“మా పొట్ట కొట్టొద్దు… సారు “
“ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మిస్తే.. చచ్చిపోతాం”
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గుండేడు, వనమోని గూడ, గౌతాపూర్, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి గ్రామాల మీదుగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. ఈనెల 15 రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరించేందుకు గడువు పెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భూ నిర్వాసితులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న తమకు.. పిడుగు లాంటి వార్త మా జీవితాల్లో నాశనం చేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న పొలం రోడ్డుకు పోతే తాము జీవనోపాధి కోల్పోతామన్నారు. ఒకవేళ రోడ్డును నిర్మిస్తే క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.