మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి.

మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన.

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘ సభ్యత నమోదు.

పద్మశాలి సంఘ సభ్యత నమోదు

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మార్కెట్ ప్రాంతంలో గల పద్మశాలి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. గత అధ్యక్ష పదవి కాలం ముగిసిన సందర్భంగా మరల అధ్యక్ష ఎన్నికల కొరకై ప్రణాళిక సిద్ధం చేయుట కొరకు పద్మశాలి కుల బాంధవుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత అడగ్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంతంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ ఏరియాలోనీ వ్యాపార సముదాయాలలో గల పద్మశాలి కుల బాంధవులను కలిసి వారి యొక్క సభ్యత్వ నమోదును కమిటీ సభ్యులు చేపట్టారు. కమిటీ సభ్యులు పిట్టల సుధాకర్, బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ కుల సభ్యులు ఎవరైనా ఇంకా సభ్యత్వ నమోదు చేసుకోనట్లయితే మార్కెట్ ప్రాంతంలో గల కళ్యాణ్ సూపర్ మార్కెట్ వద్ద నమోదు చేసుకోగలరనీ తెలిపారు. అధ్యక్ష పదవి ఎన్నిక కొరకు తేదీ త్వరలో ఖరారు చేస్తామని, ఈలోగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version