అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
రాయికల్ .నేటి ధాత్రి…
Mahotsavam
మార్చి 11.రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, నాయకులు, యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన నిందితున్ని అరెస్టు చేసిన మద్దూర్ పోలీసులు.
నిందితును వివరాలు దక్షిణపు శివయ్య, నివాసం పెద్దపలకనూరు, గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్
కేసు వివరాలు చేర్యాల సీఐ శ్రీను తెలియపరుస్తూ
చేర్యాల నేటిధాత్రి…
2025 జనవరి చివరి రోజుల్లో కమలాయపల్లి గ్రామాననికి చెందినటువంటి ధర్మోజీ నారాయణ చారి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏమనగా జీటీవీ చూ స్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడును అని ఒక ఫోన్ నెంబర్ కింద స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్ గమనించినటువంటి నారాయణచారి తనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి మనశాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిషం చెప్పించుకుంటే పోతాయని అతని నమ్మి ఆ నెంబరు కాల్ కాల్ చేయగానే పై నిందితుడు ఫోన్ లేపి మాట్లాడుచు పూజలు చేస్తా మంచి జరుగుతది చెప్పగానే అది నమ్మిన బాధితుడు పై నిందితుడు పూజారి చెప్పిన విధంగా మొదట ఒక 50,000 రూపాయలు అతని ఇచ్చిన అకౌంట్ కు డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పై నిందితుడు పూజారి ఫోన్ చేసి డబ్బులు సరిపోలేదు పూజ సగంలో ఉంది పూర్తి కావాలంటే ఇంకొక 50 వేల రూపాయలు కావాలంటే ఇతను మిగతా 50 వేలు కూడా పంపించిండు. తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి పూజ పూర్తిగా అవ్వాలి లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని ఇతనికి చెప్పటం వల్ల ఇతను ఆ మాటలు నమ్మి ఆ మాయమాటలవల్ల అనుమానం వచ్చి, ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చాను అప్పుచేసి ఇంకా తన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి అని ఆలోచించి, సైబర్ క్రైమ్కు మోసానికి గురి అయినానని పోలీసు వారు చేసే ప్రచారాన్ని గమనించి 1930 అనే నెంబర్ కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్టు చేయడం జరిగింది. దాని మీద మాకు అట్నుంచి వచ్చిన దానిమీద నారాయణ దగ్గర పిటిషన్ తీసుకొని సైబర్ క్రైమ్ ప్రకారంగా కేసు నమోదు చేసి పరిశోధన చేస్తుండగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పై నిందితున్ని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించగా జాతకాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. పై నేరస్థుని వద్ద ఉన్న సెల్ ఫోన్ సీజ్ చేసి నిందితుని వద్దనుండి బాధితుడికి లక్ష రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది, పై నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కుపంపించడం జరిగింది.
అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ జ్యోతిష్యం గాని ఇంకేదైనా యాడ్స్ దేనికి కూడా స్పందించకుండా, ఎవరికి కూడా జ్యోతిష్యాల వల్ల మంచిగా అయితదనో, ఫోన్లో పూజలు చేస్తే మంచిగా అయితదనో అని చెప్తే నమ్మొద్దు అని, అమాయకులను మోసం చేయడం కోసం ప్రయత్నించుచున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి మీకు ఎవరైనా చేస్తే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా చేర్యాల శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి*
SC రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేశాకే ఉద్యోగ ఫలితాలు విడుదల చేయాలి
వర్దన్నపేట 11మార్చ్ (నేటిదాత్రి):
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం MRPS మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ బిర్రు మహేందర్ మాదిగ మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగలు హాజరై దీక్షలు ప్రారంభించి మాట్లాడం జరిగినది తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి జరుగు అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి జస్టిస్ షమీమ్ అక్తర్ గారు ఇచ్చిన నివేదికలో ప్రకారం 15 లక్షలు ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు 32 లక్షల పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనాభా తామాషా వర్గీకరణ చేయాలని వర్గీకరణ బిల్లు పెట్టేంత వరకు ఉద్యోగ ఫలితాలను విడుదల చేయకూడదని
సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము
పట్టించుకోని మునిసిపల్ అధికారులు
సిరిసిల్ల టౌన్:(నేటిదాత్రి)
సిరిసిల్ల పట్టణంలో ఉన్న (గత ప్రభుత్వ హయంలో లో ) పెట్టిన మోనో కార్పస్ చెట్లవలన వాయు కాలుష్యము ఏర్పడుతుందందని, ఇది ఏమాత్రం మంచిది కాదని పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పెడచెవిన పెట్టారు. వాటి వలన ఏలాంటి ఇబ్బంది లేదంటే మోనో కార్పస్ మొక్కలు ప్రతి అధికారి ఛాంబర్లో టేబుల్ మీద ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు 10 చెట్లను తొలగించినారు. ( వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా). కానీ పట్టణంలో డివైడర్ మధ్యలో, పార్కులల్లో అలాగే ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అట్టి చెట్లను తొలగించగలరని బూర యాదగిరి అనే సామాజిక కార్యకర్త తెలిపారు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని, రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు,మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజాపాలన జరుగుతుంద ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీడీవో జయ శ్రీ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*
నేటి ధాత్రి ; భద్రాచలం; ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు ఆదేశాల మేరకు గిఫ్ట్ స్మైల్ ఏ లో భాగంగా మండపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగిందనితెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటిరామారావు ఆదేశాల మేరకు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ ఏ లో భాగంగా 27 మంది విద్యార్థులకు పెన్నులు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ సర్పంచ్ గనప శివ జ్యోతి మాజీ ఎంపిటిసి బస్సు స్వప్న లింగం బి మండల ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి బుస లింగం రాగి పెళ్లి కృష్ణారెడ్డి బండి భాస్కర్ నే బూరి నవీన్ ఉపాధ్యాయులు వాసుదేవారావు సజ్జనం శ్రీనివాస్ శ్రీకాంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ 1. గ్రూప్ .2. గ్రూప్ 3. ఫలితాలతో పాటుఅన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఇట్టి దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి అవునూరి రమేష్ గౌరవాధ్యక్షులు మల్యాల లచ్చన్న మండల కార్యదర్శి కొమ్మెట దేవయ్య మహంకాళి రవి సీనియర్ నాయకులు మునిగే శంకర్ మల్లారపు నరేష్ రాజశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
న్యాయపరమైన వర్గీకరణ జరగాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాయపరమైన ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాల వారందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బుచేంద్ర మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కోహీర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమంలో బుచేంద్ర మాదిగ పాల్గొని మాట్లాడారు. జస్టిస్ షమీన్అక్తర్ నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాని రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం రైతులకు అందించాలని యువజన నాయకులు నిమ్మ నిఖిల్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎండిపోయిన పంట పొలాల రైతంగానికి నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్ష కాలంలో పంటలు సాగు చేసిన రైతులకు యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందిస్తామని ప్రకటనలు చేశారని, ఇక నీళ్లు వస్తాయని ప్రచారం చేయడంతో రైతులు గంపెడంత ఆశతో పంటలు సాగుచేసుకున్నారని అన్నారు. తీరా సమయానికి ఒక్క చుక్క నీళ్ల అందించడం లేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీటి పర్వతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పిన నాయకులు ఇప్పుడు యాసంగికి నీళ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి.. * సిరిసిల్ల జిల్లాలో పోలీస్ విషాద దుర్ఘటన ప్రమాదం..
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు… లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ తోట గంగారాం(58) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ లో సోమవారం అర్ధరాత్రి డిన్నర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు లిఫ్ట్ వద్ద కొద్దిసేపు వెయిట్ చేశారు. ఏదో సౌండ్ రావడంతో లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగా కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గంగారాం చనిపోయారని నిర్ధారించారు. బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన వారు. కాగా, ఆయనకు భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు జిల్లా పోలీసు అధికారులు నివాళి తెలిపారు.
మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం.
Hospital
వరంగల్ నేటిధాత్రి.
వరంగల్ ఎంజీఎం సమీపంలోని క్యూర్ వెల్ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలలోకెళితే హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన జినుకల ప్రవళిక (25) నిండు గర్భంతో కాన్పు కోసం ఆదివారం రాత్రి 8 గంటలకు క్యుర్ వెల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. గర్భిణీకి అన్ని రకాల పరీక్షలు చేసి సోమవారం ఉదయం 9 గంటలకి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. 10 గంటలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆడపిల్ల పుట్టింది తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్థగంట గడవకముందే ప్రవళిక కు తీవ్ర రక్త స్రావం కావడం ప్రారంభమైంది. వెంటనే వైద్యులు మరల ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి సుమారు 15 యూనిట్ల రక్తము ఎక్కించడం జరిగింది. అయినను రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో వైద్యులు ప్రవళిక కు గర్భసంచి తొలగిస్తేనే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని కుటుంబ సభ్యుల చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా అంబులెన్స్ ను రప్పించి ప్రవళికను అనుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో భయాందోళనకు గురైన ప్రవళిక సోదరుడు ప్రవీణ్ మా అక్కను చెప్పకుండా ఎక్కడకు తీసుకువెళ్తున్నారని హుటాహుటిగా అంబులెన్స్ వద్దకు పరిగెత్తే క్రమంలో మెట్ల పైనుంచి జారిపడి కాలు విరగడం జరిగింది. అయినా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోకుండా ప్రవళికను హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. తీరా అక్కడికెళ్లాక ప్రవళిక మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన ప్రవళిక భర్త రాజు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్యూర్ వెల్ ఆస్పత్రి వైద్యులను అడగగా మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మాకు సరైన న్యాయం చేయాలని ఆస్పత్రి నందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరంగల్ ఏసిపి నందిరం నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఏలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు చేస్తున్నారు.
టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్..! – పరీక్షలు రాయడానికి ప్యాడ్, పెన్నుల పంపిణీ – సిరిసిల్ల నియోజక వర్గంలో నేటి నుంచి పంపిణీ – గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట అందజేత సిరిసిల్ల(నేటి ధాత్రి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజక వర్గంలో నీ సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి , ఎల్లారెడ్డి పేట, వీర్ణప ల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్ లోని ప్రభుత్వ జడ్పీ హెచ్ ఏస్ పాఠశాల లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు.ఇందుకు పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ కి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు కే టీ అర్ శుభా కాంక్షలు తెలిపారు.
హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ. 15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం బి. రేణుక కు అందించారు, దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
@ కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు
#నెక్కొండ, నేటి ధాత్రి :
పోలీసులంటే భయంతో వణికిపోయే ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ ను ఏర్పాటు చేయడంతో ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘం అని చెప్పవచ్చు. పోలీస్ సేవలో భాగంగానే 2024- 25 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో మొదటిరోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్ష కేంద్రం అక్కడ కాదని నెక్కొండ మోడల్ స్కూల్లో ఉందని ఉపాధ్యాయులను తెలుసుకొని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వం మోడల్ స్కూల్ లో పరీక్ష రాయవలసి ఉండడంతో సమయం కూడా కేవలం ఐదు నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థి ఇక పరీక్ష రాయలేనేమో అని బోరున్న విలపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న బానోతు తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని తెలుసుకుని ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ స్కూలుకు తన బైక్ పై తీసుకువెళ్లి నిర్ణీత ఐదు నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది అంతా ఓ వ్యక్తి వీడియో తీసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్న అంటూ కానిస్టేబుల్ తిరుపతి ని నెక్కొండ ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
సమస్యను పెద్దది చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ యత్నం
మూడు నెలల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం హామీ
నెంబరు డూప్లికేషన్ అంటే దొంగ ఓట్లు కాదన్న ఎన్నికల సంఘం
ఎదురుదాడికి దిగుతున్న భాజపా
గత ఎన్నికలప్పుడే నకిలీ ఓట్లపై భాజపా నేత సుబేందు ఫిర్యాదు
ఇప్పటికే అప్రతిష్ట పాలైన మమతా ప్రభుత్వం
తృణమూల్‌లో పెరుగుతున్న విభేదాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డుల (ఈపీఐసీ)నెంబర్ల డూప్లికేషన్ సమస్యను సత్వరం పరిష్కరించాలని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పదిమంది నాయకుల బృందం ఈనెల 11న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలువనుంది. ఈపీఈసీ నెంబర్ల డూప్లికేషన్ విషయంలో ఎన్నికల కమిషన్, భాజపాలు కుమ్మక్కయ్యాయంటూ ఫిబ్రవరి 27న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి గత పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు సుబేందు అధికారి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అరీజ్‌అఫ్తాబ్‌ను కలిసి రాష్ట్రంలో 16లక్షల దొంగ ఓటరు కార్డులు న్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం. అప్పుడు దీన్ని పట్టించుకోని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు నెంబర్ల డూప్లికేషన్‌పై నానా రగడ చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా యధావిధిగా ఎదురుదాడికి దిగుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటనతో పాటు పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మమతా బెనర్జీ ఈ ప్రతికూలతలనుంచి బయట పడేందుకు ఓటర్ల ఐ.డి. డూప్లికేషన్‌ను రాజకీయ అస్త్రంగా మలచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తన మేనల్లుడినుంచి చాపకింద నీరు రాజకీయాన్ని కూడా ఆమె ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోపక్క తృణమూ ల్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పకడ్బందీగా అడుగులు ముందుకేస్తుం డటంతో, తృణమూల్ కాంగ్రెస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ అక్రమ వలసలు, రోహింగ్యాల దొంగవోట్లతో అధికారంలోకి రాగలగలుతున్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో అటువంటి ఓట్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయం కూడా, మమతా బెనర్జీ ఎదురుదాడు లకు దిగేందుకు ఒక కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోయిన ఎన్నికల తర్వాత బెంగాల్‌లో జరిగిన హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐ.డి.కార్డుల గొడవ రాష్ట్రంలో రాజకీయాలను కుదిపేస్తున్నది.
పశ్చిమబెంగాల్‌లో బోగస్ ఓటర్ల బాగోతం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకే ఐ.డి. నెంబరు కలిగిన 25వేల వోటర్ కార్డులను గత నవంబర్‌లో ఎన్నికల కమిషన్ కనుగొంది. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో 294 స్థానాలుండగా, 11 నియోజకవర్గాల్లో ఇవి బయటపడ్డాయి.
గత నవంబర్ 11న రాష్ట్ర ఎన్నికల అధికారి మొత్తం 7.4కోట్ల ఓటర్ల జాబితాను విడుదల చేయగా, వీటిల్లో 16 లక్షల ఓటర్ల పేర్లను సరిచేయడమో లేక తొలగించడమో చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని దక్షిణ బోన్‌గామ్ (ఉత్తర 24`పరగణాల జిల్లా), నేపాల్ సరిహద్దులోని పానిటంకి సమీపంలోని మతిగర`నక్సల్‌బరి (డార్జిలింగ్) నియోజకవర్గాల్లో ఒకే ఐ.డి. నెంబరు కలిగిన ఓటరు కార్డులను కనుగొన్నారు. ఒకే నెంబరు కలిగిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) లేదా మల్టిపుల్ ఓటర్ ఐడీ కార్డులను ఉత్తర బోన్‌గామ్, మధ్యమ్‌గ్రామ్, రాజార్‌హట్`గోపాల్‌పూర్, కన్నింగ్ పుర్బా, బారుయ్‌పూర్ పుర్బా, పశ్చిమ కుర్సియాంగ్, సిలిగురి, ఫలకత ప్రాంతాల్లో కూడాకనిపించినట్టు ఎన్నికల అధికార్లు తెలిపారు. ఇటువంటి డూప్లికేట్ ఐ.డి.కార్డులను గుర్తించి తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఎన్నికల కమిషన్ అధికార్లు అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం ఒకే పేరుతో వున్న ఓటరు ఐ.డి. కార్డులను ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశీలించి వీటిల్లో నకిలీలను తొలగించే ప్రక్రియను కమిషన్ చేపట్టింది. ఒకే ఐ.డి. నెంబరు పునరావృ త్తం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని అధికార్లు చెబతున్నారు. మరి ఎందుకు ఇట్లా వచ్చాయనేది తేలాల్సివుంది. ఇప్పటికైతే ఈ నియోజకవర్గాల్లో ఇటువంటి డూప్లికేట్ కార్డులను కనుగొన్నప్పటికీ, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వుండకూడదనేం లేదని ఎన్నికల అధికార్లు అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 11న విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో 7.4కోట్ల ఓటర్లుండగా, 6.2లక్షల కొత్త పేర్లు జాబితాల్లో చేర్చగా, 4.5లక్షల పేర్లు తొలగించారు, 11.2లక్షల పేర్లలో తప్పులు సరిదిద్దారు.
ఇవి బోగస్ ఓట్లు కావు
రెండు కార్డులకు ఒకే ఈపీసీ నెంబరు వుండటం బోగస్ వోట్ల కిందికి రాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు అందరు ఓటర్లకు ప్రత్యేక ఈపీఐసీ నెంబర్లను కేటాయించడం ద్వా రా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఓటర్ల డేటాబేస్‌ను డి జిటలైజేషన్ చేయడానికి ముందు మ్యాన్యువల్‌గా వికేంద్రీకరణ పద్ధతిలో ఓటర్ల నమోదు చేసిన ప్పుడు జరిగిందని, దీన్ని మరో మూడు నెలల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇక ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా రచ్చరచ్చ చేసే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశానికి విపరీతమైన రాజకీయ కోణాన్ని ఆపాదిస్తూ, భాజపా, ఎన్నికల అధికార్లు కుమ్మక్కయి ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్ వీధులకెక్కడం తాజా పరిణామం. ‘గుజరాత్, హ ర్యానాల్లో కూడా పశ్చిమబెంగాల్‌లో మాదిరిగానే డూప్లికేట్ ఈపీఐసీ నెంబర్లు ఇ చ్చారు. ఆవిధంగా ఆన్‌లైన్‌లో బోగస్ ఓటర్లను నమోదు చేశారంటూ’ ఆరోపణలకు దిగారు. మహారాష్ట్ర, ఢల్లీిల్లో ప్రతిపక్ష పార్టీలు వీటిని గుర్తించలేదు. కానీ మేం గుర్తించామంటూ ఆమె గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం మళ్లీ స్పందించింది. ‘‘ఈపీఐసీ నెంబర్లు ఒకటే ఉన్నప్పటికీ, పోలింగ్ బూత్, నియోజకవర్గం తదితర వివరాలు భిన్నంగా వుంటాయి కనుక ఓటర్లు తమకు కేటాయించిన బూత్‌ల్లో నిరభ్యంతరంగా ఓటు చేయవచ్చు’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదిలావుండగా బీజేపీ పశ్చిమ బెంగాల్ కో`ఇన్‌చార్జ్ మాలవ్యా, త్రిణమూల్‌పై ఎ దురుదాడికి ది గారు. మమతా బెనర్జీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కేవలం ఓటర్లను తప్పు దోవ పట్టించేందుకే ఆమె రాజకీయం చేస్తునారంటూ ఆరోపించారు. అంతేకాదు మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుకోసం అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చినవారు మరియు రోహింగ్యాలకు నకిలీ ఓటర్ ఐ.డి.కార్డులు ఇప్పించారని అటువంటి దొంగ ఓటర్ల పేర్లను తొలగించాలని మాలవ్యా ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు భాషాపరమైన మైనారిటీలు, మతువా వర్గానికి చెందిన హిందూ వలసదార్ల ఓట్లను తొలగించాలని చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలనువమ్ము చేయాలని కూడా కమిషన్‌ను ఆయన కోరారు. బంగ్లాదేశ్‌లో నిరంతరం జరుగుతున్న దాడులు, హింసాకాండ నేపథ్యంలో అక్కడినుంచి పారిపోయిన మతువా వర్గానికి చెందిన హిందు వులు బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
తృణమూల్‌లో విభేదాలు
ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఫిబ్రవరి 27న పార్టీ కేంద్రకార్యాలయంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల జాబితాను సమీ క్షించడం ఈ సమావేశం ప్రధాన అజెండా. అయితే ఈ సమావేశానికి పార్టీ అఖిలభారత ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ గైర్హాజరు కావడం పార్టీలో అంతర్గత రాజకీయ విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ఈ సమీక్ష ద్వారా ఓటర్ల లిస్ట్‌లో అవకతవకలు జరిగాయని నిర్ణయించి ప్రజల్లోకి వెళ్లాలన్నది వ్యూహం. విచిత్రమేమంటే ఈ కమిటీ పేర్లలో మొదటి స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభ్రతా బక్షి పేరుండగా, రెండో స్థానంలో మాత్రమే తనపేరుండటం అభిషేక్ బెనర్జీ కి నుకకు కారణమని ఒక్కసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఇది పెద్ద చర్చనీయాంశం కావడంతో, మమతా బెనర్జీ తెలివిగా, ఇటీవల నేతాజీ ఇండోర్ స్టేడి యంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి అభిషేక్ బెనర్జీ చేసిన ప్రసంగాన్ని బహిరంగంగా ప్రశం సించడం ద్వారా ఊహాగాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు. పార్టీలో కొందరు ఈ తాజా పరిణామాలను తక్కువ చేసి చూపడానికి యత్నిస్తున్నారు. కానీ ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులన్నీ టీఎంసీ కేంద్రకార్యాలయంలోనే జరగాలని మమతా బెజర్జీ కచ్చితమైన ఆదేశాలి చ్చిన నేపథ్యంలో, పార్టీలో రాజకీయాల గతిశీలతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీలోని మరొక వర్గం పేర్కొంటున్నది. అయితే అభిషేక్ అనుకూల వర్గాలు మాత్రం ఆయన సొంత ని యోజకవర్గమైన డైమండ్ హార్బర్‌లో నిర్వహిస్తున్న ‘శేబాష్‌రే’ పేరిట నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలు చివరి దశలో వుండటమే ఆయన గైర్హాజరుకు కారణమని సమర్ధిస్తున్నాయి. ఫిబ్రవరి 27న కోల్‌కతాలో ఓటర్ల జాబితాపై కీలక సమావేశమున్నప్పటికీ అభిషేక్ బెనర్జీ, డైమండ్ హార్బర్ లో నిర్వహిస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గనడం గమనార్హం.
వర్చువల్ సమావేశానికి యత్నాలు
ఇదిలావుండగా పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర కమిటీలు, జిలా అధ్యక్షులు, సంస్థాగత నాయకులతో వర్చువల్ సమావేశాన్ని మార్చి 15న నిర్వహించడానికి డైమండ్ హార్బర్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త పద్ధతిని తీసుకురావడంతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీన్ని రాష్ట్రంలోని దిగువస్థాయి నాయకులు తమకు సౌకర్యవంతమైన పద్ధతిగా భావించే వీలు ఏర్పడిరది. మరి మమతా బెనర్జీ ఇటువంటి సమావేశాలను నిర్వహించినప్పుడు ఆయా నాయకులు వ్యక్తిగతంగా హాజరుకావడం తప్పనిసరి! ఈ నేపథ్యంలో పార్టీలో రెండు కేంద్రస్థానాలు కొనసాతున్నాయన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కాగా ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సమీక్షా బాధ్యతలను వివిధ నాయకులకు అప్పగించడం మరో పరిణామం. ఈ వికేంద్రీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షీ దక్షిణ కోల్‌కతాకు, అభిషేక్ బెజర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలో సమీక్షకు బాధ్యత వహి స్తారు. పార్టీలో క్రమంగా కేంద్రీకృత వ్యవహారశైలి, వికేంద్రీకృతంగా మారుతున్నదనడానికి ఇది ఉదాహరణగా కొందరు పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుబ్రతా బక్షీ నేతృత్వంలోని కమిటీ బృందం రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని కలిసి, ఓటర్లకు ప్రత్యేక ఐ.డి. ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజకీయ పార్టీలు నియమించే బూత్ లెవెల్ ఆఫీసర్ల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇవ్వడం గమనార్హం.
`కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నాయకత్వం మరొకటి చట్ట సభకు చేరింది.
……………
`కంచు కంఠం దాసోజు!
`పాయింట్ లేవదీస్తే ప్రత్యర్థులకు మాటరాదు.
`తెలంగాణ ఉద్యమ కారుడు.
`గతంలోనే దక్కాల్సిన అవకాశం.
`లేట్‌గా వచ్చినా లెటెస్ట్ గానే వుంది.
`ఎట్టకేలకు దాసోజును ఎమ్మెల్సీ వరించింది.
రాజకీయాలలో అవకాశాలు వెత్తుక్కుంటూ కొంత మందికి వస్తాయి. కొంత మందికి జీవితాంతం ఎదురుచూసినా రావు. రాజకీయాల్లో ఎంత కష్టపడినా, ఆవ గింజంత అదృష్టంకూడా వుండాలని అంటారు. అదే నిజమని కూడా చాలా సార్లు రుజువైంది. ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో అలాంటి సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్, ఇటు బిఆర్‌ఎస్ ఎంపిక చేసిన అభ్యర్ధులను చూస్తే అర్ధమౌతుంది. ఎంత కష్టపడినా, ఎన్ని త్యాగాలు చేసినా కొన్ని సార్లు వారికి పదవులు చాలా అలస్యమౌతుంటాయి. ప్రజలనుంచి కూడా వారికి సానుభూతి ఎంత వున్నా, సరే కొన్ని సార్లు అవకాశాలు దక్కవు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా వారి పోరాటం నిజంగానే స్పూర్తిదాయమే..కాని అలాంటి వారికి పదవులు అందకపోతే మిగిలేది నైరాశ్యమే..ఓపికకు కూడా ఒక హద్దు వుంటుంది. ఏడాదో, రెండేళ్లో కాదు. దశాబ్దాల పాటు ప్రజా సేవ, రాజకీయ సేవలు చేసిన వారికి పదవులు దక్కకపోతే రాజకీయాలలో కొనసాగడం అంత సులువు కాదు. అయినా పదవులో,తమ పరిశ్రమో చూద్దామని కంకణం కట్టుకున్నవారికి మాత్రం ఎప్పటికైనా మళ్లీ గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈసారి ఎమ్మెల్సీ పదవులు పంపకమే నిదర్శనమని చెప్పకతప్పదు. ముందుగా తెలంగాణ ఉద్యమనాయకురాలు, సినీ నటి విజయశాంతి. తెలంగాణ సమాజమే కాదు, దేశ వ్యాప్తంగా వున్న ఆమె అభిమానులు రాములమ్మ అంటూ గొప్పగా పిలుచుకుంటారు. సినీ కేరిర్ ఉచ్చదశలో వున్నప్పుడు ఎవరూ వదులుకోవాలని అనుకోరు. కాని దేశంలోనే ఏ మహిళా నటి తీసుకోనంత రెమ్యునరేషన్‌తో సినిమాల్లో విజయశాంతి నటించారు. జాతీయ స్దాయిలో ఆమె ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. సినిమా అంటే హీరోయిజం. అలాంటి దశలో హీరో లేకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి తీసేంత ఇమేజ్ వున్న నటి విజయశాంతి. అలాంటి విజయశాంతి తెలంగాణ కోసం తన జీవితం త్యాగం చేశారు. తన కేరిర్ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన కాదనుకున్నారు. నా తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించే కాలం రావాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాలనుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఆమె తల్లి తెలంగాణ అనే పార్టీని స్దాపించి తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర్ర ఆకాంక్షను బలపర్చారు. మరింతగా తెలంగాణలో చైతన్యం నింపారు. తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేశారు. బిఆర్‌ఎస్ అప్పటి టిఆర్‌ఎస్‌కు ధీటుగా తెలంగాణ వాదం వినిపించారు. కేసిఆర్ కోరిక మేరకు ఉద్యమ సంస్దలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే తెలంగాణ ఉద్యమానికి మరింత బలం పెరుగుతుందని నమ్మారు. కేసిఆర్ మాటను మన్నించారు. తల్లి తెలంగాణ పార్టీని భేషరుతుగా టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆమె మెదక్ నుంచి పోటీచేసి గెలిచారు. పార్లమెంటులో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇక నిరంతరం ఆమె ఇటు గల్లీలోనూ, అటు డిల్లీలోనూ తెలంగాణ గళం వినిపించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. అయితే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చినా, తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవడాన్ని ఆమె పార్లమెంటు సాక్షిగా నిలదీశారు. నాలుగేళ్లపాటు ఆమె నిరంతరం పార్లమెంటులో తన గళం వినిపించారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్ నుంచి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచారు. ఒకరు కేసిఆర్, మరొకరు విజయశాంతి. కేసిఆర్ పార్లమెంటు సమావేశాలకు హజరు కాకపోయినా, ఆమె మాత్రం పార్లమెంటు వేదికగా సభ జరిగినన్ని రోజులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలియజేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంటు బైట నిరసన చేస్తే, విజయశాంతి ఏకంగా స్వీకర్ పోడియం ముందే నిరసన తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. పార్లమెంటు జరిగినన్ని రోజులు, సభ సాగినంత సమయం ఆమె అయితే వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేసేవారు. లేకుంటే తన సీట వద్దనే నిలబడి ఉద్యమ ఆకాంక్షను నినాదాల ద్వారా తెలియజేసేవారు. 2014కు ముందు ఆమెను కేసిఆర్ పక్కన పెట్టే రాజకీయం చేశారు. తెలంగాణ వస్తే విజయశాంతికి క్రెడిట్ పోవడం ఆయన ఇష్టం లేదు. అందుకే ఆమెను పార్టీలో ప్రాధాన్యత తగ్గిసూ వచ్చారు. అయినా ఆమె ఉక్కు మహిళ. పదవుల కోసం ఆమె తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ వస్తే చాలనుకున్నారు. తెలంగాణ సాధనలో ముందు వరసలో వున్నారు. తెలంగాణ రావడంలో తన పాత్రను చరిత్రలో లిఖించుకున్నారు. తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో కూడా తగిన ప్రాదాన్యత లభించలేదు. తర్వాత బిజేపిలోకి వెళ్లారు. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కనిపంచలేదు. తిరిగి గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంటుగా పదవిని కూడా పొందారు. కాని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె సహాకారం ఎవరూ కోరకపోయినా, తన కర్తవ్యాన్ని ఆమె నెరవేర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాని ఆమె పదవులకోసం ఏనాడు ప్రయత్నం చేయలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే పార్టీ అధిష్టానం హమీ ఇచ్చింది. ఆ హమీని పార్టీ నిలబెట్టుకున్నది. ఏది ఏమైనా రాములమ్మ లాంటి చైతన్య కిరణం కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఆ పార్టీ అధికారంలోకి రావడంలో రాములమ్మ ప్రయత్నం కూడా వుంది. అందుకే పార్టీ ఆమెకు ప్రాధాన్యత కల్పించింది.
ఇక అద్దంకి దయాకర్. ఆయనకు పదవి రాకపోతే తెలంగాణ సమాజమే తిరగబడేంత పరిస్దితి కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ కోసం ఆయన చేసిన సేవను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే వుంది. అడుగడుగునా ఆయనకు అన్యాయం జరుగుతుంటే సానుభూతి పెరుగుతూనే వుంది. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయకర్ కీలకభూమిక పోషించారు. అటు మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడుగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమానికి అంకితయ్యారు. జేఏసి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. జేఏసి సమావేశాలకు ఆ సమయంలో హజరు కావాలంటే కొంత మంది ముందూ వెనకు ఆలోచించేవారు. కాని జేఏసి ఏర్పాటు చేసే ప్రతి సమావేశానికి, సభలకు ఆయన క్రమం తప్పకుండా హజరౌతూ వచ్చేవారు. తెలంగాణ గళం వినిపించేవారు. తెలంగాణ వ్యతిరేకులను తన వాక్చాతుర్యంతో చీల్చి చెండాడేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం వల్ల తెలంగాణ మీద పూర్తి పట్టు వుంది. అవగాహన వుంది. గత చరిత్ర తెలుసు. వర్తమానంలో తెలంగాణ సమజానికి ఏం కావాలో తెలుసు. ప్రతి అంశంపై సునిశితన జ్ఞానం వుంది. ఆయా సమస్యల మీద పూర్తిగా పట్టు వుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలా మోసపోయారు. ఎంత మోసపోయారు. మోసపోడానికి ప్రేరేపించిన అంశాలపై ఆయన అనర్గళంగా లెక్కలతో సహా చెప్పడంతో దిట్ట. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా ఉద్యమ సమయంలో పేరొచ్చింది. అంత గౌరవం కూడా దక్కింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. నిజానికి ఆయన ఆ సమయంలో బిఆర్‌ఎస్‌లో చేరితే ఇప్పటికే అనేక రాజకీయ అవకాశాలు,పదవులు అందుకునేవారేమో! కాని కష్టపడడమే ఆయన తత్వం. ఏటికి ఎదురీడడం ఆయన నైజం. ఏదైనా సరే, కష్టపడిసాధించున్నదానిలో వుండే ఆత్మ సంతృప్తి మరెందులోనూ వుండదని నమ్ముతారు. ఎందుకంటే అద్దంకిదయకర్‌కు పదవీ కాంక్ష అప్పుడు లేదు. ఇప్పుడూ లేదు. కాని సమాజ దిశా నిర్ధేకులైన కొంత మందికి పదవులు అవసరం. సామాన్య వ్యక్తిగానే సమాజాన్ని ఎంతో చైతన్య పర్చిన అద్దంకి దయాకర్ లాంటి వారు చట్టసభల్లో వుంటే ఆ సమాజానికే ఎంతో మేలు కలుగుతుంది. అద్దంకి దయాకర్ అంటే ఒక ప్రశ్న. స్పందించే గళం. ఎదిరించే నైజం. పాలకులను నిలదీసే గుణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు చట్టసభలో వుంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి ఆయన 2014లోనే ఎమ్మెల్యే కావాలి. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలుపు తీరం చేరుకుంటున్న దశలో ఫలిత ంత తారు మారైంది. తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆయనను లాక్కోవాలిన బిఆర్‌ఎస్ అనేక సార్లు ప్రయత్నం చేసింది. కాని అద్దంకి దయకర్ గాలి వాటం నాయకుడు కాదు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఎదుర్కొన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికల్లో చిరునవ్వుతో సీటు త్యాగం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు కృషిచేశారు. ఆఖరు దశదాకా టికెట్ అద్దంకికే అని ప్రచారం జరిగినా, ఆఖరు నిమిషంలో ఆయనకు టికెట్ ద్కక్కపోయినా ఇబ్బంది పడలేదు. పార్టీ మీద అలగలేదు. నిరసన తెలియజేయలేదు. పైగా తెలంగాణ మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీని గెలిపించడంలో కీలకభూమిక పోషించారు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. టికెట్ కన్‌ఫర్మ్ అనుకునే క్షణంలో మళ్లీ నిరాశే ఎదురైంది. అయినా ఆయన కలత చెందలేదు. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాడు. తనకు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. ఆ కృతజ్ఞత వుంది. తనకు పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా పక్కకు జరిగేదిలేదు. పార్టీ మారే ప్రసక్తిలేదని పలుమార్లు చెప్పారు. ఆయనను అడుగడుగునా ఎవరు అడ్డుకుంటున్నారో ఆయనకుతెలుసు. ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసు. అయినా ఆయన ఏనాడు సహనం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. రాసి పెట్టి వుంటే అదే వస్తుందని నమ్మిన నాయకుడు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించేలేదు. ప్రజలు కూడా సానుభూతితో కోరుకుంటున్నప్పుడు పార్టీ సహకరించలేదు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి అద్దంకి దయకర్. అంతే కాకుండా ఒక్కసారి మాట ఇస్తే తప్పని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సమయం చూసి అద్దంకికి పదవి ఇప్పిస్తానని చెప్పారు. చెప్పినట్లే పదవి ఇప్పించారు.
ఇక బిఆర్‌ఎస్‌లో 2008 నుంచి బిఆర్‌ఎస్ పార్టీకి సేవలు చేస్తున్న నాయకుడు దాసోజు శ్రవణ్. మేదావి వర్గంలో ఒకడుగా పేరుపొందిన దాసోజు శ్రవణ్ తన రాజకీయాన్ని ప్రజారాజ్యాంతో మొదలు పెట్టారు. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. చిరంజీవి ముందు చెప్పిన సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆ పార్టీలో చేరారు. అయితే 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రనినాదం అందుకున్నారు. ఆ సమయంలో దాసోజు శ్రవణ్ పార్టీని వదులుకున్నారు. అయితే ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సందర్భంలో శ్రవణ్‌కు పదవి కల్పిస్తానని చిరంజీవి మాటిచ్చారు. దాసోజు రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని చిరంజీవి చెప్పారు. కాని శ్రవణ్‌కు నచ్చలేదు. అయితే ఇక్కడ మరో విషయం వుంది. దాసోజు ప్రజారాజ్యంపార్టీలో చేరినప్పటికీ ఆయన మనసంతా కేసిఆర్ చుట్టే వుంది. కేసిఆర్ ప్రసంగాలు వింటూ ప్రభావితమయ్యారు. ఎలాగైనా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి వున్నారు. కాకపోతే చిరంజీవి సామాజిక తెలంగాణ నినాదాన్ని శ్రవణ్ నమ్మారు. అందుకే ఆ పార్టీలో చేరారు. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాడో అప్పుడే ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కేసిఆర్‌కు ఎంతో సన్నిహితులయ్యారు. ఎక్కెగడప, దిగే గడప అన్నట్లు కేసిఆర్ డల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజు ఆయనతో వుండేవారు. ఇలా కేసిఆర్‌కు అంత్యంత సన్నిహితులలో ఒకడుగా మారారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీతరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేయాలని అనుకున్నారు. కాని ఆయనకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక శ్రవణ్‌ను దూరం పెడుతూ వచ్చారు. రేవంత్‌రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా ఆయన బిజేపిలో చేరారు. అక్కడి రాజకీయం ఆయనకు నచ్చలేదు. దాంతో తిరిగి బిఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. 2023లోనే ఆయనకు కేసిఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాని అప్పటి గవర్నర్ తమిళ సై ఆ ఫైలు మీద సంకతం చేయకపోవడంతో ఆ ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోయింది. అప్పడు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి వాయిదా పడిరది. ఆ సమయంలో అందాల్సిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బిఆర్‌ఎస్ ఒకరిని ఎంపిక చేసే అవకాశం వచ్చింది. ఆ ఒక్కటి దాసోజు శ్రవన్‌ను వరించింది. నిజానికి 2014 వరకు కేసిఆర్‌తో వున్న దాసోజు ఎన్నికల ముందు పార్టీని వీడడం ఆయన చేసిన తొందరపాటు చర్య. ఎందుకంటే దాసోజు కన్నాముందు నుంచి బిఆర్‌ఎస్‌లో వున్న వారున్నారు. దాసోజుకన్నా ముందు నుంచి ఉద్యమం చేస్తున్నవారు అనేక మంది వున్నారు. 2001 నుంచి కేసిఆర్‌తో కొనసాగుతున్న వాళ్లున్నారు. అయినా దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరినప్పటినుంచి కేసిఆర్ ఎంతో ప్రాదాన్యత కల్పించారు. ఆ నాడు దాసోజు తొందరపడకపోతే ఇప్పటికే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. అటూ ఇటు తిరిగి వచ్చిన దాసోజుకు సత్వర న్యాయమే జరిగింది. ఎందుకంటే ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వారు పదవులు రాకుండా బిఆర్‌ఎస్‌లో దాసోజు కన్నా ముందునుంచే వున్నారు. అయినా దాసోజు అదృష్టవంతుడే అని చెప్పాలి. బిఆర్‌ఎస్ గొంతు వినిపించడంతో అందరికన్నా దాసోజు వుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే రాజకీయంగా ఎదుర్కొవడంలో, పార్టీకి అండగా వుండడంలో దాసోజు ముందుంటారని చెప్పడంలో అతిశయోక్తికాదు. ఆల్‌దిబెస్ట్.
మహబూబ్ నగర్ విద్యా నిధికి రూ.10 లక్షల భారీ విరాళాన్ని మై హోం గ్రూప్స్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి కలెక్టర్ చాంబర్ లో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ విద్యా నిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యా నిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా సంస్థలో అత్యవసరమైన మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క విద్యా నిధి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు హన్వాడ మండలంలోని వేపూర్ నుంచి, అలాగే మహబూబ్ నగర్ మండలం లోని మన్యం కొండ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వరకు విద్యార్థులను తీసుకొచ్చి తిరిగి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
వేడుకలలో పాల్గొన్న మండల విద్యాధికారి కాలేరు యాదగిరి.
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
Happy Self-Government Day..
కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మారి తమకు బోధించే గురువుల మాదిరిగానే విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రార్థనా సమయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారిగా గట్ల మనీష్, ఎంఈఓ గా బొల్లు రిత్విక్ సాయి, ప్రధానోపాధ్యాయులుగా తుమ్మనపల్లి సుమాంజలి , ఉపాధ్యాయులుగా రావుల అక్షయ, భూక్యా స్పందన , ధరావత్ ప్రియాంక ,నాగవల్లి వర్షిని, గట్ల మనీషా ,గాజుగాని నిహారిక , లకావత్ ఇందు, బట్టి దివ్య , గుతుప స్వాతి వరుణ్ సిద్ధార్థ్ ,జాటోత్ విజయ్ కుమార్ ,అటెండర్ గా తూర్పాటి ఈశ్వర్ లు పాల్గొన్నారు. భోజన విరామానంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాతలని , విద్యార్థులు చదువుల పట్ల మక్కువ చూపించి చదువులో రాణించాలని, తద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు హేమలతను ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుండు సురేందర్ ,వీసం నరసయ్య, వెలమాల భాస్కర్ , అప్పల నాగరాజులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.