కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక.

కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షుడిని ఎన్నుకున్నారు కెటిఆర్ సేన రాష్ట్ర అద్యక్షులు. మెంగాని మనోహర్ అదేశా లమేరకు భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి & జ్యోతి, అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి అధ్వర్యంలో మండల అధ్యక్షు నిగా శానంరాకేష్ ఎన్నుకు న్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి
మెట్ పల్లి జూలై 01 నేటి దాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గంగం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం రోజున మెట్ పల్లి మండలం మారుతి నగర్ లో ఘనంగా జరిగింది . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో క్రియా శీలకంగా పాల్గొంటుందని వారు అన్నారు .ఇట్టి కార్యక్రమంలో బోగ చక్రదర్, రాజోగి కార్తీక్, ప్రణయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్.

ఆర్ధిక సహాయం అందించిన శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్

మంగపేట నేటిధాత్రి:

 

శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అకినేపల్లి మాల్లారం గ్రామానికి చెందిన ఆవిరి.సూరిరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంవల్ల వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలమ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ చంద్ తెలుసుకొని వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యం,ఐదు కేజీల ఆయిల్ క్యాన్ ను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్ట్ మండలం అధ్యక్షులు:నూతులకంటి.ఈశ్వర్ చంద్, ట్రస్ట్ సభ్యులు నన్ను బోయిన. సాంబయ్య,నూతులకంటి.గౌరీ శంకర్,జై భీమ్ రామ్మోహన్,రవి తదితరులు పాల్గొన్నారు

హరిత సేన నియోజకవర్గం మండల కమిటీల నియామకం.

హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం

గంగాధర నేటిధాత్రి:

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

చిట్యాల నేటి ధాత్రి

 

కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version