కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి
పూజలకు అధికసంఖ్యలో హాజరైన మహిళలు
పరకాల నేటిధాత్రి
తెలంగాణలో అత్యంత ఘనంగా,భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో నాగుల చవితి ఒకటి.ఈ పండుగ సందర్భంగా నాగ దేవతలను,పుట్టలోని పాములను భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు.శనివారం నాగుల చవితి పండుగను పురస్కరించుకొని పరకాల పట్టణలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.మహిళలు పుట్టల్లో పాలు పోసి,మొక్కులు తీర్చుకున్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు.సనాతన విశ్వాసాల ప్రకారం,ఈ రోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం,ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.పూజా విధానంలో మొదటగా పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతను నమస్కరించడం పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి,వ్రతాన్ని ప్రారంభిస్తారు.వ్రతం చేసేటప్పుడు పూర్తి ఉపవాసం తప్పనిసరిగా పాటిస్తారు.
