బీజేపీలో 100 మంది చేరిక

బీజేపీ లో 100 మంది చేరిక
* కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

పార్టీ బలోపేతానికి కంకణ బద్దులై పనిచేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ సమక్షంలో అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షులు కొరివి కృష్ణ అలియాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి తుంకి భాస్కర్ ఆధ్వర్యంలో అలియాబాద్ మున్సిపల్ లోని మజీద్ పూర్ నుండి ఎం. లక్ష్మారెడ్డి, ఎం గోవర్ధన్ రెడ్డి, రాజ బాబు, హనుమంత్ రావు, నర్సింహా రావు, మందుసూదన్ రెడ్డి, రామకృష్ణ, సందీప్ రెడ్డి, నరేష్, గంగిరెడ్డి, శుభష్ రెడ్డి, అక్షిత్, జ్ఞానేశ్వర్, అభినవ్, ఆనంద్, పంకాజ్, యశ్వంత్, వర గణేష్, అశ్విన్, గౌతమ్, సుహాస్, లోకేష్, రఘు, సునీల్ లతో పాటు సుమారు 100 మంది నాయకులు యువకులకు కండువాకప్పి బీజేపీ లోకి ఎంపీ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ని బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగరి హృదయ్ కుమార్, యువ నాయకులు వరప్రసాద్ రెడ్డి, బోయిని శివ, సీనియర్ జి. మహేష్, నక్క సత్యనారాయణ, వి. బిక్షపతి, కే. రమేష్, అబ్బగోని శ్రీశైలం గౌడ్, నక్క నరేందర్ గౌడ్,తుంకి రమేష్,శాంతరావు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుడు బీజేపీలో చేరిక

బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version