ఎన్ హెచ్ ఆర్ సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపోతుల రమేష్ బాబు
నియమించిన జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
– ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము
“నేటిధాత్రి”,అమరావతి/
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ చైర్మన్ స్వప్న.యం. ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా బాపట్ల జిల్లాకు చెందిన పల్లబోతుల రమేష్ బాబును జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియమించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎన్ హెచ్ ఆర్ సి. కేంద్ర, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పని చేయాలని, అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని కదిరి రాము సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియామకమైన పల్లపోతుల రమేష్ బాబు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పదవిని అప్పజెప్పిన నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది కదిరి రాము, కేంద్ర కమిటీ సభ్యులు పి. పూర్ణచంద్రరావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థను బలోపేతం చేయడానికి అన్ని జిల్లా కమిటీలను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రమేష్ బాబు నియామకంతో గుంటూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మేధావులు, విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.