నూతన జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గంలో హాజరై మాజీ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ ఫోరమ్(జాహిరాబాద్ ) శాఖ ఆహ్వానం మేరకు పట్టణంలోని మంకల్ బంక్వెట్ హాల్లో జరిగిన నూతన జిల్లా జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ ఎంపికని పురస్కరుంచుకొని జరిగిన సన్మాన కార్యక్రమంలో హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందిస్తు ప్రజాస్వామ్యంలో నాలగవ స్తంభమైన పాత్రికేయులు అటు ప్రజలకు ఇటు అధికారులకు మధ్యలో వారధిగా ఉంటూ పని చెయ్యాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఫైసల్, మొహమ్మద్ హాజీ, మండలల అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మీర్ జావీద్ అలీ, నాయకులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.
