ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య…

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం Air India flight accident)లో మృతుల సంఖ్య పెరిగింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 279కి చేరింది. గాయపడినవారు (Victims) సివిల్ హాస్పిటల్‌ (Civil Hospital)లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
డీఎన్ఏ పరీక్షలు..

మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆదివారం విమాన ప్రమాద ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అధికారులు అప్పగిస్తున్నారు. కాగా చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా వారు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.

ఉన్నతస్థాయి కమిటి…

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.

 

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము.

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము

పట్టించుకోని మునిసిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిదాత్రి)

సిరిసిల్ల పట్టణంలో ఉన్న (గత ప్రభుత్వ హయంలో లో ) పెట్టిన మోనో కార్పస్ చెట్లవలన వాయు కాలుష్యము ఏర్పడుతుందందని, ఇది ఏమాత్రం మంచిది కాదని పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పెడచెవిన పెట్టారు.
వాటి వలన ఏలాంటి ఇబ్బంది లేదంటే మోనో కార్పస్ మొక్కలు ప్రతి అధికారి ఛాంబర్లో టేబుల్ మీద ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు 10 చెట్లను తొలగించినారు. ( వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా).
కానీ పట్టణంలో డివైడర్ మధ్యలో, పార్కులల్లో అలాగే ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అట్టి చెట్లను తొలగించగలరని బూర యాదగిరి అనే సామాజిక కార్యకర్త తెలిపారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version