మొగుళ్ళపల్లిలోని వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన
* తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ (జడ్జి) చిలుకమారి పంచాక్షరి గారు.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎం. జె. పి స్కూల్ అలాగే కస్తూర్బా స్కూల్, గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన విలేజ్ లీగల్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ (జడ్జి) చిలుకమారి పంచాక్షరీ గారు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల ప్రిన్సిపాల్స్ తో కలిసి వంటగదులను, డైనింగ్ హాల్స్, టాయిలెట్స్ మరియు తరగతి గదులను జడ్జి గారు పరీశిలించారు. అనంతరం పంచాక్షరి జడ్జిగారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచి నాణ్యతమైన భోజనం అందించాలని ,మంచి చదువు బోధించాలని, స్కూల్ ప్రిన్సిపాల్ లకు సూచించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏ లక్ష్యం కోసం చూస్తున్నారో ఆ లక్ష్యం అందే వరకు ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని జడ్జి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బి అశోక్ పి.ఎల్.వి మంగళపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
