ఘనంగా జరుపుకున్న కేసీఆర్ జన్మదిన వేడుకలు…

ఘనంగా జరుపుకున్న కేసీఆర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు ఝరాసంగం మండల కేంద్రంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని, ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
జన్మదిన సందర్భంగా కేతకి సంగమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు పాలాభిషేకం చేయించారు ఇటీ కార్యక్రమంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ పటేల్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా దేవస్థాన మాజీ చైర్మన్ గౌడ్ సోహెల్ నాగన్న పటేల్ శీను పటేల్ సజ్జన్ నాగేశ్వర్ పరమేశ్వర్ ఈరన్న పటేల్ బస్వరాజ్ పటేల్ శ్రీను కొల్లూరు బస్వరాజ్ ఉల్లాస్ వెంకట్ రెడ్డి దత్త రెడ్డి మాణిక్ తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version