అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో బుధవారం ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తోళ్ళ వాగు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల మోజెస్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.అతనిపై కేసు నమోదు చేసి,బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
