జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా “అతను జన్మతః భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! ‘హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.

 

Provide quality education to students

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా గొల్లపల్లి సత్య పీరీలు(దర్గా) యాత్రకు

వైభవంగా గొల్లపల్లి సత్య పీరీలు(దర్గా) యాత్రకు *సిరిసిల్ల విద్యానగర్ అడ్డా ఆటో యూనియన్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని విద్యానగర్ అడ్డ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ యూనియన్ సంఘం వారు
ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గొల్లపల్లి దర్గా సత్య పీరీలు యాత్రకు అంగరంగ వైభవంగా యాత్ర చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల విద్యానగర్ అడ్డా టాటా యూనియన్ ప్యాసింజర్ అధ్యక్షులు అధ్యక్షులు మహమ్మద్ షఫీవుద్దీన్,ప్రధాన కార్యదర్శి నడిగోట్టు సుమన్, కోశాధికారి పేరుమల సత్తయ్య, కార్యదర్శి. కూతూరి బాలకృష్ణారెడ్డి, తదితర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగినది.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి

 

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.

`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.

`అమరావతి దేవతల రాజధాని!

`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.

`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.

`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.

`అదే దేవతల రాజధానిగా భావించాలి.

`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.

`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!

`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!

`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!

`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!

`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.

`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.

`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.

`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!

హైదరాబాద్‌,నేగిధాత్రి:

తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్‌ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్‌ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్‌ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్‌గా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..

ఎవడైతే నాకేంటి!?

`దొంగ మిల్లర్‌ జగన్‌ ‘‘బడివె’’ మాటలు!

`నా మిల్లులను టచ్‌ చేసే దమ్ముందా!

`అందరూ నా సొమ్ము తిన్నోళ్లే!

`ఎవడొస్తాడో రాని చూస్తా!

`500000 వడ్ల బస్తాలు లెక్కకున్నాయా?

`28 వేల బస్తాలల్లో 2000 పైచిలుకు బస్తాలు మాయం! మరి 500000 బస్తాలలో ఎన్ని బస్తాలు మాయం చేసినట్లు!

`ఆ రెండు మిల్లులకు కేటాయించిన 500000 బస్తాల లెక్కలు తేల్చండి!

`జగన్‌ బండారం బైట పెట్టండి.

`రైతులను మోసం చేసిన మిల్లులను మూసేయండి!

`అధికారులు, నా సొమ్ము తిన్న వాళ్లకు అంత ధైర్యముందా? అని సవాలు విసురుతున్నాడు.

`హనుమకొండ ‘‘జెసి’’ కోరిన రిపోర్ట్‌పై ఇప్పటివరకు స్పందించని, డీఎస్‌ఓ కొమురయ్య,సూపరిండెంట్‌ రోజారాణి,డిటి నాగేంద్ర ప్రసాద్‌..

`వరంగల్‌ మిల్లర్ల అవినీతిపై ఖమ్మం జెసి సివిల్‌ సప్లై కమిషనర్‌ కి సమర్పించిన ఆధారాలు.

`ఆ మహిళా అధికారికి గుణం కన్నా కులమే ముఖ్యమట? 

`మిల్లర్‌ జగన్‌ను కాపాడే తీరుతుందట?

`హనుమకొండ అధికారుల తీరుపై విస్తుపోతున్న ఖమ్మం అధికారులు.

`తనపై చర్యలు తీసుకుంటే అందరి గుట్టు బయట పెడతానంటున్న జగన్‌.

`జగన్‌ మిల్లుల్లో ఉన్న లక్షల వడ్ల బస్తాలని ఇతర మిల్లులకు తరలించాలని ఖమ్మం జేసి. ఆదేశాలు.

`అధికారులను అమ్మనా బూతులు తిడుతున్న జగన్‌?

`ఆ విషయం తెలిసినా చీమ కుట్టినట్లు కూడా లేని అధికారులు?

`ఖమ్మం జేసి ఎంక్వౌరీకి ఆదేశించి 15 రోజులకొస్తోంది?

`ఇంత వరకు హనుమకొండ ‘‘జెసి’’ కి ట్రక్‌ షీట్లు కూడా అందించని అధికారులు.

`5 లక్షల బస్తాల లెక్కలెప్పుడు తేల్చుతారు! జగన్‌ బండారం ఎప్పుడు బైట పెడతారు!

`జగన్‌ అక్రమ సంపాదన ఎప్పుడు వెలికితీస్తారు?

`రైతులకు న్యాయం ఎప్పుడు చేస్తారు?

`ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన వడ్లతోనే రూ.20 లక్షల మోసం చేసిన జగన్‌?

`20 ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో ఎంత మాయం చేసి వుంటారు?

`ఎన్ని కోట్లు వెనకేసుకొని వుంటాడు?

`అంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులంతా గప్‌ చుప్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

తవ్వుతున్నా కొద్ది హన్మకొండలోని ఓ అక్రమ మిల్లర్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అధికారుల అండదండలతో విచ్చలవిడిగా ఆ అక్రమ మిల్లర్‌ సాగిస్తున్న అక్రమ దందాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మిల్లర్‌ బాగోతాలపై నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూనేవుంది. ఆ వార్తలు వాస్తవాలను అంగీకరిస్తూ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండ అదికారులకు సూచిస్తూ నోట్‌ కూడా పంపించారు. ఆ నోట్‌ హన్మకొండ జిల్లా అధికారులకు చేరి కూడా సుమారు 15 రోజులౌతోంది. అయినా హన్మకొండ జిల్లా యంత్రాంగం కదిలింది లేదు. ఉలుకు లేదు. పలుకులేదు. పైగా అక్రమ మిల్లర్‌కు జగన్‌కు వంతపాడుతున్నారు. అండగా వుంటున్నారు. అతనికి తప్పించుకునేందుకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. ఆఖరుకు ఖమ్మం జిల్లా జేసినే బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే జగన్‌ వద్ద నుంచి లెక్కలేనంతసొమ్ము అదికారులు ఎప్పటికప్పుడు అందుకున్నారు. జగన్‌తో లాలూచీ పడ్డారు. అందుకే జగన్‌ ఇటీవల ఓ ఫంక్షన్‌లో అధికారులపై బూతులు సందించినట్లు కూడా విశ్వసనీయ సమచారం. ఆ ఫంక్షన్‌లో జగన్‌ మీద వస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? ఎవడొచ్చి నన్ను ఏం చేస్తారు? అంతా నా గుప్పిట్లో వున్నారు. నా చేతిలో వున్నారు. నేను చెప్పింది మాత్రమే వాళ్లు వినాలి. లేకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలుసు. అంటూ అదికారులన్న మర్యాద కూడా లేకుండా బూతులు సందిస్తూ ఆ ఫంక్షన్‌లో జగన్‌ హంగామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. నన్ను..నా మిల్లును టచ్‌ చేసే దమ్ము ఎవరికి వుంది? నా మిల్లు దగ్గరకు వచ్చిన మాట్లే ధైర్యం వాళ్లకు వుందా? అంటూ సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, కింది నుంచి పై స్దాయి దాక అందరూ నా సొమ్ము తిన్నవాళ్లే..నేను వేసే బిస్కట్లకు ఆశపడేవారే..అలాంటి వాళ్లు నా జోలికి వస్తారా? సివిల్‌ సప్లైకి చెందిన విజిలెన్స్‌ అయినా, ఎవరైనా సరే నా మిల్లుల కాంపౌండ్‌లోకి రాలేరు. ఎవడొస్తారో..రాని చూస్తా? అంటూ జగన్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జగన్‌కు కేవలం 28వేల బస్తాల వడ్లే వచ్చినట్లు అనుకుంటున్నారు. కాని నిజానికి 2024`25 తొలి సీజన్‌లోనే సుమారు 5లక్షల వడ్ల బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ ఖమ్మం జిల్లాలకు చెందిన వడ్లు కావడం విశేషం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన రైతులు ఎవరూ మిల్లర్‌ జగన్‌కు వడ్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒక వేళ ఇచ్చినా ముందు మురిపెంగా మాట్లాడే జగన్‌ తర్వాత ఎంత కోతలు కోస్తాడో..రైతులను ఎంత ముంచేస్తాడో అందరకీ తెలుసు. అందుకే జగన్‌ మిల్లులకు ఏ ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి కూడా జగన్‌కు వడ్లు ఇవ్వడానికి రైతులు అసలే ఒప్పుకోరు. అందుకే మిల్లర్‌ జగన్‌ ఖమ్మం జిల్లాకు చెందిన ఐకేపి సెంటర్ల నుంచి వడ్లు తెచ్చుకుంటాడు. ఖమ్మం జిల్లాకుచెందిన ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన 28వేల బస్తాలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేసినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. అది నిజమే అని ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ నిర్దారణ చేశారు. ఆ బస్తాలు ఏమయ్యాయో? వెంటనే రిపోర్టు కావాలని కోరిన సందర్భం కూడా వుంది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ఇప్పటి వరకు కదల్లేదు. అయితే జగన్‌ అక్రమ దందాలపై నేటిధాత్రి మరింత దృష్టిపెట్టడంతో ఖమ్మం జిల్లాలోని సుమారు 20 ఐకేపి సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 5లక్షల వడ్ల బస్తాలు జగన్‌ మిల్లులకు చేరినట్లు సమాచారం. 28వేల బస్తాలతోనే సుమారు 2వేల బస్తాలు మాయం చేసిన జగన్‌, 5లక్షల బస్తాలలో ఎంత మాయి చేసి వుంటాడో అర్ధం చేసుకోవచ్చు. 28వేల బస్తాలలో మాయం చేసిన 2వేల బస్తాల మూలంగా జగన్‌ 20లక్షల రూపాయలు రైతులను మోసం చేశాడు. అంటే 5లక్షల వడ్ల బస్తాలలో జరిగిన మాయంతో ఎన్ని కోట్లు కొట్టేశాడన్నది ఇప్పుడు లెక్క తేలాల్సి వుంది. ఇలా జగన్‌ చేస్తున్న మోసాలన్నీ హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు, రైతులకు పూర్తిగా తెలుసు. అయినా ఎవరూ మాట్లాడానికి ముందుకు వచ్చేవారు కాదు. జగన్‌ అరచకాలు అలా వుండేవి. గత ప్రభుత్వ హాయాంలో కులం పేరు చెప్పుకొని ప్రాపకం పొందేవాడు. ఇప్పటికి కూడా అదే సాగిస్తునాన్నాడు. ఆనాటి నుంచి జగన్‌ కనుసన్నల్లో వున్న అధికారులే ఇప్పటికీ వుండడంతో ఆయన ఆటలకు అడ్డు కట్ట పడడం లేదు. జగన్‌ మోసాలను ఎవరూ బైట పెట్టడం లేదు. పైగా జగన్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం జేసిని బురిడీకొట్టించాలని చాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి చేసిన స్కెచ్‌ జగన్‌, హన్మకొండ అదికారులు పసిగట్టకపోవడంతో అసలు బండారం బైట పడిరది. అయితే రెండు వేల బస్తాలకు సంబందిచిన సొమ్ము అందడంతో కాస్త ఆలస్యమైంది. అందుకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన సొమ్ము రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పమని జగన్‌కు హన్మకొండ అదికారులు సూచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఇంత జరుగుతున్నా జగన్‌ది అక్రమమని అనేందుకు కూడా హన్మకొండ అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఖమ్మం జేసి రిపోర్టునే తొందరపాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన రెండుమిల్లలకు ఎన్ని బస్తాల వడ్లు చేరాయో లెక్కలు తేల్చే పనిలో ఖమ్మం జిల్లా అదికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటి వరకు అందినసమాచారం మేరకు జగన్‌కు చెందిన మిల్లులకు ఇప్పటికే 5లక్షల బస్తాలు చేరినట్లు ప్రాధమిక సమచారం. ఇంకా లోతుగా తవ్వితే ఎంత చేరిందనేదానిపైకూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. జగన్‌కు ఇప్పుడు అసలైన భయం మొదలైంది. హన్మకొండ అదికారులను గుప్పిట్లోపెట్టుకొని ఆడినట్లే ఖమ్మం జిల్లా అధికారులను కూడా కొనేయాలనిచూశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి నిక్కచ్చిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. జరిగిన అక్రమ దందాలన్నీ బైట పెట్టాలనే చూస్తున్నారు. జగన్‌ వల్ల రైతులు ఎంతో మోసపోయారని గుర్తించారు. ఆ సొమ్ముంతా రైతులకు చేరేలా చూడాలనుకుంటున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి, కమీషనర్‌ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే హన్మకొండ అధికారులు కూడా రంగంలోకి దిగక తప్పదు. జగన్‌ బండారం బైట పెట్టక తప్పదు. ఎందుకంటే అప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అలాంటి పరిస్ధితి వస్తే జగన్‌ను దోషిని చేయడం ఖాయం. కాకపోతే హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా అదికారి జగన్‌కుచెందిన సమాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో జగన్‌ను కాపాడే బాద్యత ఆమె భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అదికారికి జగన్‌ గుణం, వ్యవహారం, అక్రమ దందాలకన్నా, మోసాలకన్నా కులమే ముఖ్యమట? జగన్‌కు కాపాడి తీరుతుందట? ఈ విషయాన్ని ఆమె కార్యాలయంలో ఇతర ఉద్యోగులతో బాహంటానే చెబుతున్నారట? హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారుల తీరుతో ఖమ్మం జిల్లా అదికారులు విస్తుపోతున్నారు. ఇదేం పద్దతని తప్పుపడుతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు మేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట? రోజు రోజుకూ మితిమీరిపోతున్న జగన్‌ వ్యాఖ్యలు తెలిసిన ఖమ్మం జేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. జగన్‌కు చెందిన మిల్లుల్లో ఖమ్మం జిల్లా రైతులకు చెందిన 5లక్షల వడ్ల బాస్తాలున్నాయా? లేవా? వుంటే లెక్కంత? ఎన్ని మాయమయ్యాయి? ఎలా మయ్యామయ్యాయి? అనే వివరాలు కావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యదావిధిగా ఇతర మిల్లులకు చెందిన వడ్ల ఖమ్మం వడ్ల లెక్కలో కలపడమో? లేక ఇతర మిల్లుల గోడౌన్లలో వున్న వడ్లు జగన్‌వి అని తేల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఇంత దూరం వచ్చేదాకా అదికారులు ఏం చేస్తున్నారు? తానిచ్చిన సొమ్ములు తిని, తనకు అన్యాయం జరిగే పరిస్ధితి వచ్చేదాకా అదికారులు నిద్ర పోతున్నారా? అంటూ జగన్‌ అదికారుల మీద కూడా చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అదికారులు కదులుతారా? లేక జగన్‌కే వత్తాసు పలుకుతారా? కోట్లలో రైతులను ముంచేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గుండె గుడిలో ఇందిరమ్మ గూడు.

`శీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం.

`రేవంత్‌ సర్కారులో పల్లెకు కొత్త దనం.

`తెలంగాణకు సరికొత్త నిండుదనం.

`తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం!

`శీనన్న చొరవతో పేద వారి ఇంటి కలకు మోక్షం.

`ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల పండుగ

`పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక.

`ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం.

`పేదవారి కళ్లలో ఆనందం.

`పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం.

`గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం.

`పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలమంతా ఆశల మేఘం.

`ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం.

`పేదలందరికీ కాంగ్రెస్‌ అందిస్తున్న వరం.

`జీవిత కాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ పల్లెల్లో పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలైంది. పల్లె సంబురపడుతోంది. దశబ్ధానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. పదేళ్లపాలు రెండు పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి, ఊరించి బిఆర్‌ఎస్‌ ఉసూరుమనిపించింది. ఎన్నికలెప్పుడొచ్చినా రెండు పడకల ఇల్లు ముచ్చట చెప్పుడు తప్ప తీర్చింది లేదు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసిఆర్‌ ఇచ్చింది లేదు. ఎన్నొన్నో చెప్పాడు. ఆఖరుకు కేసిఆర్‌ చేతులెత్తేశాడు. మాయ మాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగొట్టుకొని పదేళ్లు పాలించి, పట్టుమని పది ఇండ్లుకూడా ఇవ్వలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ మాటంటే మాటే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్సే. సొంత ఇల్లు అనేది అందిరకీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు వుండేవి. కాని తరం మారుతున్న కొద్ది ఆ ఇండ్లు పాతబడిపోవడం. కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరుగుతుండడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని, ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతోంది. గత యాభైఏళ్ల క్రితం వరకు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక గుడిసె వేసుకొని బతికేవారు. కాని ఈ రోజుల్లో గుడిసే వేసుకునేందుకు స్ధలం లేదు. కట్టుకునే స్ధోమత లేదు. దాంతో ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు ఇస్తుందా? అని ఎదురుచూసే రోజులు వచ్చాయి. పేదలు మరింతగా ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టుకునే స్ధితికి చేరింది. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వినిపిస్తేనే పేదల కళ్లలో ఆనందం నిండుతుంది. ఇక మంజూరైన వారి ఆనందానికి అవదులు వుండవు. కాంగ్రెస్‌ అంటేనే పేదల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమని దేశమంతా అందుకే ఇప్పటికీ ప్రజలు కొనియాడుతుంటారు. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కావడం వల్ల పేదలుకు ఎంతో మేలు జరిగింది. పేదలను ఒక స్దాయికి తీసుకురావాలన్న ప్రగతికి బాటలు పడిరది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడం మొదలైంది. అయితే అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మొదలైందంటే అది నిరంతర ప్రవాహంగా సాగాల్సిందే. ఒకప్పుడు దేశంలోని భూములున్నీ అగ్రవర్ణాల చేతుల్లో వుండేవి. ప్రభుత్వం ఆదీనంలో వుండేవి. వాటన్నింటిలో నూటికి తొంబైశాతం మేర ఆ రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఇందిరాగాంధీ భూములు పంచారు. ఆ భూములను సాగుయోగ్యం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, వాటిని సాగుయోగ్యం కోసం పక్క బావులు తివ్వించారు. అలాంటి బావులు ఇప్పుడు తవ్వించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయినా ఆరోజుల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, బావులు తొవ్వించి రైతులను చేశారు. కుల వృత్తులకు పరిమితైన ఆ వర్గాలను రైతులను చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అంతే కాకుండా దేశంలోని ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అప్పుడే మొదలైంది. అలా దేశంలో కొన్ని కోట్ల మందికి ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ వల్లనే సాధ్యమైంది. పల్లె పట్టణాలు అనే తేడాలేకుండా గర్‌ కుల్‌ అనే కాలనీలు పెద్దఎత్తున వెలిసిన రోజలవి. తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దేశంలోని అనేక పట్టణాలల్లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం చేసి, ప్రజలకు నీడ కల్పించారు. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడిరాష్ట్రంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో అటు రైతులకు, ఇటు పేదలకు అనేక రకాలమేలు చేశారు. అర్హలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించారు. ప్రతి ఊరిలోనూ, పట్టణాల్లోనూ ప్రభుత్వ భూములనే సేకరించి, ప్రజల చేతికి రూపాయి ఖర్చు లేకుండా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రతి పల్లెల్లో కనీసం 50 నుంచి వందకు తక్కువ కాకుండా ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి. ప్రతి పట్టణంలో వేలాది ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు అనేకం వున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఉపాధి హమీ అమలు చేసి, ఆర్ధిక ప్రగతికి తోడ్పాటు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనటు వంటి పధకం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్‌ రెండు పడకల గదుల ఇండ్లు అనికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య కాదని ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రుజువైంది. అందుకే తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను నమ్మారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీనే గెలిపిస్తే ఇప్పటి వరకు మరో ఇరవై లక్షల ఇండ్లకు పైగా నిర్మాణం జరిగేవేమో? కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో వున్న గృహ నిర్మాణ శాఖను రద్దు చేసినప్పుడే కేసిఆర్‌ నైజం బైట పడిరది. డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్లు అనేవి మిధ్యఅనేది తేలిపోయింది. కాని జనం కేసిఆర్‌ ఇస్తారన్న నమ్మకాన్ని రెండోసారి కూడా పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వడానికి సుముఖతచూపలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని నమ్మించి, గృహనిర్మాణ శాఖను వదిలించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆ శాఖను మూసేయించారు. దాని మనుగడ లేకుండా చేశారు. ఈ వాదన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. ఆ సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చిన్న పొరపాట్లు జరిగడం సహజం. అయినా ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా? అని కూడా అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని చెప్పి, అప్పటి ప్రతిపక్షాల నోరు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఇచ్చారు. కాని బిఆర్‌ఎస్‌కు సాద్యం కాలేదు. ఇవ్వాలన్న మనసు కేసిఆర్‌కు రాలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో కనిపించిన పండుగ మళ్లీ మొదలైంది. పల్లెల్లో పెద్దఎత్తున పండుగ వాతారణం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడిక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతంవున్న పరిస్ధితుల్లో ఊరుకి పది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14వేల గ్రామాలున్నాయి. పట్టణాలు 600లకు పైగా వున్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం రెండు లక్షలకు పైగా ఇండ్లు ఏక కాలంలో పూర్తయ్యే అవకాశం వుంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్దాయిలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు జరిగితే మూడేళ్లలో కనీసం 15లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగొచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం వుంది. ప్రతి పల్లెలోనూ కనీసం రెండు నుంచి మూడు వందల కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే సాద్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా ప్రజలకు హమీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాదినుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వ నిబద్దతకు నిరద్శనమని చెప్పొలి. పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతినియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4వేల ఇండ్ల నిర్మాణం మొదలైంది. మరో రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి, ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయంకూడా ఆసన్నమౌతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ చెప్పకతప్పదు.

గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల అడ్మిషన్లు.

మార్గదర్శకాల విడుదలకు మంత్రి పొన్నం కు వివిజ్ఞప్తి

“నేటిధాత్రి”, హైదరాబాద్.

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇవ్వాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి లు మంగళవారం హైదరాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. 

 

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. నెం. 205 ప్రకారం… ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు కోరారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కొమ్మినేని శ్రీనివాస్ రిపోర్టర్ అరెస్టుకు నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా సాక్షి సీనియర్ రిపోర్టర్
కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ లో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి కి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన జర్నలిస్టులు. సాక్షి ఛానల్ పత్రిక కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నామని అక్రమంగా అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు.

మద్యం మత్తులో వ్యక్తి మృతి

మద్యం మత్తులో వ్యక్తి మృతి

నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ ప్రాంతంలో ఒక వ్యక్తి మధ్యమధ్య మృతి చెందాడు ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన బద్య 38 సంవత్సరాలు, గల వ్యక్తి మద్యానికి బానిసై ఇల్లు వదిలి నెక్కొండ పట్టణ కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి ఐస్క్రీం ప్రాంతంలో రోడ్డు పక్కన పడి చనిపోయినట్టు మృతుడి భార్య వంకుడోత్ శాంతి ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలోని తొపనపల్లి గ్రామంలో కందికొండ మల్లయ్య, అతని కుమారుడు కుమారుడు ప్రభాకర్, కోడలు రజిత లతో గొడవపడి రెండు సంవత్సరాల క్రితం విడిపోయి గ్రామంలోని పాడుబడిన పాత పాఠశాల బిల్డింగ్ లో మల్లయ్య భార్య వీరి లక్ష్మితో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ మహేందర్ తల్లి తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లి తండ్రి కొడుకులను కలిపిన ఎస్ఐ మహేందర్ దీంతో పోలీసుల విధానాన్ని ఎస్సై చోరవకు పలు వర్గాల ప్రజలు అభినందనలు తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షం నేతలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసిస్తారన్నారు.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్యసేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూoరెడ్డి మరణం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

మంగళవారం కరీంనగర్ లోని భూంరెడ్డి పార్థివ దేహానికి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

డాక్టర్ భూంరెడ్డి వరంగల్ జిల్లాలో పుట్టి వైద్య విద్యనభ్యసించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా వైద్య సేవలు అందించడానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వైద్య వృత్తిలోకి వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని, వైద్య పరంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాలుపంచుకొని వైద్య వృత్తిపై, రోగులకు సేవలందించే విధానంపై అందరికీ వివరించేవాడని, వృతి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఐఎంఏను బలోపేతం చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పనిచేశారని,ఆయన ఎనబై ఏళ్ల వయస్సు దాటేంత వరకు కూడా వైద్య సేవలందించిన గొప్ప వైద్యులు భూoరెడ్డి అని అలాంటి డాక్టర్ మృతి చెందడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. మృతదేహానికి నివాళ్లర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బ్రామాండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు చెంచల మురళి, తదితరులున్నారు.

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం చేయాలి

మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని పాఠశాలను అందంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణంలో పునః ప్రారంభం చేయాలని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రదానోపాద్యాయులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్ ఆశా,పేరెంట్స్ కమిటీ సభ్యులు,విఓ,లైన్ మెన్ లతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ప్రధానోపాధ్యాయులు మద్యాహ్న బోజనానికి సంబంధించి బియ్యం ఇతర దినుసులు సరిగా ఉండేలా చూడాలని సూచించారు.అలాగే స్కూల్ యూనిఫాం నోట్ బుక్స్ పంపిణీ కొరకు సిద్ధంగా ఉంచుకోవాలని మరుగుదొడ్లు మరియు నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మొత్తం సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు.

 

Collector Dr. Satya Sarada.

 

 

అందులో భాగంగా బయోడైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ రవికిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

భూపాలపల్లి:: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ని అరికట్టాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అనుమతులు లేని పాఠశాలలను విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పర్మిషన్ రద్దు చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పేద వారి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ పై వెంటనే విచారణ జరిపి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని దాంతోపాటు అనుమతులు లేని పాఠశాలలకు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలు కాకముందే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం గ్రామీణ స్థాయి వరకు వెళ్లి అడ్మిషన్స్ చేస్తున్నారు తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు స్కూల్స్ ఓపెన్ కాకముందే లక్షల లక్షల బుక్స్ బినామీన పేర్లతో రూమ్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు.. తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా వారిని కలిసి కోరడం జరిగింది లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారు అన్నారు

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది.

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం/ నేతి ధాత్రి

 

 

 

 

 

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.

 

Chief Minister Revanth Reddy.

 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు  పోయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version