ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
మహాదేవపూర్ అక్టోబర్ 24 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామపంచాయతీ పరిధిలో ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఎలికేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతుండగా ఆకస్మిక తనిఖీలలో భాగంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీలు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడి తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను త్వరగా పనులను ప్రారంభించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ ఆఫీసర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
