*మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం *
* మహాదేవపూర్ జులై 28( నేటి ధాత్రి *
జయశంకర్ జిల్లా కాటారం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ నియమించడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపీట వేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు మహాదేవపూర్ ఉమ్మడి మండలానికి ఐదు డైరెక్టర్ పదవులులభించాయి మండల కేంద్రానికి చెందిన ఇర్ఫాద్ అహ్మ ద్, పోత రామకృష్ణ తో పాటు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ముల్కల శ్రీనివాస రెడ్డి చండ్రు పెళ్లి కి చెందిన గోమాస సడవలి పలిమల మండలం నుండి దాసరి సంతోష్ లకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు దీంతో ఉమ్మడి మండల వ్యాప్తంగా హర్ష వ్యక్తం చేస్తున్నారు తమ నియమకానికి సహకరించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శీను బాబుకు కృతజ్ఞతలు తెలిపారు