భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

 

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి చెట్లు నాటుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం. మండపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు. 337. నంబర్లో 360 ఎకరాల. ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిపై కన్నేసిన భూకబ్జాదారులు రాత్రిపూట దున్నటం భూమిలో రాత్రికి రాత్రి చెట్లు నాటడంతో గ్రామంలోని గ్రామస్తులు శనివారం రోజున రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా ఆర్ ఐ. దినేష్. జిపిఓ. రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున. మండే పల్లి గ్రామానికి వెళ్లి భూములను పరిశీలించారు. గ్రామస్తులు అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధికి చెందాలి. అని అధికారులకు వివరిస్తూ భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నించడఏమిటి అని రాత్రిపూట చెట్లు పెట్టించడం ఏమిటని ఆరోపించారు ఇప్పటికే . గ్రామంలో భూమిని భూకబ్జాదారుల. ఆక్రమణకు గురవడంతో. గ్రామంలోని గ్రామపంచాయతీకి గాని పశువులు మేకలుమేయడానికి గాని. ఉపయోగించడానికి. వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటూ. గ్రామంలో పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా సంబంధిత అధికారులు రెవెన్యూ సిబ్బంది భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ భూములను కాపాడి ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T135534.081.wav?_=1

 

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామడుగు ఏఎస్ఐ మనోజ్ కుమార్, మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి మంచి నడవడికతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో ముందుకు సాగుతూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్, డయల్ 100, షీటీమ్స్, భరోసా, సైబర్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్, వంటి వివిధ నేర సంబంధిత అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది, అక్షర హై స్కూల్ విద్యార్ధిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T134752.297.wav?_=2

 

ట్రాన్స్ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం లో దొంగల హల్చల్,వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అవసరాల కొరకు ఏర్పాటు చేసినా ట్రాన్స్ఫార్మర్ ను పగులగొట్టి కాపర్ వైర్ దొంగిలించి ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు,

తెల్లవారుజామున గుర్తించిన స్ధానిక రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడం తో హెల్పర్ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూసి పోలీసులకు పిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు.

పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T133941.916.wav?_=3

 

పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రూపు నారాయణపేట గ్రామానికి చెందిన గుర్రం అక్షిత వయసు 18 సంవత్సరాలు విషపురుగు పాము కాటుకు గురై మృతి చెందింది. ఎస్పై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రూపు నారాయణపేట గ్రామానికి చెందిన గుర్రం అక్షిత వయసు 18 సంవత్సరాలు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత దీపావళి సెలవుల కోసం అని ఇంటికి వచ్చింది శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటిలో ఉండగా మంచంపై పడుకొని సెల్ ఫోన్ చూస్తుండగా ఏదో విషపు పాము | ఎడమకాలు కు కొట్టిందని అనడంతో ఇంటి పక్కన ఉన్న శ్రీధర్ 108 కి ఫోన్ చేసి చికిత్స కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించగా కరీంనగర్ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి మృతి చెందిందని చెప్పారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T132913.846.wav?_=4

 

 

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

– వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి

– కొనుగోళ్లు, తేమ శాతం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి

– క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా చూడాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు.
శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్ లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ – ఏ రకానికి రూ. 2,389, కామన్ రకానికి రూ. 2,369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓ లు, తహశీల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.
సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్, తహశీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T131924.726.wav?_=5

 

అంగన్‌వాడీ పాఠశాలలో పాములు కనిపించడం గందరగోళానికి కారణమైంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మునిసిపల్‌లోని సికందర్‌వాడి ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడి మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ సమీపంలో జంగి ఘన్స్ మరియు డ్రెయిన్‌ల నుండి మురికి నీరు పేరుకుపోయింది, దీని కారణంగా అంగన్‌వాడి పాఠశాలలోకి ఒక విషపూరిత పాము అకస్మాత్తుగా చొరబడింది, ఇది అమాయక పిల్లలలో గందరగోళానికి దారితీసింది మరియు స్థానికులందరూ గుమిగూడారు మరియు స్థానిక యువకులు బెదిరింపుతో ఆ పామును చంపారు. మరియు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు స్థానికులు దీని గురించి అంగన్‌వాడి కార్యకర్తలు మరియు ఉన్నతాధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి ప్రభావం లేదని చెప్పారు. అమాయక పిల్లలతో పాటు, గర్భిణీ స్త్రీలు కూడా ఈ పాఠశాలకు వచ్చి వెళ్తారని ప్రజలు చెప్పారు. మరియు మురికి నీటి గుంట యొక్క లోతు చాలా లోతుగా ఉంది, పాఠశాలకు వచ్చే పిల్లవాడు ఆడుకుంటూ అందులో పడిపోతే, అతను తన ప్రాణాలను కోల్పోతాడు. అందువల్ల, ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని మరియు పిల్లలు మరియు మహిళల భద్రత కోసం శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోహిర్ మండల అంగన్‌వాడి అధికారికి విజ్ఞప్తి చేశారు.

కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T131141.011.wav?_=6

 

కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి

పూజలకు అధికసంఖ్యలో హాజరైన మహిళలు

పరకాల నేటిధాత్రి

తెలంగాణలో అత్యంత ఘనంగా,భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో నాగుల చవితి ఒకటి.ఈ పండుగ సందర్భంగా నాగ దేవతలను,పుట్టలోని పాములను భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు.శనివారం నాగుల చవితి పండుగను పురస్కరించుకొని పరకాల పట్టణలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.మహిళలు పుట్టల్లో పాలు పోసి,మొక్కులు తీర్చుకున్నారు.

ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు.సనాతన విశ్వాసాల ప్రకారం,ఈ రోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం,ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.పూజా విధానంలో మొదటగా పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతను నమస్కరించడం పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి,వ్రతాన్ని ప్రారంభిస్తారు.వ్రతం చేసేటప్పుడు పూర్తి ఉపవాసం తప్పనిసరిగా పాటిస్తారు.

జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T130601.037.wav?_=7

 

జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్,ఇందిరమ్మ గృహ పథకం అమల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరు ఇండ్లను నిర్మించుకోవచ్చు అని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లిస్తామని, ఇండ్ల నిర్మాణాలను చేపట్టని గృహ లబ్దిదారులు వెంటనే పనులను ప్రారంభించాలని జిల్లా గృహ నిర్మాణాధికారి చలపతిరావు సూచించారు. శు క్రవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. గ్రామానికి 31 ఇండ్లు మంజూరు అవ్వగా 18 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానిక గృహ నిర్మాణ అధికారులు వివరించారు. జహీరాబాద్ డివిజన్ గృహ నిర్మాణాధికారి ఆంజనేయులు, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల ఏఈ శివానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిర, తదితరులతో కలిసి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికార పార్టీ శ్రేణులు పాండు రంగారెడ్డి, శ్రీకాంత్, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.

నూతన జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గంలో హాజరై మాజీ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T125803.161.wav?_=8

 

 

నూతన జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గంలో హాజరై మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ ఫోరమ్(జాహిరాబాద్ ) శాఖ ఆహ్వానం మేరకు పట్టణంలోని మంకల్ బంక్వెట్ హాల్లో జరిగిన నూతన జిల్లా జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ ఎంపికని పురస్కరుంచుకొని జరిగిన సన్మాన కార్యక్రమంలో హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందిస్తు ప్రజాస్వామ్యంలో నాలగవ స్తంభమైన పాత్రికేయులు అటు ప్రజలకు ఇటు అధికారులకు మధ్యలో వారధిగా ఉంటూ పని చెయ్యాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఫైసల్, మొహమ్మద్ హాజీ, మండలల అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మీర్ జావీద్ అలీ, నాయకులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

దిగ్వాల్ ఫిరమిల్ కెమికల్ కంపెనీలు ప్రజల ప్రాణాలకు ముప్పు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T124428.983.wav?_=9

 

దిగ్వాల్ ఫిరమిల్ కెమికల్ కంపెనీలు ప్రజల ప్రాణాలకు ముప్పు

◆:- ఈ ఇలాంటి కంపెనీలు తక్షణమే మూసివేయాలి

◆:- సంగారెడ్డి జిల్లా సాధన సమితి చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం దిగ్వాల్ గ్రామంలో కెమికల్ మాఫియాల రాజ్యం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు, హానికర రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పర్యావరణాన్ని తీవ్రంగా కాలుష్యం చేస్తోంది. గ్రామంలోని పలువురు ప్రజలు ఇప్పటికే కాళ్లు, చేతులు సన్నబడి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు, నీటి కాలుష్యం కారణంగా పశువులు మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఈ దుస్థితిని చూసి గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజల ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుని ఈ కెమికల్ మాఫియాలను తం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం తక్షణమే చర్యలు తీసుకుని ఈ కెమికల్ కంపెనీని మూసివేసి, ప్రజల ఆరోగ్య రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దిగ్వాల్ గ్రామంలో మళ్లీ ఇలాంటి విష రసాయనాల దందా కొనసాగితే, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి..

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల

మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు

ఆదివారపు సంత తాత్కాలిక మార్పు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల,నేటిధాత్రి

 

 

పట్టణంలో మున్సిపాలిటీ రోడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ ఆద్వర్యంలో తొలగించారు.ఈ సందర్భంగా కమిషనర్ సుష్మ మాట్లాడుతూ మున్సిసల్ పరిదిలో రోడ్లను ఆక్రమించుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబందనలు అతిక్రమిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతాయని పాత సీఎంఎస్ గోదాం సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కాంపౌండ్ నిర్మాణాన్ని తొలగించుటకు నోటీసులు జారీ చేసినప్పటికి ఆవ్యక్తి స్పందించకపోగా ఆ నిర్మాణాన్ని కూల్చివేత జరిపినట్టు తెలిపారు.

ప్రతి ఆదివారము నిర్వహించే పశువుల సంత తాత్కాలిక మార్పు

ప్రతిఆదివారము నిర్వహించే పశువులు,గొర్లు,మేకల సంతల స్థలంలో నవంబర్ 3న మహారుద్రయాగం ఉన్నందున ఏర్పాటు అవుతున్న పనులను పరిశీలించి 2వ తేదీన జరిగే పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు సమీపంలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో బుధవారం ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తోళ్ళ వాగు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల మోజెస్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.అతనిపై కేసు నమోదు చేసి,బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు…

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.

ఛలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలి…

ఛలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలి

బీసీ జేఏసీ జిల్లా చేర్మెన్ పైడిపెల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ భూపాలపల్లి జిల్లా కమిటి ఛైర్మెన్ పైడిపెల్లి రమేష్ హాజరై అనంతరం
మాట్లాడుతు జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ చిరంజీవులు, డా. విశారాధన్ మహారాజ్ నాయకత్వం లో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ 42% బిల్లు ను 9షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ తో ఇందిరా పార్క్ లో అక్టోబర్ 24న ధర్నా విజయవంతం చేయాలి జిల్లాలో ఉన్న బీసీ సంఘాల నాయకులకు,వివిధ కుల సంఘాల నాయకులు ఎస్టీ, యస్సి సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేసారు
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ గట్ల రాజన్న, కన్వీనర్లు జోగు బుచ్చన్న, కో కన్వీనర్లు బర్ల గట్టయ్య,క్యాతరాజు సాంబమూర్తి, అమృత అశోక్, కో ఆర్డినేటర్ శేఖర్ నాని కమిటి సభ్యులు తాటికంటి రవి కుమార్, కొండపర్తి ఇస్తారీ, యాదండ్ల గటయ్య, యూత్ నాయకులు పూర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఆకస్మికంగా స్కూల్స్ తనిఖీ చేసిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్…

ఆకస్మికంగా స్కూల్స్ తనిఖీ చేసిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ
జడ్జి చిలుక మారి పంచాక్షరి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలోని ఎం జె పి స్కూల్ అలాగే కస్తూర్బా స్కూల్ గ్రామపంచాయతీ భవనంలో విలేజ్ లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎం జె పి స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపాల్ తో కలిసి వంటగదిలను డైనింగ్ హాల్స్ టాయిలెట్స్ టీచింగ్ పరిశీలించి అనంతరం పంచాక్షరి జడ్జిగారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచి నాణ్యత మైన భోజనం అందించాలని మంచి చదువు బోధించాలని స్కూల్ ప్రిన్సిపాల్ లకు సూచించారు అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏ లక్ష్యం కోసం చూస్తున్నారో ఆ లక్ష్యం అందే వరకు పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పి ఎల్ వి మంగళపల్లి శ్రీనివాస్ ఎస్ ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు

అత్యవసర సమయంలో రక్తదానం….

అత్యవసర సమయంలో రక్తదానం.
మెట్ పల్లి అక్టోబర్ 22 నేటి ధాత్రి

 

మెట్పల్లి పట్టణంలోని అమృత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పల్లవి అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తంఅవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగా మెటపల్లి పట్టణంలోని 13వ వార్డు (రేగుంట)లో నివాసం ఉంటున్న బాల్క రాజేందర్ కి సమాచారం తెలుపగా రాజేందర్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.
అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన బాల్క రాజేందర్ (11వ సారి రక్తదానం) అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య…..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T134001.539.wav?_=10

 

అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)

పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజుపోలీస్‌ అమరవీరుల సంస్మరణలో
(పోలీస్ ఫ్లాగ్ డే)ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ…అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటు పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలన్నారు.
విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు.
● ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి.
● పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.
● నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి.
● మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి.
● పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు,వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.

● బాంబ్ స్క్వాడ్స్ ఏవిదంగా బాంబులను నివృత్తి చేస్తుంది,పోలీస్ జగిలాల పని తీరు పై అవగాహన కల్పించడం జరిగింది.
● విద్యార్థులకు ట్రాఫిక్ నియమలపై ఆవాహన కల్పించడం జరిగింది.హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్,ర్యాష్ చేయవద్దని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించడం జరిగింది.
● సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది.
పైవిషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, IT Core, భరోసా సిబ్బంది,షిటీమ్,ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T131211.924.wav?_=11

 

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మునిసిపాలిటీ మాజీ ప్రతినిధి కౌన్సిలర్ ముహమ్మద్ అథర్ గౌరి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికా అర్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి విద్యావంతులైన పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు, సంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అని, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారని, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T130127.741.wav?_=12

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version