ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం లోని కాల్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో తిరుమల, విజయ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో జరుగు కార్యక్రమాలు పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తులు, లోప పోషణ, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించనైనది. ఇందులో భాగంగా ఒక గర్భవతికి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సృజన మహిళలు, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,ఫర్జానా హాజరైనారు
