రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్
నిజాంపేట: నేటి ధాత్రి
పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.
