అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం
◆:- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి .
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో ని మాచునూర్ గ్రామంలో గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మించింది. నేటి ప్రభుత్వం దానిని గాలికి వదిలేసింది. ఎన్నో లక్షలు వేచించి. ప్రజల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడల పట్ల ఆసక్తి చూపడానికి, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి మాచునూర్ గ్రామంలో సర్వే నంబర్ 37/ఒక ఎకరం భూమిని కేటాయించింది. అట్టి భూమిలో క్రీడా ప్రాంగణం చుట్టూ కొన్ని మొక్కలు నాటడం జరిగింది. కోకో, వాలీబాల్, కబడ్డీ, శరీర దారుణ్యాన్ని పెంపొందించడానికి ఎక్ససైజ్ చేయడానికి అక్కడ కొన్ని స్తంభాలు నిర్మించడం జరిగింది. క్రీడలకు అనుకూలంగా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి పట్టించుకోని నాధుడు లేడు. కొన్ని స్తంభాలు విరిగిపోవడం. క్రీడా ప్రాంగణంలో అడవిని తలపించేలాగా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడం జరిగింది. సంబంధిత అధికారులు పిచ్చి మొక్కలను తొలగించి స్తంభాలకు మరమ్మత్తులు చేయించి, క్రీడలకు అనుకూలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
