సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు.

ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు.

నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.

Congress

స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఆంజనేయ స్వామి విగ్రహం అనుమతి ఇవ్వాలి.

ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

ఎమ్మెల్యే కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నేతలు

వనపర్తి నేటిదాత్రి :

 

 

ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు ఇటూ అనుమతి నెల రోజుల లోప ల ఇవ్వక పోతే బీజేపీ అధ్యర్యములో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వనపర్తి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం ఎమ్మెల్యే మెగారెడ్డి కి వినతిపత్రం అందజేశారు
వనపర్తి జిల్లా కేంద్రానికి దగ్గరలో 200 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతన శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయమును ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుచుట , నర్సరీ ఏర్పాటు అటవీ ప్రాంతం అయినందున పశువులకు, పక్షులకు దేవాలయ అవసరాలకు వర్హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయుటకై 10 గుంటల భూమి కేటాయించుటకు అభ్యర్థన.తిరుమలయ్య రోడ్డులో శ్రీ ఆంజనేయస్వామి 58 అడుగల విగ్రహం పెట్టడం గురించి 5 గుంటల భూమి ఇవ్వాలని ఎమ్మెల్యే ను కోరారు
వినతివనపర్తి పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు పీఎం రాము సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ కుమార్ ఉన్నారు

పంట వేసిన అందని రైతు బందు.

పంట వేసిన అందని రైతు బందు

అధికారుల నిర్లక్ష్యమే కారణం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

 

రైతు బంధు పథకం రైతుల సహాయార్థం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన పథకం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం
తాము పంట వేసిన
సంబంధిత మండల వ్యవసాయాదికారులు సర్వే సరిగా చేయక పోవడం మూలంగా మాకు రైతు బందు పథకం కింద పెట్టుబడి సహాయం అందలేదని ఎల్లారెడ్డిపేట లో ఒక మహిళ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన లింగాల బాలమణి అనే మహిళా రైతు కు ఎల్లారెడ్డిపేట లో ఒక ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఆ వ్యవసాయ భూమి లో వరి పంట వేశారు.వరి పంట వేసిన కానీ రైతు బందు సహాయం పడలేదని మండల వ్యవసాయాధీకారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు. పంట వేయని రైతులకు కొంతమంది కి రైతు బందు సహాయం అందిస్తున్నారని తమకు రైతు బందు సహాయం కింద పెట్టుబడి సహాయం అందకుండా చేసిన మండల వ్యవసాయాదికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.

వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు ప్రారంభించిన.

జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు
ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట :నేటిధాత్రి

 

 

జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా కొనుగోలు కేంద్రం ఉండాలని అధికారులకు సూచించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు దళారులు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జరిగింది ఇట్టి కార్యక్రమములో , మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరు స్వప్న, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి, తాసిల్దార్ రమేష్, మార్కెట్ సెక్రెటరీ మల్లేష్,మరియు అగ్రికల్చర్ ఆఫీసర్,హమాలి అధ్యక్షుడు రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్లు,సొసైటీ డైరెక్టర్లు, మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

శంకర్ ఆచూకీ తెలపండి.

సంగారెడ్డి: శంకర్ ఆచూకీ తెలపండి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జాడీ మల్కాపూర్ గ్రామానికి చెందిన బల్లెపు శంకర్ తేదీ 01. 04. 2025 నాడు ఇంటి నుండి తిరుపతి వెళ్తానని చెప్పి వెళ్లి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద విచారించిన అతని జాడ తెలియలేదు. అతని భార్య బల్లెపు స్వప్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసామని ఎస్ఐ ప్రసాద్ రావు గురువారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. కావున వివరాలు తెలిసిన వారు ఎస్ఐ నెంబర్ కు 8712656764, 8712661847. తెలియజేయాలని కోరారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని కౌకొండ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించిన పోషణ మాసపక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహారంతోనే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.ప్రతి బిడ్డకి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతతో పాటు, పిల్లలకి స్థానిక ఆహార పదార్థాలు,చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసి అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలని తల్లులకు సూచించారు. అనంతరం పిల్లల ఎదుగుదల ఎత్తు బరువు కొలతలు పరిశీలించారు.తల్లులకు బాలింతలకు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమ్రోన్,స్వరూప, అరుణ,కల్పన,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమం లో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్లమలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సిసి కుమారస్వామి,మహిళా సంఘం సభ్యులు కావ్య, లక్ష్మి,రాధ,ప్రియాంక,రాణి, సుగుణ,చందన,ఎరుకల భారతి,పొన్నాల సునీత,యారా రజిత,పెళ్లి పద్మ, ఎరుకల సుకపాల,సిసి రాజు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లో ఈ నెల 19 న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహకులు తెలిపారు. ఉదయం 6:30 నిముషాలకు స్థానిక ఎం ఆర్ ఎచ్ ఎస్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉంటుంది అని తెలిపారు. నియోజకవర్గం కు చెందిన క్రిస్టియన్ యూత్ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో గురువారము సాయంత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని ఝరాసంగం, కుప్ప నగర్ సిద్ధాపూర్ బొప్పనపల్లి, తదితర గ్రామాలలో మోస్తారు. వర్షం కురిసింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు విజయవంతం చేయండి

గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్రమహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25 ,26, 27 ,తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంనర అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు రాష్ట్రానికి ఇప్పుటీ వరకు విద్యశాఖ మంత్రి లేరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు .

ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.ఈమహాసభలకు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారీ శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన.!

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోషణ పక్షం..ఆరోగ్య లక్ష్యం.

పోషణ పక్షం..ఆరోగ్య లక్ష్యం

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్.కవిత మాట్లాడుతూ ఒక శిశువు యొక్క జీవితంలో మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అలాగే గర్భిణీ,బాలింతలు తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి,తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువు వయసుకు తగిన బరువు ఉండేలా మంచి పౌష్టికాహారం పెట్టాలని తాజా పండ్లు, కూరగాయలు,పాలు ఆకుకూరలు,చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు పెట్టాలని బయట జంక్ ఫుడ్ పెట్టకూడదని చెప్పారు.లోప పోషణ గల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రజిత, అంగన్వాడీ టీచర్లు విజయ,అంజమ్మ జ్యోతి,సరిత,ఆయాలు మహిళా సంఘాల సిఏ లు, వివో లు,పిల్లల తల్లిదండ్రులు ఇతరులు పాల్గొనడం జరిగింది.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం

ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి

అంతర్గాం గీతా కార్మికులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో నేటి ధాత్రి కెమెరాకి కనిపించారు.ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు వేసవిలో లభిస్తాయన్నారు.తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు,పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నారు.గీతా కార్మికులైన వారు ఇరువురు పల్లెటూరు నుండి పట్టణ ప్రజల అందుబాటులోకి ముంజలను తీసుకువచ్చి అమ్ముతూ
ఉపాధి పొందుతున్నామన్నారు.తాటి ముంజల యొక్క ప్రయోజనాలను వారి మాటల్లో వివరించారు.తాటి ముంజలలో వేసవి వేడిలో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు, ఐరన్,జింక్,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారని చెప్పారు.తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని,కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని, అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయని వైద్యులు చెబుతుంటే విన్నామని తెలిపారు.

కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు

జైపూర్,నేటి ధాత్రి:

 

కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి వడ్ల సెంటర్లను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తెలుసుకొని సన్న రకం వడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందని కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరూ దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల సత్యనారాయణ రెడ్డి,మంతెన లక్ష్మణ్,చల్ల విశ్వంభర్ రెడ్డి,పండుగ రాజన్న,శీలం వెంకటేష్,లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు.!

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు

ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన
కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,  పాల్గొన్నారు

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా.

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా

కాలనీలలో అగ్నిప్రమాదాల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది

పరకాల నేటిధాత్రి.

 

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 17 ఏప్రిల్ రోజున పరకాల అగ్ని మాపక కేంద్ర అధికారి వక్కల భద్రయ్య ఎస్ఎఫ్ఓ మరియు సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణ కుమార్,ఎఫ్ఎం సత్యం,దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ సత్తయ్య లు సౌందరయ్య హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ ఫైర్ అయిన సందర్భంలో పేసెంట్ ప్రాణాలు కాపాడే పద్ధతులు,వృద్ధులు, చిన్న పిల్లలను ముందుగా ఏవిధంగా కాపాడి రక్షించాలి అనే మెలుకువల గురించి తెలియజేశారు.గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు, నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,ఈత కు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని వాటి నివారణ చర్యల గురించి,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

Fire Accident.

మాధారం కాలనిలో కాలానివాసులకు వివరించిన ఫైర్ సిబ్బంది

అగ్ని మాపక కేంద్ర అధికారి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మాదారం ఏరియాలోని ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు,నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,చెరువులు, బావులలో ఈత సరదాకు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు.!

కోటగుళ్లలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ.!

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ స్త్రీలు మరియు గృహనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూసమతుల్య ఆహారం పిల్లలకు మరియు స్త్రీలకు చాలా అవసరమని పాలు మరియు గ్రుడ్డు సముతుల్య ఆహారంలో భాగమని వివరిస్తూ మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు కళాశాల ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు సహాయ ఆచార్యులు డాక్టర్ మాధవి మాట్లాడుతూ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలు మొదటి 1000 రోజులు అనగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు నిండే వరకు పోషకాహాలతో నిండిన ఆహారం ముఖ్యమని వివరించారు డాక్టర్ సంపత్ కుమార్ సహాయ ఆచార్యులు మరియు కళాశాల దత్త గ్రామం నిర్వాహకులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమని కరోనా తర్వాత మన ఆహారం అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు నేటి పిల్లల రేపటి దేశ పౌరులని వివరిస్తూ వారు ఆరోగ్యం దేశ భవిష్యత్తు నిర్వహిస్తుందని అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అంగన్వాడి అధికారులు పాఠశాల విద్యార్థులు గృహనులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version