డి హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పొన్నగంటి లావణ్య ఎన్నిక

డి హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పొన్నగంటి లావణ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

దళిత హక్కుల పోరాట సమితి రెండవ రాష్ట్ర మహా సభలు ఏప్రిల్ 17, 18 వరంగల్ లో జరిగినవి. ఈ మహా సభల లో భూపాలపల్లి జిల్లా రాష్ట్ర సమితి లో ప్రాధాన్యత దక్కింది. పొన్నగంటి లావణ్య ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక గా, రాష్ట్ర సమితి సభ్యులుగా రాస పెళ్లి భద్రయ్య ఎన్నిక అయ్యారు.దళిత హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న డి హెచ్ పి ఎస్ రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో భాగంగా, ప్రముఖ సామాజిక కార్యకర్త పొన్నగంటి లావణ్యను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పొన్నగంటి లావణ్య గత కొంతకాలంగా దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం పోరాటాలు చేసినారు
ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దళితుల హక్కుల కోసం పోరాడుతానని, సమానత్వ సమాజ నిర్మాణమే న లక్ష్యమని పేర్కొన్నారు. నా ఎన్నికకు సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీకి సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కి కృతజ్ఞతలు

డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం.

ఎల్లాపూర్ లో డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం

జగిత్యాల,నేటిధాత్రి:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గురువారం దళిత హక్కుల పోరాట సమితి నూతన గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా మోదుంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా మచ్చ అంజయ్య, ఉపాధ్యక్షులుగా మోదుంపల్లి లక్ష్మణ్, ఎండపల్లి భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి కిరణ్, మోదంపల్లి నరసయ్య, కోశాధికారిగా ఆరెల్లి కనకయ్యను ఎన్నుకున్నట్లు భుమేశ్వర్ తెలిపారు.
ఈసందర్భంగా భుమేశ్వర్ మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగ హక్కులు నేటికీ దళితులకు అందని ద్రాక్షలాగానే మిగిలాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై అణిచివేత దాడులు మహిళలపై అత్యాచారాలు హత్యలు కులవివక్షత, అంటరానితనం కొనసాగుతుందన్నారు.
ఈకార్యక్రమంలో శనిగరపు ప్రవీణ్, మోదుంపల్లి మల్లయ్య, మల్లారపు నర్సయ్య, ఆరేపల్లి మల్లయ్య, ఆరేపల్లి రాజయ్య, మోదుంపల్లి అంజయ్య, దీకొండ రాములు, మల్లారపు చిన్న నర్సయ్య, మోదుంపల్లి నర్సయ్య, మోదుంపల్లి అంజయ్య, మల్లారపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశం.

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలి

మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మార్చి 11, 12 ,13, తేదీల్లో వేములవాడలో నిర్వహించే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశాలను
విజయవంతం చేయాలని డిహెచ్ పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో వేములవాడ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ హక్కుల సాధన కోసం డిహెచ్ పిఎస్ నిర్వహిస్తున్న రాష్ట్ర సమావేశాలకు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో అన్ని విషయాలపై సమగ్ర చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కట్ల శంకరయ్య, చిలివేరు ఉదయాకర్, ఎల్కేటి సాంబయ్య, అమృత రాజేశ్వరి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version