సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.. దుల్కర్ సల్మాన్! ఎందుకంటే

దుల్క‌ర్ స‌ల్మాన్ ఆదివారం ఉద‌యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ప్ర‌ముఖ మ‌ల‌యాళ‌, తెలుగు న‌టుడు, సీతారామం ఫేం దుల్క‌ర్ స‌ల్మాన్ (DulQuer Salmaan) ఆదివారం ఉద‌యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy)ని ఆయ‌న జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయ‌న వెంట సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వినీ ద‌త్ కుమార్తె నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt), ద‌స‌రా, ప్యార‌డైజ్ చిత్రాల నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి (Cherukuri Sudhakar) ఉన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ దుల్క‌ర్కు శాలువా క‌ప్పి స‌న్మానించారు. అయితే దుల్క‌ర్ సీఎం రేవంత్ రెడ్డిని క‌ల‌వ‌డం వెన‌క ప్ర‌త్యేక కార‌ణాలేవి బ‌య‌ట‌కు తెలియ‌లేదు.

అయితే.. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డ్స్ (Gaddar Awards)లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సీతారామం (Sita Ramam), మ‌హా న‌టి, ల‌క్కీ భాస్క‌ర్ (Lucky Baskhar ) మూడు చిత్రాలు అవార్డులు ద‌క్కించుకోవ‌డంతో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్‌(DulQuer Salmaan)కు స్పెష‌ల్ జ్యూరీ అవార్డు ప్ర‌క‌టించ‌డం విశేషం. కాగా అవార్డుల ప్ర‌ధానోత్స‌వ స‌మ‌యంలో దుల్క‌ర్ హ‌జ‌రు కాన‌దున ఇప్పుడు ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకుని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.

గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని

పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్…

 

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి నువ్వు సిద్ధమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు, మీ క్యాబినెట్ సహాచరులు ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారన్నారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని వివరించారు. వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం తాము పని చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు.

పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు…

 

పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025)లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలో జరిగింది. ఇది ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మధ్య ప్రస్తుతం వాడీవేడి చర్చ కొనసాగుతోంది.
పట్నాయక్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

 

Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Pawan Kalyan congratulates Kamal Haasan: కెరీర్‌లో లెక్కకు మిక్కిలి వైవిధ్యమైన పాత్రలు ధరించి సినీ అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీరంగంలో దశాబ్దాల కృషి అనంతరం ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా ఆయనకు ఆహ్వానం లభించింది. పదుల కొద్దీ రాష్ట్ర, జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కమల్‌కు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డు-2025 కమిటీ సభ్యుడిగా పద్మభూషణ్ కమలహాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. ఆరు దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనా జీవితాన్ని గడిపిన కమల్ హాసన్ గారు కేవలం నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటుడిగా చిత్రనిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన అసాధారణమైన పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజమైన కళాత్మక నిపుణుడు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాకు ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను.’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం

మంచిర్యాల నేటి ధాత్రి:

తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన తుమ్మన్ పల్లి బిఆర్ఎస్ నాయకులు
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు తుమ్మన పల్లి గ్రామానికి చెందిన పక్కిరి బాబు షా గారికి 43500. చెక్కు అందజేయడం జరిగింది.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి యువ నాయకులు షేక్ సోహైల్ రమేష్ మోసిన్ ఆశప్ప తదిపరులు పాల్గొన్నారు.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

కల్వకుర్తి నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ & 33/11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , AICC/CWC చల్లా వంశీ చంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి స్వాగతం పలుకుతున్న సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పుల లక్పతి నాయక్ శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

◆ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు
వేదమంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు. హుగ్గెల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వగురు బసవేశ్వరుని స్పూర్తి, ఆలోచన విధానంతో బసవేశ్వరుని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేసి చూపెట్టిందని తెలియజేశారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగడుగున మహాత్మా జ్యోతి రావు పూలే, మహాత్మా గాంధీ, బసవేశ్వరుడు స్ఫూర్తితో
సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయన ఆక్షించారని ఆయన సూచనలతోనే తెలంగాణలో కుల గణన చేసి చూపించామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా లింగాయత్ సమాజా నాయకులు గురువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ..

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ.. ఉపాధి అవకాశాలతో జహీరాబాద్లో కొత్త శకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగం: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ , సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ ప్రాజెక్టు వెళ్లే రోడ్, ఝరాసంగం మండలం మార్చినూరులోని కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా సభ వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ , వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం చే నిమ్జ్ రోడ్డు ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) రహదారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2023 నుంచి 2025 వరకు రూ.100 కోట్లతో నిమ్జ్ కు ప్రత్యేక రహదారి నిర్మించారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు 9 కిలోమీటర్లు, వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెనలు నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి 131 కేవీ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలనుఅమర్చారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం నిమ్జ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సభాస్థలి నుంచే రైల్వే ఓవర్ బ్రిడ్జి

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలం నుంచే ప్రారంభించనున్నారు. మరో రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఝరాసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో రూ. 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మరో అరుదైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. లింగాయత్ సమాజ్ సృష్టికర్త విశ్వ గురువుగా కీర్తి కిరీటాన్ని సంపాదించిన అశ్వరుడా బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా సభ వేదిక ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

◆ వంద కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి.

◆ తీరనున్న వాహనదారుల వెయిటింగ్ కష్టాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టణ పురపాలక సంఘ పరిధిలో ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్… రయ్.. మంటూ పరుగులు పెట్ట నున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి న్యాల్కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మిం చిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఈనెల 23న ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారం భించేందుకు వీలుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, ఇందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు.

ఏడేళ్లకు మోక్షం

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన ఏడు సంవత్సరాలకు పూర్తి చేశారు. ప్రయాణికుల కష్టా లను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నిధులు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణం పనులు 2018 ఆగస్టు 30న చేప ట్టారు. ఆర్అండ్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణం పనులు
చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. 20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికిం ద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. పట్టణ ప్రజలతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణి కులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి.

బ్రిడ్జిపై ఎల్ ఈడీ లైట్ల వెలుగులు

రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎస్ఈడీ విద్యుత్ దీపాలను బిగించారు. కిలో మీటరు పొడువునా బిగించిన లైట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డుపై కూడా వెలుతురు ఉండేలా బిగిం చారు. బ్రిడ్జికిరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి దిగువన మొగుడంపల్లి క్రాస్ రోడ్డు నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలను బిగించారు.

దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలి

నూతనంగా ప్రారంభించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టాలని జహీరాబాద్ ప్రజలందరూ ప్రభుత్వానికి వ డిమాండ్ చేసారు. జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు ప్రజలు అధిక శాతంలో ఉన్నారని, జాతి కుల వర్ణ బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కలగాలని ఆకాంక్షించిన వ్యక్తి దివంతనేత మొహమ్మద్ ఫరీదోద్దీన్ పేరు పెట్టడమే సమంజసం అని జహీరాబాద్ ప్రాంతంలో ముస్లింలు దళితులు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

◆ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్…

◆ అభివృద్ధి పనులపై సమీక్ష…

◆ సమస్య ఉంటే వెంటనే చెప్పండి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో అష్ట తీర్థాల సంగమంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే మార్గంలో పారిశుద్ధ్య, మొక్కల సంరక్షణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవి ధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూసు కోవాలన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అంద జేయాలన్నారు. మేదపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావే శంలో జిల్లా పరిషత్ సీఈవో జానకిరామ్ రెడ్డి, డీపీఓ సాయి బాబా, జహీరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిఎం నల్లమల పర్యటన.

‘సిఎం నల్లమల పర్యటన’

కల్వకుర్తి నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ మల్లు రవి పత్రిక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు గ్రామంలో గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరి జల సౌర వికాస్ పథకాన్ని రూ. 12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పత్రిక సమావేశం నిర్వహించి తెలియజేశారు. ఇందిర జల సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధికి,వారి సంక్షేమం కోసం,వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాడుతుంది అని ఎంపీ మల్లు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలోపాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ ,కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

చిట్యాల  నేటిధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తిప్పని లక్ష్మి మరియు తీర్తాల సుస్మిత కి హస్పెటల్ ఖర్చుల కొరకు నాయకుడు పేదలకు ఆధర్షవంతుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహయనిధి(సీఎం ఆర్ఎఫ్ )Rs. 52000/ల చెక్కులను చిట్యాల మండల కాంగ్రేస్ పార్టీ వర్క్ంగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్,అదజేయడం జరిగింది . ఈ కార్యక్రమం లోపిఎసియస్ వైస్ చైర్మెన్ ఏరుకొండ గణపతి గ్రామ శాఖ అధ్యక్షులు నీలం కుమార స్వామి నా యకులు తాటి కంటి మల్లయ్య, చెవుల రమేశ్, సంపెల్లి రాజు తదితరులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన పట్టణ బి.ఆర్. ఎస్ నాయకులు ఈరోజు శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణం వివిధ వార్డ్ లకు చెందిన 8 మంది లబ్ధిదారులకు గాను ₹2,56,500 విలువ గల చెక్కులను ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది..

లబ్ధిదారుల వివరాలు :-
పస్తాపూర్ కి చెందిన పల్లె అశోక్ ₹.20,000/- రంజోల్ కి చెందిన రిజ్వనా ఫాతిమా ₹.18,500/- & కళావతి ₹.11,500/- రచ్చన్నపేట్ కి చెందిన ధన లక్ష్మి ₹.24,500/- హమాలీ కాలనీకి చెందిన సుమయ్య ఫాతిమా ₹.14,000/- బస్వవేశ్వర స్ట్రీట్ కి చెందిన సంతోష ₹.54,000/- APHB కాలనీ కి చెందిన మానస ₹.21,000/- ఆర్యనగర్ కి చెందిన గౌరమ్మ ₹.42,000/-చిన్న హైదరాబాద్ కి చెందిన రవి ₹.51,000/-.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు……. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరి , మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ యాకూబ్, వెంకటేశం గుప్తా, పద్మజ, అశోక్ రెడ్డి, పాండు ముదిరాజ్, నరేష్ రెడ్డి లు పాల్గొన్నారు.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

హైదారాబాద్ నేటిధాత్రి:

రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version