సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని గాంధీ చౌక్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కన్వీనర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సిరిసిల్ల నిర్వహించడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండ పేదల పెన్నిధిగా మహోన్నత వ్యక్తిగా, ఇది నిన్న రాజీవ్ గాంధీ ఎంతోమంది పేదలకు అండదండగా ఉంటూ ముందుకు సాగరం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా నేడు తెలంగాణలో పేదల ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాంగ ముందుకు వస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సూర దేవరాజ్, మాజీ కౌంటర్ ఎల్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.