చేలా చూడాలని కూడా ఈ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా బీజేపీ ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని చేర్చింది. ఈ ఎన్నికల్లో 2/3వ వంతు మెజారిటీ రాకపోవడంతో దీ న్ని అమలు చేయలేకపోయింది. ఇదే సమయంలో విపక్షాలు యూసీసీని అమల్లోకి తేవడానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదు. వీటితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకి స్తున్నాయి. ది నాగాలాండ్ ట్రాన్ప్‌పరెన్సీ, పబ్లిక్ రైట్స్ అడ్వకెసీ అండ్ డైరెక్ట్ యాక్షన్ సంస్థ కూడా యూసీసీ అమలును వ్యతిరేకించింది. ముఖ్యంగా స్థానిక గిరిజన తెగల సంప్రదాయాలకు ఇది విఘాతం కలిగిస్తుంది కనుక అమలు చేయకపోవడమే మంచిదని పేర్కొంది. మేఘాలయ కు చెందిన హైన్యూట్రెప్ యూత్ కౌన్సిల్ కూడా ఈ చట్టం అమలు చేయకూడదని లా కమిషన్ కు విజ్ఞప్తి చేస్తామని ప్రకటించింది.
ఎందుకింత వ్యతిరేకత?
ప్రస్తుతం దేశంలో వివిధ వర్గాలకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. వీటిల్లో ఒకదానికొకటి ఎంతమాత్రం సంబంధం లేదు. ఒకవేళ యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్‌లతో పాటు, కేవలం మతగ్రంథాల ఆధారంగా అమలు చేసే షరియా చట్టాలు (ఇస్లామిక్ చట్టాలు) రద్దవుతాయి. యుసీసీలో ప్రధానంగా బహుభార్యాత్వం రద్దు, కొడుకు, కుమార్తెకు వంశపారంపర్య ఆస్తులపై సమానహక్కు, లింగవివక్షకు తావులేకుండా, మతంతో సంబంధంలేకుండా ఈ చట్టంలో నిబంధనలను పొందుపరచారు. దాతృత్వం, దైవత్వం, సంరక్షణ, పిల్లల బాధ్యతను పంచుకోవడం వంటి అనేక వర్తమానకాలానికి అనుగుణమైన నిబంధనలను ఈ చట్టంలో చేర్చారు. అయితే దేశంలో 21వ శతాబ్దంలో ఈ చట్టం అత్యంత వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం, ‘సెక్యులరిజం’కు సంబంధించినంతవరకు భిన్నాభిప్రా యాలు వ్యక్తం కావడమే. దేశంలోని వివిధ మతాలు, కులాలకు, వర్గాలు అనుసరించే సంప్రదాయాలు, కట్టుబాట్లలోని వైవిధ్యతే ఈ చట్టం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది.
సెక్యులర్ మరియు రాజ్యం
భారత్ ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ సెక్యులర్ అంటే, మతం, రాజ్యం వేర్వేరు అని అర్థం. దేశంలోని అన్ని మతాలు చట్టముందు సమానమేనన్నది మనదేశ ‘సెక్యులరిజం’ నిర్వచనం. కోర్టులుమతాలను అనుసరించి ఆయా పౌరుల కేసులను విచారిస్తున్నాయి. హిందూ మహిళలకు అనువర్తించే చట్టాలు లింగ సమానత్వం మరియు సెక్యులర్‌పరంగా షరియా చట్టం కింద ముస్లిం వ హిళలకంటే ఆధునిక రీతిలో వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మహిళా హక్కుల సంఘాలు ఉమ్మడి పౌరసత్వం చట్టం మహిళల భద్రత, హక్కులపై ఆధారపడి వుండాలని కోరుతున్నా యి. రాజ్యాంగంలోని 44వ అధికరణం దేశ సమైక్యత, సార్వ భౌమత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి వివిధ వర్గాల్లో అమల్లో ఉన్న చట్టాలను తొలగించి, మహిళలకు సమానత్వం కలిగించేవిగా వుండాలని పేర్కొంటున్నది. ఇందుకోసం ముస్లింల వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు తీసు కొని రావాలని కోరుతున్న మానవహక్కుల సంఘాలు, ఈ 44వ అధికరణాన్ని ఉదాహరణగా చూపుతున్నాయి. అయితే షరియా చట్టాన్ని ఆమోదిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. తమనుతాము సెక్యులర్‌గా చెప్పుకునే పార్టీలు, కొన్ని మతవర్గాలు కేవలం తమ ఉనికి కోసం మాత్రమే యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి.
రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర చట్టం
ప్రస్తుతం మనదేశంలో గోవా రాష్ట్రంలో ఉమ్మడి సివిల్‌కోడ్ అమల్లో వుంది. ఈ కోడ్, పోర్చుగీసుపౌరచట్టాలకు అనుగుణంగా వుండటం గమనార్హం. 2024లో ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర చట్టా న్ని ఆమోదించింది. ఆవిధంగా ఉమ్మడి సివిల్‌కోడ్‌ను అమలుచేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మనదేశంలో ప్రస్తుతం గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమ లు చేస్తున్నాయి. నిజానికి 2015లోనే సుప్రీకోర్టు ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం వున్నదని స్పష్టం చేసింది. విచిత్రమేమంటే 2018లో లా కమిషన్, ఉమ్మడి పౌర చట్టాన్ని ఇప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని తన 185 పేజీల కన్సల్టెన్సీ పేపర్‌లో స్పష్టంచేసింది. ఇదే సమయంలో దేశంలో కొనసాగుతున్న బహుళత్వాన్ని సెక్యులరిజం నిరాకరించజాలదని కూడా స్పష్టం చేసింది.
ఏది పురోగమనం…ఏది తిరోగమనం?
ఇక యూసీసీని వ్యతిరేకించేవారు,మతం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని వాదిస్తున్నారు. పురోగతి పేరుతో బీజేపీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నదనేదివారి ప్రధాన ఆరోపణ. అయితే సర్వమత సమానత్వం, మహిళలకు సమానహక్కుల కల్పన ఉమ్మడి పౌర చట్టంద్వారా సాధ్యమవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరచట్టం కంటే, లింగవివక్షకు సంబంధించిన చట్టాలను సవరిస్తే సరిపోతుందనేది న్యాయనిపుణులు చెబుతున్న మాట. గృహహింస చట్టం`2005 అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది కదా అంటూ ఉదాహరణగా చూపుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణమురారి ఉమ్మడి పౌర చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని అమల్లోకి తెచ్చేముందు విస్తృత ప్రాతిపదికన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. ఇదిలావుండగా 2024, ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ‘‘ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్ ఉత్తరాఖండ్ యాక్ట్`2024’’ పేరుతో బిల్లును ఆమోదించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదొక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. అయితే ఈ చట్టం నుంచి గిరిజనులకు మినహాయింపునివ్వడం గమనార్హం.
షాబానో కేసు
నిజానికి హిందూ కోడ్ బిల్లు ఆమోదం తర్వాత దేశంలో చట్టాలు రెండు విధాలుగా అమలువు తూ వస్తున్నాయి. మొదటిది భారత పౌరులకు కాగా రెండవది సంస్కరణలకు నోచుకోని ముస్లించట్టాలు. దీని తర్వాత 1985వరకు సెక్యులర్ వాదులు, మతపెద్దల మధ్య తరచుగా వచ్చే విభే దాలు, సంఘర్షణలు తగ్గిపోయాయనే చెప్పాలి. 1985లో షాబాను అనే 73ఏళ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 40ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆమె భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ ఆమెకు మూడుసార్లు తలాఖ్ చెప్పి విడాకులివ్వడమే కాదు ఆమెకు భరణం ఇవ్వడానికి నిరాకరించాడు. ముస్లిం షరియా చట్టం ప్రకారం ఇది సమ్మతమేనని స్వయంగా లాయర్ ఆయిన ఆయన వాదించారు. 1980లో స్థానిక కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని తీర్పు చెప్పడంతో, ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు అఖిల భారత నేరన్యాయ చట్టం ప్రకారం మతాలకు అతీతంగా ఆమె భర ణం పొందడానికి అర్హు రాలేనని స్పష్టం చేసింది. అప్పుడే ఉమ్మడి పౌర చట్టాన్ని అమల్లోకి తేవాలని కోర్టు పేర్కొంది. ఇదే క్రిమినల్ చట్టం కింద 1979, 1980ల్లో మరో ఇద్దరు ముస్లిం మహిళలు భరణం పొందడం గమనార్హం. 1995లో సరళా ముద్గల్ మరియు ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు వ్యక్తిగత చట్టాలను దుర్వినియోగం చేయరాదని తీర్పు చెప్పింది. 2000లో లిల్లీ థామస్ కేసులో కూడా కోర్టు ఇదేమాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2017లో సైరాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తలాక్`ఇ`బిద్దత్ ఒక నిరంకుశ విధానమంటూ స్పష్టం చేసింది. ఇదిలా వుండగా షాబానో కేసు మాత్రందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత అఖిల భారత ముస్లిం బోర్డు తమ చట్టాలను సమర్థించడమే కాకుండా, ఛాందసవాదులకు మద్దతుగా నిలిచింది. మైనారిటీలపై హిందువుల ఆధిపత్యం కోసమే ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. అంతేకాదు క్రిమినల్ లాను ముస్లిం మత పెద్దలు తమ సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసేదిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఉమ్మడి పౌర సత్వ చట్టం తీసుకురావాలని న్యాయవ్యవస్థ కోరుతున్నదంటే కేవలం హిందువుల చట్టాలను అందరిపై రుద్దే ఉద్దేశమేనంటూ వారు ఆరోపించారు. ఇక అప్పటినుంచి ముస్లిం బోర్డు తమ చట్టాలకు స్వేచ్ఛను ఇవ్వాలంటూ ఆందోళన మొదలుపెట్టింది. ఈ సమస్య ను అప్పట్లో మీడియా కూడా అతిగా ఫోకస్ చేసింది.
మడమ తిప్పిన కాంగ్రెస్
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో ఒక ముస్లిం స్వతంత్ర సభ్యుడు ముస్లిం చట్టాల పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ మద్దతు తెలిపింది. అయితే లెఫ్ట్ పార్టీలు, ముస్లింలలో ఉదారవాదు లు దీన్ని వ్యతిరేకించారు.తర్వాత 1986లో ‘ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవోర్స్)చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 125వ సెక్షన్ ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేశారు. ఆ తర్వాత మనదేశంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. కాంగ్రెస్, ముస్లిం చాందసవాదులు ఒకవైపు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరోవైపుగా చీలిపోయారు. ముస్లిం మహిళల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు దెబ్బతినడం ఓ విచిత్ర పరిణామం!
నిరంకుశత్వం లేదా ప్రజాస్వామ్యం ఒక పరిమితి దాటి వుండకూడదు. ప్రస్తుతం మితిమీరిన ప్రజాస్వామ్యం కారణంగా ప్రజాహిత చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు కాకుండా పోతు న్నాయి. విశాలహితం కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ప్రజాస్వామ్యం కల్పించాలి. ఉమ్మడి పౌర చట్టానికి ఇన్ని అడ్డంకులు కలిగించడం ద్వారా దేశ జనాభాలో సగం వున్న మహిళలు ఇంకా తీవ్ర వివక్షకు గురికావలసి వస్తోంది. ముఖ్యంగా మతం, సంప్రదాయాల చ ట్రంలో ఇరుక్కుపోయిన వర్గాల మహిళల జీవితాల్లో ఉషోదయ వెలుగులు ఎప్పుడు ప్రసరిస్తా యనేది ప్రశ్నార్థకమే!
రజితోత్సవ సభను విజయవంతం చేయండి – పోస్టర్ ఆవిష్కరణ – టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
`చీకటి నుంచి తెలంగాణను వెలుగులోకి తెచ్చిన సూర్యుడు కేసీఆర్.
`తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లోనే మా కళ్లతో చూసిన ప్రగతిని నమ్మలేనంతగా పరుగులు పెట్టించిన పాలకుడు కేసీఆర్ అంటున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆనాటి ఆసక్తికరమైన అంశాలు..దయన్న మాటల్లోనే..
`సభల నిర్వహణలో చరిత్రలు సృష్టించాలన్నా, ఆ చరిత్రలు తిరగ రాయాలన్నా బిఆర్‌ఎస్ కే సాధ్యం.
`సభలు విజయవంతం కావడానికి కేసీఆర్ ఒక్క పిలుపు చాలు.
`తెలంగాణ మొత్తం కదులుతుంది.
`బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నాడు తెలంగాణ మొత్తం వరంగల్ లోనే వుంటుంది.
`తెలంగాణ ప్రజలంతా కలిసి బీఆర్‌ఎస్ రజతోత్సవ పండగ జరుపుకుంటుంది.
`తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కేసీఆర్ అద్భుతాలు సృష్టించారు.
`ఆరు నెలల్లోనే పల్లె, పట్నం అని తేడా లేకుండా కరెంటు నిరంతరం సరఫరా చేశారు.
`తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయారు.
`అంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానిది ఎలా సాధ్యమైందో ఊహించలేకపోరు.
`అదే ఏడాదిలో తెలంగాణలోని చెరువులకు నీళ్లొచ్చాయి.
`దశాబ్దాల తరబడి చుక్క నీరు లేక ఎండిపోయిన చెరువులు నిండాయి.
`మిషన్ భగీరథ పేరుతో చెరువులన్నీ కూడికలు తీయడం జరిగింది.
`ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతుంటే రైతులు సంబురపడ్డారు.
`తెలంగాణ ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
`ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి.
`తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్ పాలకుడై మట్టిని కూడా బంగారం చేశారు.
`తెలంగాణను అన్నపూర్ణ చేసి దేశానికే అన్నం పెట్టే దశకు తెచ్చాడు.
`అందుకే కేసీఆర్ చరిత్రకే కొత్త బాష్యం చెప్పిన పాలకుడయ్యారు.
`60 ఏళ్లు తెలంగాణను పట్టిన శనిని వదిలించాడు.
`ఈ తరం యువతకు కేసీఆర్ చేసిన త్యాగం తెలియాలి.
`కేసీఆర్ చేసి చూపిన అభివృద్ధి బిఆర్‌ఎస్ ప్రతి కార్యకర్త యువతకు చెప్పాలి.
`ఇంతటి అభివృద్ధి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ చేయలేదు.
`ఇంకా వెయ్యేళ్లయినా కేసీఆర్ చరిత్ర చెరిగిపోదు.
`తెలంగాణ వున్నంత వరకు బీఆర్‌ఎస్ ఎదురుండదు.
`అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చినా మళ్ళీ కెరటంలా ముందుకొచ్చేది బిఆర్‌ఎస్ పార్టీయే.
`తెలంగాణను కాపాడుకునేది బీఆర్‌ఎస్ పార్టీనే
హైదరాబాద్,నేటిధాత్రి: ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్ తెలంగాణ దేవుడు. ఎందుకంటే కేసిఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు. కేసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణకోసం ఎన్ని రకాల ఉద్యమాలు సాగినా, గతంలో రాలేదు. ఉద్యమం ఎంతో కొంత సజీవంగా వుండేదేమో? కాని డిల్లీ పాలకులు తెలంగాణ ఇచ్చేందుకు ఇష్టపడకపోదురు. అడుగడుగునా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బిజేపి రెండూ తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా వుండేవి కాదు. కేసిఆర్ లేకుండా అంత బలమైన ఉద్యమం చేసేవారు వుండేవారు కాదు. కేసిఆర్ నాయకత్వంలో బలమైన తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో దేశంలో బిజేపి మూడు రాష్ట్రాలను ప్రకటించింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. 1998 కాకినాడ సభలో ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మాణం చేసిందే గాని, తెలంగాణ ఇవ్వడానికి చేతులు రాలేదు. ఒక దశలో అప్పటి ఉప ప్రధాని అద్వానీ హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డులో వుంది. ప్రత్యేక రాష్ట్ర ఎందుకు? అని ఎదరు ప్రశ్నించారు. ఏపి నాయకుల మాటలే కేంద్రంలో చెల్లుబాటయ్యేవి. తెలంగాణ నాయకులు ఎంత బలమైన వాళ్లైయినా వారికి ప్రాదాన్యత వుండేది కాదు. పైగా తెలంగాణ ఇవ్వమని అడిగేంతే శక్తి అప్పటి రెండు పార్టీల నాయకులకు లేదు. తొలి తరం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంత పెద్ద పోరాటం జరిగినా ఇందిరా గాందీ ఒప్పుకోలేదు. తెలంగాణ ప్రజా సమితి 11 సీట్లు సాధించినా తెలంగాణ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఉద్యమం సాగినా అవి డిల్లీ దాకా తెలంగాణ వాణి వినిపించేంత గట్టిగా సాగలేదు. కాని ఒక్క కేసిఆర్ మొదలు పెట్టిన ఉద్యమమే డీల్లీని తాకింది. డిల్లీని వణికించింది. అంతగా డిల్లీ మెడలు వంచిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. అందుకే తెలంగాణ వచ్చింది. పట్టిన పట్టు విడవకుండా, ఎన్ని అవరోదాలు ఎదరైనా ఉడుం పట్టు పట్టినట్లు ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్. కేసిఆర్ ఆమరణ నిరసన దీక్ష సమయంలో కేసిఆర్ చెప్పిన మాటలనే అప్పటి హోం మంత్రి చిదంబరం చదివారంటే కేసిఆర్ బలం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో ఆమరణ నిరసనలో వున్న నాయకుడు ఏది చెబితే అది చదువుతాం..తెలంగాణ ఇస్తామని కేంద్రం దిగి రాకతప్పలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయకతప్పలేదు. అలా డిల్లీని శాసించి తెచ్చిన కేసిఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటున్న మాజీ మంత్రి వర్యులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నేటి దాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్ధితులు, అభివృద్ది గురించి చెప్పిన ఆసక్తికరమైన అంశాలు..ఆయన మాటల్లోనే.. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే రాత్రికి రాత్రి ఏపికి చెందిన ఉమ్మడి పాలకులు లేని కృత్రిమ ఉద్యమాన్ని కొన్ని గంటల్లోనే రేపినా, తెలంగాణను అడ్డుకున్నా, తెలంగాణ సాధించే వరకు విశ్రమించని నాయకుడు కేసిఆర్. తొలుత కేసిఆర్ చెప్పిన మాటల మీద ఇతర పార్టీలకు కూడా కొంత నమ్మకం కలగలేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలంగాణ రావాలని వున్న అప్పటి పరిస్టితుల దృష్ట్యా పార్టీల సిద్దాంతాలకు కట్టుబడి రాజకీయం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేశారో అప్పుడు అన్ని పార్టీలలోనే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం ఏర్పడిరది. అప్పటి నుంచి బిఆర్‌ఎస్ నాయకత్వంలో కేసిఆర్ నేతృత్వంలో ఐదేళ్లపాటు సాగిన ఆ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. సకల జనులు పాలుపంచుకున్న ఉద్యమం ఏదైనా వుందంటే అది తెలంగాణ ఉద్యమమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అప్పటి రాజులుకొంత మంది వ్యతిరేకించారు. కాని తెలంగాణ ఉద్యమం మాత్రం ఏ ఒక్క వర్గం వద్దనలేదు. జై తెలంగాణ అని అనకుండా వుండలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తెలంగాణలో ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదామే..వినిపించేది. పెళ్లిల్లయినా, పేరంటాలైనా, ఏ ఇతర శుభకార్యాలైనా, సభలైనా, సమావేశాలైనా సరే తెలంగాణ పాటలు తప్ప మరో పాట వినిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా సాగిన దూంధాంలు, నిరసనలు, సకల జనులసమ్మెలు, ఉద్యోగుల పెన్ వంటి అనేక రకాల ఉద్యమాలకు, పోరాటాలకు కేసిఆర్ చేసిన రూపకల్పన అంతిమంగా విజయం సాదించింది. తెలంగాణ తెచ్చింది. మరి వచ్చిన తెలంగాణ ఎలా అభివృద్ది అన్నదానిపై అందరికీ సందేహాలుండేవి. ఎందుకంటే అప్పటికే ఉమ్మడి పాలకులు కొన్ని అపోహలు సృష్టించారు. తెలంగాణ వస్తే కరంటు కోతులు, చీకటి రాత్రేలే కాదు, పగలు కూడా కరంటు చూడలేరంటూ చెప్పే వారు. ఆ మాటలు నిజమే కావొచ్చన్న అనుమానాలు సగటు తెలంగాణ ప్రజలకు కూడా వుండేది. ఏ చీకటి రాత్రుల గురించైతే అప్పటి పాలకులు చెప్పారో ముందు ఆ చీకటే లేకుండా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కింది. తెలంగాణ రాకముందు తెలంగాణ అంతటా చిమ్మ చీకట్లే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మరింత ఉదృతమైన సందర్భంలో సుమారు ఐదారేళ్లపాటు కరంటు కోతలు ఎక్కువ, సరఫరా తక్కువ జరిగేది. ఇక పల్లెల్లో అయితే రోజుకు కనీసం గంట కూడా కరంటు వుండేది కాదు. ఆ గంటలో కూడా కోతలుండేవి. అంటే ఆ రోజులు ఎంత భయంకరంగా వుండేవో అర్ధం చేసుకోవచ్చు. కాని తెలంగాణ వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లో తెలంగాణలో నిరంతరం కరంటు సరఫరా చూసి ప్రజలు ఆశ్యర్యపోయారు. తెలంగాణ ప్రజలు అబ్బురపడ్డారు. సంతోషంతో కేసిఆర్‌ను వేనోళ్ల పొగిడారు. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారికి కూడా వెలుగులు చూపించారు. ఇదెలా సాద్యమైందో అని ఏపి ప్రజలు కూడా ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. ఆ పాత చీకటి రోజులు చూసిన తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నిండాయి. దానికి తోడు తెలంగాణలో రైతులందరికీ 24గంటల ఉచిత విద్యుత్ కేసిఆర్ ఇచ్చారు. రైతులు 24 గంటల కరంటు వద్దని చెప్పే పరిస్దితి వచ్చింది. అంతగా రైతాంగాన్ని ఆదుకున్న ఏకైన రైతుబాంధవుడు కేసిఆర్. ఇక తెలంగాణ కరువును ఏడాదిలో కంటకి కనిపించకుండా చేసిన నాయకుడు కేసిఆర్. నిజం చెప్పాలంటే కేసిఆర్ పాలకుడు కాకుంటే ఇవన్నీసాద్యమయ్యేవి కాదు. అసలు ఆయన ఆలోచనలు, ఆచరణలు ఎవరికీ అంతు పట్టలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి కోసం ఆయన చేసిన గొప్ప ప్రయత్నం మిషన్ కాకతీయ. అసలు తెలంగాణను ఒక్క ఏడాదిలో సస్యశ్యామలం చేయొచ్చని ఎవరూ ఊహించలేదు. 60 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా, కనీసం చుక్క నీటిని ఇచ్చేందుకు కూడా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. తెలంగాణలో చెరువులు బాగుచేస్తే, కరువు ఛాయలు కొంతైనా తగ్గుతాయని ఆలోచించలేదు. ఎందుకంటే తెలంగాణకు నీళ్లిస్తే, ఏపికి నీరు తగ్గుతుందన్న భయంతో ఉమ్మడి పాలకులు తెలంగాణను నిర్లక్ష్యంచేశారు. చెరువులను చెదరగొట్టారు. అటు కరువు చాయలు, ఇటు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యాల మూలంగా తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఎడారిలా మారిపోయింది. కాని కేసిఆర్ ఏడాది కాలంలో తెలంగాణలో వున్న చెరువుల రక్షణ, పరిరక్షణ, పునరుద్దరణ పేరుతో చెరువులన్నీ బాగు చేశారు. మూడేళ్లలో 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. ఎండాకాలంలో కూడా తెలంగాణ చెరువులు మత్తళ్లు దుంకేలా నీరందించారు. నిరంతరం గొలుసు కట్టు చెరువుల్లో నీరుండేలా..ఆ చెరువుల నుంచి ఇతర చెరువులకు నిరంతరం నీరు పారేలా చూశారు. దాంతో వాగులు వంకల్లో కూడా నీరు నిరంతరం ప్రవహిస్తూ వచ్చింది. తెలంగాణలో భూగర్భ జలాలు అప్పటికే గణనీయంగా పెరిగాయి. రైతుకష్టం పూర్తిగా తీరింది. ఒకప్పుడు కరంటు లేక, బోర్లు ఎండిపోయి, పంటలు చేతికి రాకుండా చితికిపోయిన రైతులకు ఒక్కసారిగా పండుగ తెచ్చిన దేవుడు కేసిఆర్. అలా చెరువులతోపాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం దానికి అనుసంధానంగా పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి, తెలంగాణకు నీటి కొరత లేకుండా చేశారు. తెలంగాణలో గుంట భూమి కూడా సాగుకాకుండా రైతులు వ్యవసాయం చేశారు. పల్లెలను పచ్చని వనాలే కాదు, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారాలు చేశారు. నేను పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఐదేళ్ల కాలంలో తెలంగాణకు ఏటా పదుల సంఖ్యలో అవార్డులు అందుకోవడం నా జన్మ చరితార్ధకమైంది. అసలు ఎలా వుండే తెలంగాణ ఎలా తెలివికొచ్చింది. ఎంత అభివృద్ది చెందింది. కలలో కూడా ఎవరూ ఊహించనంత ప్రగతి సాదించింది. అందుకే కేసిఆర్‌లో ఒక కారణజన్ముడు. ఆయన స్ధాపించి బిఆర్‌ఎస్ తెలంగాణకు ఒక రక్షణ కవచం. బిఆర్‌ఎస్ రజతోత్సవాలు అంటే అది ప్రజల పండుగ. తెలంగాణ ప్రజల గుండెలందరి నిండుగా!
కేసముద్రం మండలంలోని సివిల్ సప్లై గోదాములలో కొందరు ఉద్యోగలు అవకతవకలకు పాల్పడుతున్నారని కేసముద్రం సహకార బ్యాంకు విశ్రాంత ఉద్యోగి సీఈఓ వెంకటచలం ఆరోపించారు. గురువారం కేసముద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర మిగిలిన గన్ని బ్యాగుల విషయం సివిల్ సప్లై ఉద్యోగులు అవకతవకలకు పాడుపడుతున్నారని అన్నారు. గన్ని బ్యాగుల 83 కట్టల లో ఉన్న 4,150 ఖాళీగా అన్ని బ్యాగులను కేసముద్రంలోని సివిల్ సప్లై గోదాంలో సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అట్టి 83 కట్టలకు గాను రూపాయలు 40 చొప్పున 3420 దిగుమతి చార్జీలు కూడా చెల్లించామని అన్నారు కేంద్రం ఇన్చార్జి అయిన సురేందర్ ను 83 కట్టల కాళీ బ్యాగులు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వాలని రసీదు అధికారులను అడగగా రేపు ఇస్తాం మాకు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తాను కూడా సివిల్ సప్లై గోదాముకు వెళ్లి అడగగా 42 కట్టలు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వడం జరిగిందని, తక్కువ గన్ని బ్యాగుల కట్టలు రాసి ఇవ్వడమేంటి అని అడగగా 52 కట్టలు దిగుమతి మాత్రమే దిగుమతి అయ్యాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై అనేకమార్లు అడిగినా కూడా పెడచెవిన పెడుతూ అధికారులు బాధ్యతారహిత్యంగా ఒక విశ్రాంత ఉద్యోగి పైనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.సివిల్ సప్లై గోదాంలో జరుగుతున్న అవకతకులపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఈ సందర్భంగా వారు కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.