సిఎం,ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు
పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్
భూపాలపల్లి నేటిధాత్రి
అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూనే కాంగ్రెస్ ఏమ్మెల్యే సొంత పార్టీ నాయకులతో రోడ్డు మీద ధర్నా నిర్వహించి, అధికారులను బాధ్యులను చేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామం, మా మండలం, మా వనరులు అంటూ ఎనలేని సవతి ప్రేమ వలకపోస్తూ చేసిన ధర్నా కార్యక్రమం తరువాత మొదటి నుండి ఇసుక అక్రమ రవాణా పై ఇసుక దోపిడీ అరికట్టాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిన బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి – జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ని రాబందు అంటూ,ఇసుక మాఫియా డాన్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిన్న టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వాక్యలను ఖండిస్తూ మా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీస్ అధికారులు ముందస్తు అరెస్ట్ చేయగా నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు భూపాలపల్లి 5 ఇంక్లైన్ చౌరస్తా సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం ముందు ఎమ్మెల్యే సీఎం దిష్టి బొమ్మలకు శవ యాత్ర నిర్వహించి, దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.