“ప్రేమ పిలుపు.. కన్నపేగు నిట్టూర్పు”

“ప్రేమ పిలుపు.. కన్నపేగు నిట్టూర్పు”

“నాన్న.. నేను ఓ ఉద్యోగిని ప్రేమించా”

కన్నీళ్లు మిగిల్చిన.. డిగ్రీ విద్యార్థి లెటర్.

నవాబుపేట /నేటి ధాత్రి

నవ మాసాలు మోసిన తల్లిదండ్రుల ప్రేమ కాదని.. ఓ డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి పాలమూరు పట్టణంలోని పిల్లలమర్రి వెళ్ళే దారిలో ఓ వసతి గృహంలో ఉంటూ.. డిగ్రీ చదువుతోంది. సోమవారం ఆ విద్యార్థి కళాశాలకు వెళ్ళవలసి ఉంది. కుటుంబ సభ్యులు పనికి వెళ్లడంతో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న విద్యార్థి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. చివరికి ధాన్యం సంచుల మధ్య ఉత్తరం రాసి ఉంది. ఆ ఉత్తరంలో..”నాన్న నేను ఓ ఉద్యోగిని ప్రేమించాను.. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న” అని రాసింది. ఉత్తరాన్ని చూసి కన్న తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. చదువుకుంటుందని భావించిన తల్లిదండ్రులు.. లెటర్ రాసి వెళ్లిపోవడంతో ఏం చేయలేని లేని పరిస్థితులు అయోమయానికి గురయ్యారు. చివరికి ఆదివారం నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నవమాసాలు మోసిన కన్న తల్లిదండ్రుల ప్రేమ కాదని.. పడచు వయసులో వచ్చిన ప్రేమ గొప్పదా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే చివరికి కన్నీళ్లే మిగులుతాయని గ్రామస్తులు అనుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version