నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం…

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం

నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి

కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని.!

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణ లక్ష్మి పథకం..

#ఆర్ధిక భారంలో ఉన్న సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు…

#ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు..

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే నాయిని.

హన్మకొండ, నేటిధాత్రి:

ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు రూ. 42,04,842 ల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు.కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు .
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం.

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-1-1.wav?_=1

ఇందిరా సౌర గిరిజన వికాసం స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోడు భూములు ఉన్న గిరిజనలు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. పట్టా పాసు పుస్తకం, కులం సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలని పేర్కొన్నారు.

రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ.

రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ

ఎదురుచూస్తున్న… యువత నిరుద్యోగులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో
బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు హొల్లాల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.

తహసిల్దార్ ఇమాం బాబా షేక్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రైతు భరోసా పథకం.

రైతు భరోసా పథకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఆయా గ్రామాల ప్రజలకు
కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు ధరఖాస్తు పెట్టుకోవడానికి .చివరి తేదీ 20 జూన్ 2025 శుక్రవారం.(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం వానాకాలం 2025-26)
05.06.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు:
1. పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ 2. ఆధార్ కార్డు జిరాక్స్. 3. బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్. 4. పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం.
ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి గారికి సమర్పించాలి.
గమనిక 1 : 05.06.2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడింది. డిజిటల్ సంతకం అయినా రైతులు అర్హులు.
గమనిక 2: గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు హారి
వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగలరు

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం.

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం

◆ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్

◆ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,,ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ
‘రాజీవ్‌ యువ వికాసం పథకం, కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్‌ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి, పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయి అన్నారు.. రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, రకంలో నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు .. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు.. నమ్మిన యువకులకు కాంగ్రెస్‌ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.,బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్‌, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్‌ ప్రభుత్వం జాయినింగ్‌ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో అర్భాటంతో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అంటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్‌ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్‌ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు.. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్‌ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు దీపక్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు ఓంకార్, ఫయాజ్,రోహిత్, శ్రీనాథ్ ,ప్రవీణ్ మెస్సీ,
తదితరులు .పాలుగోన్నారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

shine junior college

ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
దాంక రమేష్ ,రోడ్డ రమేష్
క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

కారేపల్లి నేటి ధాత్రి:

కారేపల్లి మండలం లోని కొమ్ముగూడెం ముత్యాలంపాడు గ్రామాల లో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వై ఆర్ జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో వై ఆర్ జి కేర్ డిఆర్పి శివయ్య క్లస్టర్ లింక్ వర్కర్ ఆదేర్ల శంకర్ రావు డాక్టర్ ప్రబంధ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి రక్ష పరీక్షలు చేయడం జరిగింది అలాగే టిబి ఎలా వ్యాపిస్తుంది దానికి నివారణ మార్గాలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎలాంటి అనారోగ్యం కలిగినను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని.

Blood tests

ఈ వర్షాకాలపు సీజన్లో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ ప్రబంధ తెలిపారు వివరిస్తూ తెమడ పరీక్షలు టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్యం ల్యాబ్ సూపర్వైజర్ రామకృష్ణ టీబీ పేషెంట్ సూపర్వైజర్ విజయ కుమారి ఎల్ హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు ఏఎన్ఎం శ్యామల విజయ కుమారి ఆశా వర్కర్లు సుజాత హనుమంతి పద్మ సావిత్రి వెంకటరమణ లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే.!

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే అందించాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు సివిల్ స్కోర్ ఎలాంటి షరతులు విధించకుండా అర్హులైన వారికి పథకము అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే కేటాయించాలని,అనర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య.

“నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):

 

 

 

 

ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవమైన పథకం అని ఇందులో ఎలాంటి బేషజాలు ఉండకూడదని ఆమె అన్నారు. బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయని, మహాలక్ష్మి పథకం లేనపుడు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. రోజు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు మహాలక్ష్మి పథకం ముందు వెనుక ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఉచితం అని అందరూ బస్సుల్లో చేయడం లేదని ఇతర వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే గానీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పెట్టిన పథకాలను అగౌరవపరచకుండా , మన హక్కుగా భావించి అవసరాల నిమిత్తం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. కేవలం మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పథకం మాత్రమే రద్దు చేయాలనీ కొంతమంది కోరుకోవడం తగదని ఆమె అన్నారు. మహిళల కోసం పెట్టిన పథకాలను కొంతమంది సాటి మహిళలలే విమర్శించడం ఒక బాధ్యత గల పౌరురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నాని ఆమె తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన.!

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన లబ్ధిదారులకు మొండి చెయ్యి…

తుడుం దెబ్బ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

మండల కేంద్ర పరిధిలో గల 15గ్రామ పంచాయతీ లలో ఇందిరమ్మ ఇండ్ల ఏంపిక లో నిరుపేదలకు మొండి చేయి చూపే విధంగా ఇందిరమ్మ కమిటీ లు వ్యవహారిస్తున్నాయని కరకగూడెం మండల తుడుం దెబ్బ, అధ్యక్షులు, పోలేబోయినా ప్రేమ్ కుమార్ ఆరోపించారు.గ్రామ సభ లో మాట్లాడిన విధంగా కాకుండా ఇందిరమ్మ కమిటీలు వాళ్ళ ఇష్టనుసారంగా వాళ్లకు నచ్చినవాళ్లకు కేటాయిస్తున్నారని, నిరుపేదలు కనీసం గుడిసెలలో వారికీ కేటాయించక పోవటం చాలా బాధాకరం, అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు, కనీసం ఎంపికైనటువంటి లబ్ధిదారుల జాబితాను కూడా తెలుపకుండా పంచాయతీ సెక్రటరీలు వ్యవహరించడం తగదుఅన్నారు. అదేవిధంగా మండల ఎంపీడీవో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఇంత జరుగుతున్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని వాపోయారు తక్షణమే దీనిపై విచారణ చేపట్టి అసలైన అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలుతీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేష్ మాట్లాడుతూ. ఐదవ షెడ్యూల్ ఏరియా లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏజెన్సీ చట్టాలకు, హక్కులకు అనుకూలంగా నే ఎంపికలు జరగాలని పీసాగ్రామసభ తీర్మానాలు జరిపి గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్, కార్యవర్గ సభ్యులు, పోలె బొయిన కార్తీక్, రేగ కిరణ్ పోలిబోయిన శ్యాం ప్రసాద్, కొమరం వెంకట్, తోలేo హరికృష్ణ, గోగ్గల వేణు పోలే బోయిన రఘు పోలేబోయిన సురేష్ కుమార్, పోలే బోయిన సంతోష్ పూణేo రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇబ్బందులు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్.!

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలు కేటాయించాలి

తీగల శ్రీనివాస్ రావు
జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్(ఏ డి జె ఎఫ్)

మంచిర్యాల నేతి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి జీత భత్యాలు లేకుండా నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలను కేటాయించాలని అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప ఉద్దేశం తో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఉన్నత చదువులు చదివి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రత్యేక అవకాశం కల్పించినట్టైతే వారిని ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహించినట్టు అవుతుందని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్ట్ జీవితాలు మారలేదన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం లో రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టుల కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి

 

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 50 కి పైగా విద్యార్థులు హాజరు కాగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారని తెలిపారు. వాళ్లకు సందర్భంగా హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని సమాధానం బదులిచ్చారు.కానీ విద్యార్థులు మాకు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ కాలనీలో రేషన్ షాప్ నెంబర్ 46 వాడు ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమేష్ బాబు అజీమ్ రాజు ఉస్మాన్ రబ్బానీ డీలర్ అధికారులు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకమని క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గల మధసూదన్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేద వారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి రాజేష్, మహిళా నాయకురాలు పుష్ప,నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌకధరల దుకాణం 25 వెలగం సంతోష్ కుమార్ షాప్ వద్ద శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియమాలు చేపట్టామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ
సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డిఓ రవి, సివిల్ సప్లై జిల్లా అధికారి రాములు తహసిల్దార్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షుడు దేవాన్ పదహారే వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రేషన్ డీలర్ సంతోష్ కుమార్ పిసిసి మెంబర్ చల్లూరు మాది బుర్ర కొమురయ్య విజయ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version