రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవరణలో చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నెంబర్ మల్లన్న పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాజీ వార్డ్ మెంబర్ ఆన్సర్ సీనియర్ నాయకులు ల్యాఖత్ అలీ రాజేందర్ సింగ్ అశ్విరఫ్ అలీ రజాక్ రవి కృష్ణ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు,