ఇనుగాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
పరకాల,నేటిధాత్రి
డీసీసీ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామిరెడ్డి నియమితులు అయినా సందర్బంగా పరకాల మున్సిపలైటిటి 18వ వార్డు అధ్యక్షుడు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్,ఒంటెరు కుమార్,బొచ్చు వినోద్ కుమార్ లు కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీని మునుముందు రోజుల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీనివాస్,కుమార్, ఇనుగాలను కోరారు.జిల్లాకు పార్టీ కొత్త అధ్యక్షులు ఇనుగాల నియామకం కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపామన్నారు.డిసిసి జిల్లాఅధ్యక్షులు వరంగల్ కూడా చైర్మన్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలలో విజయ డంక మోగిస్తుందని ఆకాంక్షించారు.
