మాదిగ అమరవీరుల కృషి ఫలితమే వర్గీకరణ

మాదిగ అమరవీరుల కృషి ఫలితమే వర్గీకరణ

జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

మాదిగ దండోరా ఉద్యమం 3వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాదిగ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటా దండోరా జెండాను ఎగురవేసిన ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య ఈ సందర్బంగా ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం పుట్టి 31 సంవత్సరాల సందర్భంగా జిల్లా కేంద్రంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ జెండా ఎగరావేయడం జరిగింది అని తెలియజేసారు గత 30 ఏళ్ల కాలంలో ఎన్నో నిర్భంధాలు కేసు లు జైలు జీవితం అనుభవించి ఎట్టకేలకు మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసారు రాబోవు భవిష్యత్తులో మాదిగ జాతి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తామని తెలియజేసారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెండల దేవరాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ టేకుమట్ల మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము కాటారం మండల అధ్యక్షులు ఆతుకురి శంకర్ మండల ప్రధాన కార్యదర్శి పసుల కుమార్ మాదిగ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఆరకొండ రాజయ్య బొజ్జపెల్లి ప్రభాకర్ రేణుకుంట్ల రాజ్ కుమార్ రాజయ్య నీలయ్యలు పాల్గొన్నారు

ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం.

ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ మనువాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ బిజెపి నరేంద్ర మోడీ అడుగులకు, మడుగులకు ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని వారి ప్రయోగశాలలో ఒక వస్తువుగా వాడుకుంటున్నారు.అనే నగ్న సత్యాన్ని తెలిసి కూడా వారి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా ఆ బిల్లును ఆమోదించేలా చేయడం దళితుల ఐక్యతను దెబ్బ తీయడమే అని అన్నారు. ముఖ్యంగా మాల ఉపకులాలకు అన్యాయం చేయడమేనని,ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం బీజేపీ రాజకీయంగా కుట్ర చేసిందని రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేయడం లేదని మనువాదాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదని దళితుల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలు చేయకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో ముందుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం గా ప్రశ్నిస్తున్నాము.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బిజెపికి మరియు మాదిగ సోదరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఇది కేవలం ఓట్ల రాజకీయ కోసం మాత్రమే ఇకనైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్గీకరణ ఆమోద బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ..

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుని నియామకం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పందుల సారయ్య ను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు పులిగిల్ల బాలయ్య ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నత్తి కోర్నేల్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పందుల సారయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా ఆలు పెరగకుండా చేస్తున్నామని ఇట్టి ఉద్యమానికి ఎన్నో ఉడుదులుకులు జరిగిన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తూ అసెంబ్లీలో కమిటీని వేసి అదేవిధంగా షమీం అత్తరు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసి దానిపై సర్వే చేయించి వర్గీకరణ చేయించి మంత్రివర్గంతో ముసాయిదా తీర్మానం చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత కల్పించి అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని 19 96లో వర్గీకరణ చేస్తానని ప్రకటించిన బిజెపి నాలుగు పర్యాయాలు అధికారంలోకి వచ్చి వారు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అన్నారు. ఇలాంటి బీజేపీని ప్రజలు పాతాళని తొక్కే రోజు దగ్గరలో ఉందని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య అన్నారు.
నా నియమానికి సహకరించినటువంటి దళితరత్నం దొబ్బటి రమేష్ టి పి సి సి కార్యదర్శి పాముల రమేష్, డాక్టర్ శరత్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, దయాకర్, రావుల మురళి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘనపురపు అంజయ్య, మిట్ట కడుపుల జలంధర్, బ్లాక్ కాంగ్రెస్ బైరు వెంకన్న, పలువురికి అభినందనలు తెలిపారు.

ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి.!

ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి
రెండవ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర బుధవారం రోజున ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్‌ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది . ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు గోలి సుధాకర్‌ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా లేని పక్షంలో పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో ముత్యాల మల్లేష్‌ మాదిగ ఎంఎస్పి వర్ధన్నపేట మండల అధ్యక్షులు , సినపెల్లి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్‌ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి , ముత్యాల నులేందర్‌ మాదిగ , సిలువేరు రాజు మాదిగ కడారి గూడెం గ్రామ అధ్యక్షులు , కంచర్ల రంజిత్‌ కుమార్‌ మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , బీరెల్లి నాగార్జున మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , పసునూరు సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు

న్యాయపరమైన వర్గీకరణ జరగాలి.!

న్యాయపరమైన వర్గీకరణ జరగాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాయపరమైన ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాల వారందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బుచేంద్ర మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కోహీర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమంలో బుచేంద్ర మాదిగ పాల్గొని మాట్లాడారు. జస్టిస్ షమీన్అక్తర్ నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version