మహిళల నేతల అధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలంలోని షేఖాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మరియు మహిళల నేతల అధ్వర్యంలో సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ. సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. రాజకీయంగా ఎంతనష్టం జరిగినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్రం ఇవ్వడంతో ఉద్యమకారుల కలలు నెరవేయాయి. అందుకే సోనియా గాంధీ గారి ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేం. సోనియా గాంధీ గారి మార్గదర్శకంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ‘ప్రజాపాలన’ అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. సోనియాగాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ‘ఇందిరమ్మ రాజ్యం’ పాలన సాగుతోంది. రాష్ట్రం ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రాష్ట్రంలో ప్రజల బాగోగుల కోసం ఆమె ఇస్తున్న విలువలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ షేఖాపూర్ గ్రామంలో బాలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి నర్సిములు గారికి మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమామ్ పటేల్, ఖుర్షీద్, నారాయణ గౌడ్, ఖుతుబుద్దీన్, ఫైజోద్దీన్,ఎజాజ్ పటేల్, షేఖమద్, తాజుద్దీన్, సంజీవ్, మహిళా నాయకులు మౌనిక, ఈశ్వరమ్మ, చన్ను బీ, అమీనా బేగం గ్రామ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
