బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని.!

బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని కలిసిన మెట్ పల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి వారి యొక్క సంఘం భవన నిర్మాణం కోసం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర నాయకులు రఘుని కోరారుఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ జిల్లా నాయకులు శ్రీకర్ గౌడ్ చింతల మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్దెరాగడి లోని భీమ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో నూతన కమిటీని, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి అలుగుల సత్తయ్య, కోశాధికారి గా మేకల సురేందర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, ముఖ్య సలహాదారుగా పల్లె రాజు, ఉపాధ్యక్షులుగా సుధాకర్, మహేందర్, సత్తయ్య, సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తామని, సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే సంబంధిత బాధ్యులకు తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version