మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు
జిల్లా కమిటీ
భూపాలపల్లి నేటిధాత్రి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3 వ తేదీన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర సమాచార కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించినట్లు టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సామల శ్రీనివాస్ లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3 వ తేదీన టీయూడబ్ల్యూజే(ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నా లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏట వీరభద్ర స్వామి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
