అక్కడ ఆ పోస్టు ఖాళీ..
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో నాయబ్ తహసీల్దార్ (డీటీ) పోస్టు గత 12 రోజులుగా ఖాళీగానే ఉంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో నాయబ్ తహసీల్దార్ (డీటీ) పోస్టు గత 12 రోజులుగా ఖాళీగానే ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ నెల 9న కొంతమంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను డిప్యూటేషన్పై బదిలీ చేశారు. ఝరాసంగం మండలంలో పనిచేస్తున్న కరుణాకర్ రావు డిప్యూటేషన్పై పత్నూర్ మండలానికి వెళ్లారు. అయితే ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరూ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టలేదు. వివిధ గురుకులాలు, పాఠశాలలు, విద్యాసంస్థలలో ప్రవేశాల కోసం అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న డీటీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని ఝరాసంగం మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.
