ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.
