ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా సాక్షి సీనియర్ రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ లో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి కి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన జర్నలిస్టులు. సాక్షి ఛానల్ పత్రిక కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నామని అక్రమంగా అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు.
నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ ప్రాంతంలో ఒక వ్యక్తి మధ్యమధ్య మృతి చెందాడు ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన బద్య 38 సంవత్సరాలు, గల వ్యక్తి మద్యానికి బానిసై ఇల్లు వదిలి నెక్కొండ పట్టణ కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి ఐస్క్రీం ప్రాంతంలో రోడ్డు పక్కన పడి చనిపోయినట్టు మృతుడి భార్య వంకుడోత్ శాంతి ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం
-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్
-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
మొగులపల్లి నేటి ధాత్రి
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.
కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.
మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.
గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.
నెక్కొండ మండలంలోని తొపనపల్లి గ్రామంలో కందికొండ మల్లయ్య, అతని కుమారుడు కుమారుడు ప్రభాకర్, కోడలు రజిత లతో గొడవపడి రెండు సంవత్సరాల క్రితం విడిపోయి గ్రామంలోని పాడుబడిన పాత పాఠశాల బిల్డింగ్ లో మల్లయ్య భార్య వీరి లక్ష్మితో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ మహేందర్ తల్లి తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లి తండ్రి కొడుకులను కలిపిన ఎస్ఐ మహేందర్ దీంతో పోలీసుల విధానాన్ని ఎస్సై చోరవకు పలు వర్గాల ప్రజలు అభినందనలు తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
-వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షం నేతలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసిస్తారన్నారు.
డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్యసేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూoరెడ్డి మరణం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
మంగళవారం కరీంనగర్ లోని భూంరెడ్డి పార్థివ దేహానికి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
డాక్టర్ భూంరెడ్డి వరంగల్ జిల్లాలో పుట్టి వైద్య విద్యనభ్యసించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా వైద్య సేవలు అందించడానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వైద్య వృత్తిలోకి వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని, వైద్య పరంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాలుపంచుకొని వైద్య వృత్తిపై, రోగులకు సేవలందించే విధానంపై అందరికీ వివరించేవాడని, వృతి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఐఎంఏను బలోపేతం చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పనిచేశారని,ఆయన ఎనబై ఏళ్ల వయస్సు దాటేంత వరకు కూడా వైద్య సేవలందించిన గొప్ప వైద్యులు భూoరెడ్డి అని అలాంటి డాక్టర్ మృతి చెందడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. మృతదేహానికి నివాళ్లర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బ్రామాండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు చెంచల మురళి, తదితరులున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని పాఠశాలను అందంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణంలో పునః ప్రారంభం చేయాలని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రదానోపాద్యాయులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్ ఆశా,పేరెంట్స్ కమిటీ సభ్యులు,విఓ,లైన్ మెన్ లతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ప్రధానోపాధ్యాయులు మద్యాహ్న బోజనానికి సంబంధించి బియ్యం ఇతర దినుసులు సరిగా ఉండేలా చూడాలని సూచించారు.అలాగే స్కూల్ యూనిఫాం నోట్ బుక్స్ పంపిణీ కొరకు సిద్ధంగా ఉంచుకోవాలని మరుగుదొడ్లు మరియు నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మొత్తం సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు.
Collector Dr. Satya Sarada.
అందులో భాగంగా బయోడైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ రవికిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి :
భూపాలపల్లి:: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ని అరికట్టాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అనుమతులు లేని పాఠశాలలను విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పర్మిషన్ రద్దు చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పేద వారి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ పై వెంటనే విచారణ జరిపి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని దాంతోపాటు అనుమతులు లేని పాఠశాలలకు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలు కాకముందే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం గ్రామీణ స్థాయి వరకు వెళ్లి అడ్మిషన్స్ చేస్తున్నారు తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు స్కూల్స్ ఓపెన్ కాకముందే లక్షల లక్షల బుక్స్ బినామీన పేర్లతో రూమ్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు.. తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా వారిని కలిసి కోరడం జరిగింది లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారు అన్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు
కేసముద్రం/ నేతి ధాత్రి
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.
Chief Minister Revanth Reddy.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు పోయడం జరిగింది.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా తృతీయ మహాసభలు ఈనెల 13 తేదీన హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరుగనున్నాయని జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని టిడబ్ల్యూజేఎప్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తడగోని రాజు పిలుపునిచ్చారు.మంగళవారం అమరాదామంలో మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా గూడెల్లి నాగేంద్ర అద్యక్షతన జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో గత బిఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.అదికారంలోకి వచ్చే ముందు జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదంటు విమర్శించారు.రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సైతం నెల కొంటున్నాయంటు ఆవేదన వ్యక్తం చేశారు.ఈలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునారావృతం కాకుండా సమర్దవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు జర్నలిస్టు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరంఉందన్నారు.జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం జిల్లా మహాసభలకు ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజెఎఫ్ జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్,దామెర రాజేందర్,కోగిల చంద్రమౌళి,ఏకు రవికుమార్,సిలువేరు రాజు,దేవు నాగరాజు,నాగెల్లి సంతోష్,చుక్క సతీష్, తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన సింగరేణి సంక్షేమ సంఘం నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
కాకతీయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజన్లో రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్, ఏరియా లైజన్ ఆఫీసర్, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పర్సనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వారి బృందంతో పాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు భాస్కర రావు జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు కార్యనిర్వాహక అధ్యక్షులు పంతుల ఏరియా అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొని, ఆర్జి-1 ఏరియా, ఆర్జి-2 ఏరియా, బెల్లంపల్లి ఏరియా, మందమర్రి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్ టీ పీపీ ఈ 5 ఏరియాల్లో ఉన్నటువంటి రోస్టర్ రిజిస్టర్ పుస్తకాలను తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అన్ని పోస్టుల వివరాలను ఏరియా పర్సనల్ మేనేజర్ ద్వారా కాపీలను తీసుకోవడం జరిగింది ఏరియాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, ఆర్జి -1 ఏరియా, – 66 ఆర్జి-2 ఏరియా, – 31 ఆర్జి- 3 ఏరియా. -48 బెల్లంపల్లి ఏరియా – 11 మందమర్రి ఏరియా – 31 శ్రీరాంపూర్ ఏరియా. -92 ఎస్ టి పిపి- 03 భూపాలపల్లి ఏరియా – 33 ఎన్ సి డబ్ల్యూ ఏ క్యాడర్లలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను పైన తెలిపిన విధంగా ఏరియాలో గిరిజనుల పోస్ట్లు భర్తీ కాకుండా ఉన్నాయని తెలియజేస్తున్నాము వాటిని భర్తీ చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ కి తెలియజేయడం జరిగింది వాటిని భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వారు అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కావున ఏరియాలో ఉన్న జరిగిన ఉద్యోగస్తులు గమనించగలరు కోరుతున్నాము ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా అధ్యక్షులు మోహన్ సెక్రటరీ హేమ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రాములు, జాయింట్ సెక్రెటరీ రాజు నాయక్ సిహెచ్ వెంకన్న జి అనిల్ లక్ష్మణ్ మోతిలాల్ పాల్గొన్నారు
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మరియు వాటిని నియంత్రించేటువంటి పద్ధతులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని కల్నల్ ఆఫీసర్ ఏకే జయంతి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్సిసి క్యాడెట్ల శిక్షణ శిబిరంలో భాగంగా అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించినటువంటి అగ్ని ప్రమాదాల నివారణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతగానో ఉందని ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పెద్ద నష్టం కలిగేటువంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు నియంత్రించాలని వారు చెప్పారు.
అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటిని ఎలా నియంత్రించవచ్చని విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఎంతగానో ఉందని, అగ్ని ప్రమాదాలు వివిధ రకాలుగా ఉంటాయని విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, వంటగదిలో సంభవించే ప్రమాదాలు, ప్రమాదశాత్తుగా ఎగిసేటువంటి మంటలు, నిర్లక్ష్యం వలన జరిగేటువంటి ప్రమాదాలను విద్యార్థులకు తెలియజేయాలని వారు చెప్పారు.
వారు మాట్లాడుతూ ఎప్పుడైతే అగ్నిప్రమాదం సంభవిస్తుందో ఆసమయంలో అగ్నిమాపక సిబ్బంది యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని మరియు అగ్నిప్రమాదం నివారణ పరికరాలను కొన్నింటిని అందుబాటులో పెట్టుకోవాలని వారు సూచించారు.
అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించినటువంటి అవసరం ఎంతగానో ఉందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్ తెలిపారు.
ముఖ్యంగా హోం విధానం కార్బన్డయాక్సైడ్ పౌడర్ లిక్విడ్ వివిధ విభాగాల పద్ధతులను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్పారు.
ప్రతి విద్యార్థి ఈవిలువైన సమాచారాన్ని అందించాలని మరియు ఇటువంటి విపత్తులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు ముందు వరుసలో ఉండి సేవా భావాన్ని వ్యక్తీకరించాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆఫీసర్ వి.కృష్ణ, సబ్ మేజర్ సాగర్ సింగ్, సిబ్బంది, కెడెట్లు, తదితరులు పాల్గొన్నారు.
– ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగులపల్లి నేటి ధాత్రి
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ములకలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వో లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు.
కొరికిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు.
గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.
గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల గోపి కుమారుడు. స్వాతి.క్.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే మరణించడం జరిగిందని. తన వంతు సహాయంగా అంకిరెడ్డి పల్లె మాజీ ఎంపిటిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాడ సానుభూతి తెలుస్తూ. ఎనగందుల గోపి. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త అని అతని కుమారుడు స్వాతి అనారోగ్యం కారణంతో మరణించగా నా వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని 2500 రూపాయలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను చనిపోయిన కుటుంబ సభ్యులు ఈ సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో ఓబులాపూర్ బూత్ అధ్యక్షులు .నందగిరి మధు. సీనియర్ నాయకుడు ఆసాని రామలింగారెడ్డి బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చిందం నరేష్. సిరిసిల్ల వంశీ. సంపత్. చిలగాని నరేష్. గోకుల కొండ కృష్ణ. మెహర్ కృష్ణ. అనిల్. ప్రశాంత్. శ్రీకాంత్. నాయకుడు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .
పార్టీ నాయకులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.
సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .
పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.
కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.
పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలి
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని కులాలకు కృతజ్ఞతలు తెలుపుతాం- ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ
కరీంనగర్, నేటిధాత్రి:
జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని , దండోరా జెండాను ఆవిష్కరించి అన్ని కులాల పెద్దలను సత్కరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సదస్సు కొత్తూరి రాజన్న మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది.
ఈపోరాటానికి అన్ని కులాలు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని అన్నారు.
గుండె జబ్బుల చిన్నారుల ఉచిత ఆపరేషన్ల కోసం, ఆరోగ్యశ్రీ పథకం కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల పెన్షన్ల కోసం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం తెలంగాణ అమరుల కుటుంబాల సంక్షేమం కోసం, మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పాలకుల మీద పోరాడి విజయం సాధించిందని అన్నారు.
ఈఫలితాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.
సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండి అన్ని వర్గాలకు ఉద్యమం ద్వారా సేవ చేసినందుకే మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం దక్కిందని అన్నారు.
ఈఅవార్డు మాదిగ జాతికి దక్కిన గౌరవమని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల దృష్ఠిలో పెట్టుకొని భవిష్యత్తూలో ముందుకు సాగుతామని అన్నారు.
జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించాలని అన్నారు.
ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, శనిగరపు హన్మయ్య మాదిగ, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, గంగాధర రవి మాదిగ, జెట్టిపెల్లి అనిల్ మాదిగ, గజ్జెల స్వామి మాదిగ, లంక నర్సింగం మాదిగ, తడగొండ రమేష్ మాదిగ, కనకం అంజయ్య మాదిగ, తడగొండ రాజు మాదిగ, కొత్తూరి బాబు మాదిగ, భూత్కూరి అంజయ్య మాదిగ, గుడిసె విజయ్ మాదిగ, రేణికుంట బాపు రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి
ఆర్ టి ఓ కు ఫిర్యాదు
వనపర్తి నేటిధాత్రి :
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూలు బస్ లను సిజ్ చేయాలని విద్యార్థుల యువజన సంఘాల అధ్యర్య ములో ఆర్ టి ఓ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాల నాయకులు రాఘవేంద్ర వెంకటే ష్ కుతుబ్ లు మాట్లాడుతూ వనపర్తి పట్టణ ము జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని చెప్పారు పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాళ్ళు లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల మరణ ము కు కారణం అవుతున్నారని తెలిపారు
సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకకొరత
మూడు వేల రూపాయల. నుండి నాలుగు వేల రూపాయలు
టాక్టర్ ఇసుక అమ్ముతున్న ఇసుక అక్రమ దారులు ఆగిపోతున్న నిర్మాణాలు
వారానికి మూడు రోజులు ప్రభుత్వం ఇసిక సప్లై చేయాలి
ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అందిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో 700 పై చిలుకు ఇల్లు మంజూరు చేయడం జరిగినది. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వలన ఇసుక కొరత తీవ్రంగా తీవ్రంగా నెలకొన్నది ఫలితంగా నిర్మాణాలు ఆగిపోయాయి ఇసుక డిమాండ్ ను ఆసరా చేసుకొని కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసి వాళ్ళు ఇసుక ధర పెంచి 1500 ట్రాక్టర్ ఉన్న రేటును మూడు3 వేల నుండి 4 వేలకు టాక్టర్ .ఇసుక అమ్ముతున్నారు. గత 15 రోజులు నుండి ప్రభుత్వం ఇసుక సప్లై కి చేయకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరత లేకుండా వారానికి మూడు రోజులు ఇసుక పంపిణీ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అవుతుంది వర్షాలు బాగా పడి మానేరు వాగు ప్రయాహిస్తే మానేరు నుండి ఇసుక తీయడం నిలిచిపోతుంది.ఫలితంగా ప్రభుత్వం దసరా వరకు పూర్తి చేయాలనుకున్న నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోతాయి.ఇల్లు కూలగొట్టుకొని నిర్మాణం చేసుకుంటున్నాం వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.సిరిసిల్ల ప్రజలకు తరుపున. మానేరులో ఇసుక ఉన్నా కూడా వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది ఇసుక అక్రమ దారులు మానేరు నుంచి కోట్లాది రూపాయల ఇసుకను దొంగతనం చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతుంటే. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తారు స్థానికులు నిర్మాణాలు చేసుకోవడానికి కావాలంటే అనేక ఆంక్షలు ప్రభుత్వం విధిస్తుంది,ఇప్పటికైనా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్మించుకుంటున్న వారి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సప్లై చేయాలి. మానేరు నది నుండి ఇతర ప్రాంతాలకు ఇసుకను. అక్రమంగా తరలించకుండా అక్రమ దారులపై పీడీ యాక్ట్ కేసు లు నమోదు చేయాలి టాక్టర్ ఇసుక ధర 1500 మించకుండా ప్రభుత్వం ధరలను నియంత్రించాలనీ. అన్నారు లేనిపక్షంలో సి.పి.ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సి.పి.ఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు పాల్గొన్నారు.
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే… వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
– వ్యవసాయ పనిముట్లకు పూజలు…
Agricultural Work.
ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకుంటారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.
– రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్….
కొల్చారం మండలం రైతులకు కొల్చారం మండలం సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.