ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు.

*అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు..

*నిబంధనలకు విరుద్ధంగా రూపేస్ ఏజెన్సీకి ప్రభుత్వం పాఠశాలల ట్రైనింగ్ ప్రోగ్రామ్..

*వెంటనే సంస్థను రూపేస్ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని

ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ యాదవ్ డిమాండ్.

చిత్తూరు(నేటి ధాత్రి) మార్చి 16:

జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిపెన్స్) కార్యక్రమానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రూపేస్ ఏజెన్సీకి శిక్షణ ఇచ్చే వర్క్ ఆర్డర్లను జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపిసీవో) లు అప్పగించారని, వీటిని వెంటనే రద్దు చేయాలని ఓ బిసి విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ కోరారు.ఈ మేరకు ఆయన శుక్రవారం ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం స్థానిక కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. మ్యాన్ పవర్ ఏజెన్సీ అయిన రూపేస్ ఏజెన్సీకి స్వీయ శిక్షణా కార్యక్రమంలో ఎలాంటి అర్హత లేదని ఆ సంస్థ ఎండికి ఎటువంటి నైపుణ్యం లేదని ఆయన తెలిపారు. సమగ్రా శిక్ష ఎస్పిడి ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అనుసరించలేదనినంద్యాల జిల్లాలో అయితే రూపేస్ ఎజెన్సీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అర్హత లేకపోవడంతో ఆ సంస్థకు శిక్షణా కార్యక్రమం వర్క్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు. నంద్యాల జిల్లాలో అర్హత సాధించలేని రూపేస్ సంస్థ చిత్తూరు జిల్లాలో అర్హత సాధించిందో చెప్పాలన్నారు. వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణాకార్యక్రమంపై విచారణ చేసి అర్హతగల సంస్థలను ఎంపిక చేసేలా విద్యాశాఖ మంత్రి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version