హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం
మొబైల్ ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం
శాయంపేట నేటిధాత్రి:
ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామ స్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి హెచ్ ఐవి ఎయిడ్స్, టిబి, సిఫిలిస్, హెచ్ బీ ఎస్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ట వివక్ష చూపవద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధిగ్ర స్తులకు అందించే చికిత్స గురించి తెలియజేశారు. హెచ్ఐవి వస్తే ఏఆర్ టి ద్వారా మందులు వాడి నిజజీవితాన్ని గడపవచ్చు. ప్రతి గర్భవతి దగ్గర ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏఎన్ ఎం సునీత, కుమార స్వామి, సిఎల్ డబ్ల్యూ స్వప్న, వీరన్న, మైలారం వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
