రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు