కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=1

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

“జహీరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T132220.018-1.wav?_=2

 

కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్
మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి చంద్రశేఖర్ ను గౌడ సంఘం నేతల భేటీ…

మాజీ మంత్రివర్యులు ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా గౌడ సంఘం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా
గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, గౌడ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,మురళి కృష్ణ గౌడ్,విట్ఠల్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రంగయ్య గౌడ్, లక్ష్మయ్య ,వాసు గౌడ్,మధు శేఖర్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్ , శేఖర్ గౌడ్, నందు గౌడ్, కంది శ్రీనివాస్ గౌడ్, బక్కయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు..

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

“వర్ధన్నపేటలో ఓటర్ ముసాయిదా కార్యక్రమం”

ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

వర్దన్నపేట (నేటిధాత్రి )

 

వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండలంలోని కట్రీ యాల గ్రామములో, పంచాయతీ కార్యాలయా లో ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆహ్వానం మేరకు, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు సూచనల మేరకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య హాజరై ఓటర్ ముసాయిదా కార్యక్రమంలో పాల్గొని,ఓటర్ ముసాయిదా ను, పంచాయతీ కార్యదర్శి తో కలిసి ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…

 

వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ లిస్టును క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బూతు కమిటీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ఈ నెల 30 వ, తేదీలోప ల పరిశీలించాలని ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు పిలుపు నిస్తున్నాం.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జ రవీందర్ రెడ్డి,ఎండి అక్బర్,నాంపెల్లి రవీందర్,తీగల సునీత గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలికట్టే చిన్న రాజు లు పాల్గొన్నారు.

కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ…

కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తమ విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖతోపాటు మున్సిపల్ కార్మికులకు టిఫిన్ వాటర్, బాటిల్ పంపిణీ చేశారు. గురువారం పట్టణంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందించారు.

కొత్త రేషన్ కార్డులను పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T135201.153.wav?_=3

 

కొత్త రేషన్ కార్డులను పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T114241.463.wav?_=4

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్ధన్నపేట నియోజక వర్గం , వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబా ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజీరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఎలికట్టే చిన్న రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యూత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో. రోగులను ప్రజలను అన్నదాన ప్యాకెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-57-2.wav?_=5

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవరణలో చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నెంబర్ మల్లన్న పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాజీ వార్డ్ మెంబర్ ఆన్సర్ సీనియర్ నాయకులు ల్యాఖత్ అలీ రాజేందర్ సింగ్ అశ్విరఫ్ అలీ రజాక్ రవి కృష్ణ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు,

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-3.wav?_=6

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి లో ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు చీర్ల చందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో కలిసి నిర్వహించారు
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవల ను కొనియాడారు కార్యకర్తలు దివంగత మాజీ ప్రధాని కి నివాళులర్పిం చి పూలమాలలు వేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సబ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఐ ఎన్ టి యు సి వర్క్స్ బోర్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-8.wav?_=7

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా

◆:- ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆:- డా౹౹ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ లోని యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నూతన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆర్షద్ అలీ,కాంగ్రెస్ నాయకులు మంకలి శభాష్, హుగ్గేలి రాములు,ఖాజా,శుక్లవర్ధన్ రెడ్డి, షాకిర్ అలీ, గౌసోద్దీన్, మొయిజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-3.wav?_=8

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి నివాసంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.సిద్దం ఉజ్వల్రెడ్డి వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T130130.548.wav?_=9

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలో రైతు వేదిక ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొనగా
చర్ల మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో చర్ల ఎండిఓ ఈదయ్య ఎంపివో వలీ హజ్రత్ సివిల్ సప్లయ్ డిటి రాజులు ఏపిఎం లక్ష్మి దుర్గ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి గుండెపూడి భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు ఇందల రమేష్ బాబు పొట్రూ బ్రహ్మానంద రెడ్డి ఈర్ప వసంత్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని

పరకాల నేటిధాత్రి
హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్ దిలీప్ రాజ్ ని హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతే ఈ దేశానికి వెన్నుముక అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికలను శాసనసభలో ఆమోదించ చేయడం చరిత్ర ఆత్మకు,సాహసోపేతం అని అన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల రేవంత్ రెడ్డికి ఎంమ్మార్పిఎస్ మందకృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో జరగబోయే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,బొచ్చు అనిల్, పేరుక చరణ్,బొచ్చు రాజు, బొచ్చు నాగరాజు,కోడపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version