జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్
ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.
కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్..
కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. హఫీజ్, కాసర్ల గోదావరిలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
