దిగ్వాల్ ఫిరమిల్ కెమికల్ కంపెనీలు ప్రజల ప్రాణాలకు ముప్పు
◆:- ఈ ఇలాంటి కంపెనీలు తక్షణమే మూసివేయాలి
◆:- సంగారెడ్డి జిల్లా సాధన సమితి చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం దిగ్వాల్ గ్రామంలో కెమికల్ మాఫియాల రాజ్యం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు, హానికర రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పర్యావరణాన్ని తీవ్రంగా కాలుష్యం చేస్తోంది. గ్రామంలోని పలువురు ప్రజలు ఇప్పటికే కాళ్లు, చేతులు సన్నబడి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు, నీటి కాలుష్యం కారణంగా పశువులు మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఈ దుస్థితిని చూసి గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజల ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుని ఈ కెమికల్ మాఫియాలను తం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం తక్షణమే చర్యలు తీసుకుని ఈ కెమికల్ కంపెనీని మూసివేసి, ప్రజల ఆరోగ్య రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దిగ్వాల్ గ్రామంలో మళ్లీ ఇలాంటి విష రసాయనాల దందా కొనసాగితే, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
